EPAPER

Gaami Twitter Review: గామి ట్విట్టర్ రివ్యూ.. తప్పకుండా చూడాల్సిన చిత్రం

Gaami Twitter Review: గామి ట్విట్టర్ రివ్యూ.. తప్పకుండా చూడాల్సిన చిత్రం


Vishwak Sen Gaami Twitter Review: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ అత్యంత తక్కువ సమయంలో మంచి హిట్లు అందుకొని తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్ల వద్ద ప్రేక్షకాభిమానులు బారులు తీరుతారు.

అంతటి క్రేజ్ ఉంది విశ్వక్ సేన్‌కి. అయితే విశ్వక్ చాలా తక్కువ సినిమాలే చేశాడు అయినా.. ఎనలేని ప్రేక్షకాదరణ సంపాదించుకున్నాడు. కాగా విశ్వక్ తీసిన సినిమాల్లో తాజా మూవీ గామి మీద వచ్చినంత బజ్ మరే చిత్రానికి రాలేదని చెప్పాలి. ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌తో సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ అయింది.


ట్రైలర్ చూస్తే అసలు ఇది తెలుగు సినిమానేనా? అనేట్టుగా ఉంది. ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులు ఈ రోజు థియేటర్లలో వీక్షించేవచ్చు. నేడు గామి సినిమా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి టాక్ ట్విట్టర్‌లోకి వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

READ MORE: ముఖం గుర్తుండదు.. వింత రోగంతో హీరో సుహాస్.. ‘ప్రసన్నవదనం’ టీజర్ రిలీజ్

ఈ మూవీలో విశ్వక్ సేన్ తన నటనతో అదరగొట్టేశాడని అంటున్నారు. విజువల్స్, సౌండింగ్, ఎంట్రీసీన్ ఓ రేంజ్‌లో ఉన్నాయని ట్వీట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు.. గామి సినిమా అందరికీ అర్థం అవుతుందా? లేదా? అన్నది చెప్పలేను గాని.. రెండోసారి ఓపికతో చూస్తే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ దుమ్ముదులిపేసింది. ఇక సెకండ్ హాఫ్ పర్వాలేదు. అంతేకాకుండా బీజీఎం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ మూవీకి ముఖ్యంగా చివరి 30 నిమిషాలే హైలెట్‌గా ఉంటుంది అని రాసుకొచ్చాడు.

https://twitter.com/tonygaaaadu/status/1765897245260492812?

మరో నెటిజన్ స్పందిస్తూ.. విశ్వక్ సేన్ నటన అద్భుతంగా ఉంది. ఇందులో అఘోరాలా ఎంట్రీ సీన్.. టైటిల్ రివీల్, సౌండ్ డిజైన్ ఇలా అన్నీ అదిరిపోయాయి. ఫస్ట్ హాఫ్ అందరినీ ఆకట్టుకుంటుంది కానీ, సెకండాఫ్ కాస్త స్లో అనిపిస్తుంది. విజువల్స్, సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్ అద్భుతంగా ఉంటాయి. విశ్వక్, చాందినీ వారి నటనతో బాగా అలరించారని రాసుకొచ్చారు.

గామి సినిమా చూశాను. ఇలాంటి స్టోరీ నమ్మి ఐదేళ్లు కష్టపడ్డ కార్తిక్‌కు హ్యాట్సాఫ్. విద్యాధర్ ఇలాంటి అవుట్‌పుట్ కోసం చాలానే కష్టపడ్డాడు. సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.

గామి సినిమా ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. సెకండాఫ్ అంత ఎంగేజింగ్‌గా లేదు. టెక్నికల్‌గా మూవీ సూపర్. రీసెంట్‌గా వచ్చిన సినిమాల్లో ఇదే బెస్ట్ సినిమాటోగ్రఫీ.ఈ మూవీని తప్పకుండా చూడొచ్చు అని అంటున్నారు.

READ MORE: మాస్ అండ్ స్టైలిష్ లుక్‌లో శర్వానంద్.. బర్త్ డే రోజున ఇన్ని సినిమాలా

గామి మూవీలో మ్యూజిక్, విశ్వక్ సేన్ అభినయ యాక్టింగ్స్, సినిమాటోగ్రఫీ అదుర్స్.. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అనిపించింది. మూడు స్టోరీలను మిక్స్ చేసి అద్భుతంగా తెరకెక్కించారు. ట్విస్టులు బాగున్నాయి. కాకపోతే సెకండాఫ్‌లో కాస్త స్లో అనే ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయని చెప్పుకొస్తున్నారు.

 

Tags

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×