EPAPER

Pushpa Vijayaka: విశాఖలో వివాదంగా మారిన వినాయక ‘పుష్ప’..ఇదేం పిచ్చిరా నాయనా?

Pushpa Vijayaka: విశాఖలో వివాదంగా మారిన వినాయక ‘పుష్ప’..ఇదేం పిచ్చిరా నాయనా?

Visakhapatnam Pushpa get up lord Vinayaka statue..video viral: వెర్రి వేయి రకాలు.. కొంత మంది క్రియేటివిటీ పేరుతో భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. తమ ట్యాలెంట్ నంతా ప్రదర్శిస్తూ అదేదో గొప్ప కార్యం చేసినట్లుగా ఫీలవుతుంటారు. దానికి వేదికలుగా దేవుడి మండపాలను ఎంచుకుంటున్నారు. దేశమంతటా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గణేష్ నవరాత్రులు జరిపి పదో రోజున నిమజ్జనం చేస్తారు. అయితే ఈ తొమ్మిది రోజులూ మండపాలను చక్కగా అలంకరిస్తారు. ఒకరిని మంచి మరొకరు అన్నట్లుగా భారీ విగ్రహాలను తెస్తుంటారు. అయితే అక్కడిదాకా బాగానే ఉంది. కొందరు సోషల్ మీడియా క్రేజ్ తో వర్తమాన పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని గణేష్ విగ్రహాలను ప్రత్యేకంకగా రూపొందిస్తుంటారు.


రకరకాల గెటప్పులలో వినాయకుడు

కొందరు తమ ప్రియతమ రాజకీయ నాయకుల గెటప్ లో వినాయకులను చూద్దామనుకుంటారు. ప్రధాని మోదీ వస్త్రాలంకరణతో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం చూశాం. అలాగే మరికొన్ని చోట్ల అప్పట్లో బాహుబలి మూవీ రిలీజయిన సంవత్సరంలో వినాయకుడికి ప్రభాస్ గెటప్ వేసి అభిమానులు పండుగ చేసుకున్నారు. ఇప్పుడు కల్కి మూవీ ఎఫెక్ట్ తో అశ్వద్ధామ గెటప్ లో వినాయకుడిని తీర్చిదిద్దారు హైదరాబాద్ లో. ఇలా ఎవరికి తోచినవిధంగా వాళ్లు భక్తిభావాన్నిప్రదర్శిస్తుంటారు. ఒక సారి అంతర్జాతీయ టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్ ను కాల్చిపారేసే సైనికుడి గెటప్ లో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయించారు. మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. ఒకప్పుడు చెరువులలో మట్టి పేరుకుపోవడంతో వర్షాకాలంలో వరద నీరు బయటకు వచ్చి ఇళ్లను ముంచెత్తేది. అందుకే వర్షాకాలంలో వచ్చే వినాయక చవితి పండుగ రోజున మట్టితో తయారు చేసే విగ్రహాలను ఉపయోగించమని చెబుతారు. కనీసం దేవుడి పేరుతో చెరువులలోని మట్టిని బయటకు తీయడంతో నీరు ప్రశాంతంగా పారుతూ ఎక్కడా ఆగకుండా వెళిపోతుంది. అక్కడినుండి పంట పొలాలకు నీరు చేరుకుని.. సమృద్ధిగా పాడి పంటలు ఇస్తుంది.


కెమికల్ రంగులతో విగ్రహాలు

పదో రోజు నిమజ్జనం వెనుక కూడా ఓ రహస్యం ఉంది. ఇలా మట్టి విగ్రహాలను తెచ్చి మళ్లీ అదే చెరువులలో కలపడంతో ఆ మట్టి కరిగి మళ్లీ పంటపొలాలకు వచ్చి చేరుకుంటుంది. అది సారవంతమైన మట్టి కాబట్టి పంటలు బాగా పండేందుకు సహకరిస్తుంది. అయితే ప్రస్తుతం యువత మట్టి విగ్రహాల మహత్యం తెలియక రసాయన రంగులు కలిపిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్స్ తో రూపొందించిన వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. వాటిని చెరువులలో కలిపి నీటిని కాలుష్యంగా మారుస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే తమ అభిమాన హీరోల గెటప్పులతో వినాయక విగ్రహాలను చేయించుకుని ఆనందిస్తున్నారు.

మండపాలలో ఐటం సాంగ్స్

ఈ ఏడాది ఏపీలో వినాయక విగ్రహాలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను తలపించేలా తయారు చేయించారు. అయితే విశాఖపట్నంలో అల్లు అర్జున్ అభిమానులు ఓ అడుగు ముందుకేసి తమ అభిమాన హీరో నటించిన పుష్ప 2 పోస్టర్ భంగిమలోనే వినాయకుడు ఓ అమ్మాయి బొమ్మను వాటేసుకొన్నట్లు ప్రతిష్టించడంతో విమర్శలు వచ్చిపడుతున్నాయి. అసలే వినాయక మండపాలలో దేవుడి పాటల స్థానంలో సినిమా పాటలు, ఐటం సాంగ్స్ వేస్తున్నారు. దీనినే భరించలేకపోతుంటే ఇప్పుడు వినాయకుడిని హీరోగా చేసి ఆయనకో హీరోయిన్ ను తగిలించి మరీ ఆనందపడుతున్నారు. పుష్ప 2 మూవీ పోస్టర్ ని ఓ పక్క ప్రదర్శిస్తూ.. మరో పక్క వినాయకుడి చేతిలో ఓ హీరోయిన్ బొమ్మను కలిపి చూపిస్తూ వీడియో తీశారు.  అయితే ఇది విశాఖలో ఎక్కడ ఏర్పాటు చేశారో తెలియడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ కమిటీ ఏది? వాళ్లెవరో తెలిస్తే ఫోన్ నంబర్ ఇవ్వాలని అడుగుతున్నారు.

Related News

Jayam Ravi: రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కోలీవుడ్ హీరో.. అందుకే విడాకులా..?

Sharwa38 : ఛార్మింగ్ హీరో తో మాస్ డైరక్టర్, ఆ జోనర్ లో సినిమా అంటే కొంచెం రిస్కే

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Pawan Kalyan : నిర్మాతలకు పవన్ కళ్యాణ్ షాక్.. ఇలా చేస్తారని అనుకోలేదు డిప్యూటీ సీఏం సార్..

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Pushpa 2 : అక్టోబరే డెడ్ లైన్… ఇక చరణ్ తో తాడో పేడో..

Big Stories

×