EPAPER

Viswam Censor : మూవీ చూసి బెదిరిపోయిన సెన్సార్ బోర్డ్… మొత్తం 14 కట్స్.. ఏ సీన్స్ కట్ చేశారంటే..?

Viswam Censor : మూవీ చూసి బెదిరిపోయిన సెన్సార్ బోర్డ్… మొత్తం 14 కట్స్.. ఏ సీన్స్ కట్ చేశారంటే..?

Viswam Censor.. ప్రముఖ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో స్టార్ హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం విశ్వం (Viswam ). మరో మూడు రోజుల్లో అనగా అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉండగా.. చిత్రాలయం స్టూడియోస్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగం అయ్యారు. వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న గోపీచంద్, ఈ ఏడాది భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా..ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.


ఈ నలుగురికి ఈ సినిమా సక్సెస్ అత్యంత కీలకం..

మరోవైపు డైరెక్టర్ శ్రీను వైట్ల కూడా ఆగడు, బ్రూస్లీ, అమర్ అక్బర్ ఆంటోనీ, మిస్టర్ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు అందుకున్నారు. ఇక హీరోయిన్ కావ్య థాపర్ కూడా ఒక్క సినిమాతో విజయాన్ని అందుకోలేదు. మరొకవైపు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా సక్సెస్ కోసం ఆరాటపడుతున్నారు. ఇలా వీరందరికీ కూడా ఈ సినిమా సక్సెస్ అత్యంత కీలకంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2:36 గంటల నిడివి తో రన్ టైం లాక్ అయ్యింది. మరోవైపు సినిమా చూసి బెదిరిపోయిన సెన్సార్ బోర్డు ఏకంగా 14 సన్నివేశాలపై కోత విధించడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా చిత్ర బృందం కూడా షాక్ లోకి వెళ్లినట్లు సమాచారం. మరి సెన్సార్ కట్ చేసిన ఆ 14 సన్నివేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.


సెన్సార్ బిత్తర పోయి కట్ చేసిన 14 సన్నివేశాలు ఇవే..

1). సినిమాలో వచ్చే రెస్టారెంట్ కి తంగేడు అనే పేరుకు బదులుగా ద్వారక అని మార్చారట.

2). అలాగే ఒక సన్నివేశంలో బద్దలు అనే పదానికి బదులుగా ఒళ్ళుగా వాయిస్ మార్పించినట్లు సమాచారం

3). హీరో గోపీచంద్ మరియు హీరోయిన్ కావ్య థాపర్ మధ్య వచ్చే ఒక రొమాంటిక్ సాంగ్లో.. హీరోయిన్ గ్లామర్ షో తో శృతిమించడంతో దానిని కాస్త కొంచెం బ్లర్ చేసినట్లు తెలుస్తోంది.

4). సినిమా మొదలైన 1:13:14 సెకండ్ల నిడివి వద్ద ఒక విలన్ చెయ్యి నరికే సన్నివేశం ఉంటుందట. ఆ నరకబడిన చేయని చూపించకుండా కొంచెం ఫార్వర్డ్ చేసినట్లు సమాచారం.

5). 1:15:22 సమయం వద్ద ఒక గన్ నుండి వచ్చే బుల్లెట్ ను సైడ్ షాట్ చేసి చూపించారట.

6). 1:16:50 గంటల వద్ద మితిమీరిన వయోలెన్స్ కలిగిన సన్నివేశాలను డిలీట్ చేసినట్లు సమాచారం.

7). ఒక రౌడీ నుదుటికి కత్తి దిగిన సన్నివేశాన్ని డిలీట్ చేయకుండా.. దానిని బ్లర్ చేసినట్లు సమాచారం.

8). అలాగే డెడ్ బాడీ విజువల్స్ ని కూడా డిలీట్ చేసి.. అదే సీన్లో వచ్చే కొన్ని విజువల్స్ ని కూడా డిలీట్ సమాచారం.

9). ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ లో వచ్చే సన్నివేశాలలో రైల్వే అనే పదాన్ని కూడా మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే ఆ పదం వాడిన తీరు రైల్వే వారిని నొప్పించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

10). ఆడవాళ్లపై కమెడియన్ చేయి చేసుకున్న విజువల్స్ ని కూడా అక్కడ డిలీట్ చేశారు. కెమెరా యాంగిల్స్ మార్చిన వాటిని రీప్లేస్ చేసినట్లు సమాచారం.

11). అంతేకాదు హీరో.. విలన్ గ్యాంగ్ పై చేసే దాడిలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండడంతో వాటిని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.

12). డెడ్ బాడీ విజువల్స్ ని కొంచెం బ్లర్ చేసి చూపించినట్టు తెలుస్తోంది.

13). ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఒక సన్నివేశంలో మితిమీరిన రక్తపాతాన్ని సీజ్తో కవర్ చేసినట్లు తెలుస్తోంది.

14). క్లైమాక్స్ లో ఒక టెర్రరిస్ట్ వేలు కట్ చేసే సన్నివేశాన్ని కూడా డిలీట్ చేయాలనుకున్నారట..ఆ తర్వాత దాని డిలీట్ చేయకుండా ఆ విజువల్స్ మాత్రమే కొన్నింటిని డిలీట్ చేయించినట్లు సమాచారం.

Related News

Rajinikanth: 33 ఏళ్ల తర్వాత మరోసారి.. ఎవర్‌గ్రీన్ కాంబో ఈజ్ బ్యాక్

T.P.Madhavan: ప్రముఖ నటుడు టీపీ మాధవన్ మృతి..

NBK 109: బాలయ్య ఫ్యాన్స్ కు దసరా ట్రీట్ రెడీ.. ఫ్యాన్స్ కు పండగే..

Maheshwari: శ్రీదేవిది సహజ మరణం కాదు.. ఆమె చెల్లెలు మహేశ్వరి ఏం చెప్పిందంటే..?

Janaka Aithe Ganaka Censor : ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పచ్చి బూతులు… అమ్మబాబోయ్ భరించలేం..

Vettaiyan: రజినీకాంత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘వేట్టయాన్’ స్పెషల్ స్క్రీనింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్

Big Stories

×