EPAPER

Prabhas: వాట్ ఈజ్ దిస్ కన్ఫ్యూజన్ డార్లింగ్..అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: వాట్ ఈజ్ దిస్ కన్ఫ్యూజన్ డార్లింగ్..అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
Prabhas

Prabhas: పాన్ ఇండియన్ స్టార్స్ క్రేజ్ మొదలుపెట్టిన యాక్టర్… టాలీవుడ్ బాహుబలి…మన డార్లింగ్ ప్రభాస్. గత కొద్ది కాలంగా మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్న డార్లింగ్ …. ప్రస్తుతం బడా బడ్జెట్ ప్రాజెక్ట్స్ తో చాలా బిజీ గా ఉన్నాడు. అన్నీ అనుకున్న సమయానికి పూర్తి అయితే ఈ సంవత్సరం ప్రభాస్ మూవీస్ వరుసగా విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. మొన్న రిలీజ్ అవ్వాల్సి ఉండి వాయిదా పడ్డ చిత్రం సలార్ కోసం డార్లింగ్ ఫాన్స్ ఎక్కువ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల చేత డిసెంబర్ కు వాయిదా పడ్డ విషయం తెలిసిందే.


ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గానే కాకుండా పాన్ వరల్డ్ స్టార్ గా నిలబెట్టిన చిత్రం బాహుబలి. 2015, 2017 సంవత్సరాలలో విడుదలైన బాహుబలి 1 ,బాహుబలి 2 బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించడమే కాకుండా ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఆ తర్వాత ప్రభాస్ నుంచి ఆ రేంజ్ హిట్స్ ఎక్స్పెక్ట్ చేసిన అభిమానులకు నిరాశ ఎదురవుతోంది. బాహుబలి తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన సాహో, రాధ్యే శ్యామ్ రెండు డిజాస్టర్స్ గా మిగిలాయి. ఇక రీసెంట్ గా రాముడి చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన మైథాలజికల్ మూవీ ఆదిపురుష్ సక్సెస్ మాట పక్కన పెడితే…మూవీ పై విమర్శలు వెల్లువెత్తాయి.

గట్టిగా ఇంకా రెండు నెలలు కూడా టైం లేదు …పైగా ప్రభాస్ మూవీ అంటే ఏ రేంజ్ లో హైప్ ఉండాలి…కాబట్టి మామూలుగా అయితే ఇప్పటికీ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ హడావిడి మొదలు కావాలి. అయితే ఇంకా ఎక్కడ సలార్ హడావిడి కనిపించడం లేదు కానీ అప్పుడే పుట్టిన రోజు హడావిడి మాత్రం స్టార్ట్ అయింది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు.. డార్లింగ్ ఫాన్స్ కి పెద్ద క్రేజీ అప్డేట్ వస్తుంది అని డై హార్డ్ ఫ్యాన్స్ వెయిటింగ్. మరోపక్క డార్లింగ్ బర్త్ డే ట్రీట్ గా రెండవ ట్రెయిలర్ ను కూడ విడుదల చేయడానికి డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారట.


ప్రస్తుతం ప్రభాస్ లిస్టులో సలార్ తో పాటు….కల్కి 2898, ఆత్మ లాంటి మూవీస్ ఉన్నాయి. సలార్ మూవీ ఈ డిసెంబర్ కు విడుదల కాబోతుండగా కల్కి వచ్చే సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఈ సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్ కచ్చితంగా ప్రభాస్ బర్త్ డే కి వస్తుందా లేదా అన్న కన్ఫ్యూషన్ నెలకొని ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపు కుంటే కల్కి చిత్రం నుంచి కూడా ఆ రోజు పోస్టర్ లేదా ఒక కొత్త టీజర్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క మారుతి మొదటి నుంచి తాను తీస్తున్న చిత్రం గురించి ఎంతో సీక్రసీ మెయింటైన్ చేస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి షూటింగ్ దశలో ఉన్న మారుతి మూవీ నుంచి మాత్రం ఎటువంటి అప్డేట్స్ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

Related News

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Big Stories

×