Viswam Movie OTT: ఈ మధ్యకాలంలో ఓటీటీ ఎంత ప్రభావం చూపిస్తుందో అందరికి తెల్సిందే. థియేటర్ వరకు వెళ్లి ఎవరు చూస్తారు.. కొన్నిరోజుల్లో ఓటీటీలో వస్తుంది కదా అని లైట్ తీసుకుంటున్నారు. పిరియాడికల్, మైథలాజికల్ సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి చూడడానికి మొగ్గుచూపుతున్నారు. ఇక ఏ సినిమా అయినా కూడా ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. ఈ మధ్య మేకర్స్.. ఆ ప్రమోషన్స్ కూడా చేయడం మానేశారు.
కొన్ని సినిమాలు థియేటర్ లో ప్లాప్ టాక్ ను తెచ్చుకున్నా.. ఓటీటీలో వచ్చాక మాత్రం మంచి విజయాన్నే అందుకుంటున్నాయి. ఇలా చాలా సినిమాలకు జరిగింది. అంతేకాకుండా కొన్ని సినిమాలు ఓటీటీలోకి అడుగుపెట్టేముందు మేకర్స్.. ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. దానివలన కూడా కొంతవరకు హైప్ క్రియేట్ అవుతుంది. అయితే మరికొన్ని సినిమాలు థియేటర్ నుంచి ఎప్పుడు వెళ్లిపోయాయి.. ఓటీటీకి ఎప్పుడు వచ్చాయో కూడా తెలియకుండా పోతుంది. ఇదే కోవలోకి చేరింది విశ్వం సినిమా.
Jagapathi Babu: ఓవర్ యాక్షన్ చేశా.. ఎలా ఉంది
మ్యాచో స్టార్ గోపీచంద్, కావ్య థాపర్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విశ్వం. గత కొన్నాళ్లుగా గోపీచంద్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక శ్రీను వైట్ల మంచి కమ్ బ్యాక్ కోసం చూస్తున్నాడు. వీరిద్దరికి విశ్వం హిట్ ఇస్తుందని ప్రేక్షకులు అనుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకొని వెళ్లిన ప్రేక్షకులకు మళ్లీ నిరాశనే ఎదురయ్యింది.
విశ్వం సినిమా కథ అంతా రొటీన్ గా ఉందని, శ్రీను వైట్ల మార్క్ కనిపించలేదని ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇకపోతే చాలామంది ఓటీటీకి వస్తే చూద్దామని ఎదురుచూస్తున్నారు. అయితే అలాంటి అభిమానులకు గుడ్ న్యూస్. విశ్వం సినిమా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అదేంటీ.. చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. కనీసం ఓటీటీలోకి వస్తుందని ఒక అప్డేట్ అయినా ఇవ్వాలి కదా.. ఇలా అయితే ఎలా మాస్టారూ అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
Pawan Kalyan: ఫ్యాన్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన పవన్.. ఇంకోసారి ఓజీ అంటే.. ?
ఇక విశ్వం కథ విషయానికొస్తే.. విద్యార్థులను చదువు పేరుతో టెర్రరిస్టులుగా మారుస్తూ ఉంటాడు ఒక టెర్రరిస్ట్. దానికి కేంద్రమంత్రి తమ్ముడు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఇక ఈ విషయం కేంద్రమంత్రికి తెలియడంతో టెర్రరిస్టు అతనిని చంపేశాడు. అతని హత్యను ఒక చిన్న పాప చూస్తుంది. ఆ పాపను కేంద్రమంత్రి తమ్ముడు చంపబోతుండగా విశ్వం కాపాడతాడు. అసలు ఆ చిన్నారి ఎవరు.. ? విశ్వం ఎవరు.. ? టెర్రరిస్టు ప్లాన్ ను విశ్వం ఎలా నాశనం చేశాడు..? అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్వం సినిమా రొటీన్ అయినా కామెడీ మాత్రం బాగానే పండిందని ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. కావ్య థాపర్ అందాలు , గోపీచంద్ నటన బావున్నాయని ప్రేక్షకులు తెలిపారు. వెంకీలో హైలైట్ అయిన ట్రైన్ సీన్ లాంటిదే.. విశ్వంలో కూడా చూపించారు. కామెడీ పరంగా సినిమా చాలా బావుందని టాక్ వచ్చింది. మరి థియేటర్ లో అలరించలేని ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.