EPAPER

Vishwambhara: సోప్ యాడ్ అంటూ.. అప్రిసేషన్ కన్నా ట్రోలింగ్ ఎక్కువైపోయింది

Vishwambhara: సోప్ యాడ్ అంటూ.. అప్రిసేషన్ కన్నా ట్రోలింగ్ ఎక్కువైపోయింది

Vishwambhara: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలలో విశ్వంభర ఒకటి. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. కానీ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ చేంజర్ సినిమా కోసం ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసారు. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వశిష్ట చేస్తున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమా మీద అందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష ఈ సినిమాలో నటిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవుతుంది అని అందరూ ఆశపడ్డారు. మామూలు సీజన్లో కంటే కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే ఒక సినిమాకి కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తాయి అని చెప్పాలి. అందుకే అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రతి సంక్రాంతికి తమ బ్యానర్ నుంచి ఒక సినిమా వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. సంక్రాంతి అనగానే ఖచ్చితంగా ఆ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది. ఇకపోతే విశ్వంభర సినిమా డేట్ కు దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా విడుదలవుతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. కాగా నిన్న విజయదశమి సందర్భంగా విశ్వంభర సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు. ఈ టీజర్ కి మిశ్రమ స్పందన లభిస్తుంది.

కొంతమంది విజువల్స్ బాగున్నాయి అంటే ఇంకొంతమంది ఏదో సోప్ యాడ్ చూసినట్లు ఉంది అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఏకంగా ఫుటేజ్ కూడా ఎక్కడి నుంచో కాపీ కొట్టొచ్చారు అని కొన్ని సినిమాల స్క్రీన్ షాట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్ టైమ్స్ లో విఎఫ్ఎక్స్ మీద ఏ రేంజ్ లో డిస్కషన్ జరుగుతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆదిపురుష్ సినిమా వచ్చినప్పటినుంచి విఎఫ్ఎక్స్ మీద డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. హనుమాన్ వంటి సినిమాకి మంచి వి ఎఫ్ ఎక్స్ స్టాండర్డ్స్ తీసుకొచ్చారు. పెద్ద సినిమాలకు ఇలా ఎందుకు చేస్తున్నారని సోషల్ మీడియాలో చాలామంది డిస్కషన్స్ మొదలుపెట్టారు.


ఇకపోతే బింబిసారా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వశిష్ట. దాదాపు కళ్యాణ్ రామ్ కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో ఈ సినిమా ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ అయింది. ఈ జోనర్ లో తెలుగు సినిమాలు వచ్చి చాలా రోజులు అయిపోయింది. బింబిసారా మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. బింబిసార సీక్వెల్ పైన కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇక విశ్వంభర సినిమా కూడా సోషియో ఫాంటసీగా తెరకెక్కుతుంది. గతంలో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎలా ఉందో ఈ సినిమా కూడా అలానే ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Related News

Rajamouli : రాజమౌళి న్యూ లుక్ అదుర్స్.. అక్కడ పెంచావు.. ఇక్కడ తగ్గించావు..

Bhumika: భర్తతో భూమిక విడాకులు.. ఆ హీరో వల్లేనా?

Ram Charan: రామ్ చరణ్ కి ఇది మొదటి సారి కాదు, ఇలా చాలాసార్లు త్యాగం చేసాడు

Nbk109: బాలయ్య సినిమా కోసం వెరైటీ టైటిల్స్

Lokesh Kanagaraj: కూలి సినిమా కోసం బాలీవుడ్ బిగ్ స్టార్ ను లైన్ లో పెట్టిన లోకేష్

Viswambhara Teaser : సీన్స్ అన్నీ కాపీనే… ఈ కాపీ పేస్ట్ డైరెక్టర్ ను మెగాస్టార్ ఎలా నమ్మాడో..

Big Stories

×