EPAPER

Virat Karna : “నాగబంధనం” పెదకాపును నిలబెడుతుందా.?

Virat Karna : “నాగబంధనం” పెదకాపును నిలబెడుతుందా.?

Virat Karna : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన దర్శకులలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. కొత్త బంగారులోకం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ఆ సినిమా తర్వాత రెండవ సినిమాకే మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కలిసిన నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి మల్టీస్టారర్ సినిమాలకు మరోసారి తెరతీసింది. ఆ సినిమా తర్వాత వరుణ్ తేజ్ హీరోగా ముకుంద అనే సినిమాని చేశారు. ఈ సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్.


ఇక మహేష్ బాబు హీరోగా చేసిన బ్రహ్మోత్సవం సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పాలి. ఎన్నో అంచనాల మీద వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రమైన డిజాస్టర్ గా మారింది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకుడుగా ఒక సినిమా పట్టుకోవడానికి చాలా రోజులు పట్టేసింది. ఎట్టకేలకు వెట్రి మారన్ దర్శకత్వం వహించిన అసురన్ సినిమాకి రీమేక్ గా నారప్ప అనే సినిమాను తెలుగులో తెరకెక్కించాడు శ్రీకాంత్ అడ్డాల. విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సినిమా పెదకాపు. అయితే ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

‘పెద‌కాపు’ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు.. విరాట్ కర్ణ‌. ‘పెద‌కాపు’ హిట్ట‌యితే ‘పెదకాపు 2’ తీసేవారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో పార్ట్ 2 రాలేదు. ఇప్పుడు త‌ను హీరోగా ఓ కొత్త సినిమా ప‌ట్టాలెక్కుతోంది. నిర్మాత అభిషేక్ నామా ద‌ర్శ‌కుడిగా మారి ఓ సినిమా తీస్తున్నారు. అదే ‘నాగ‌బంధనం’. సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ చిత్రంలో విరాట్ క‌ర్ణ జంటగా న‌భా న‌టేషా, ఐశ్వ‌ర్య‌మీన‌న్ క‌థానాయిక‌లు కనిపించనున్నారు. మ‌రో హీరోయిన్ ఈ సినిమాలో ఉండే అవకాశం ఉంది.


సోషియో ఫాంట‌సీ అంశాలు మేళ‌వించిన క‌థ ఇది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ చిత్రాన్ని రూపొందించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. టెక్నిక‌ల్ టీమ్ కూడా గ‌ట్టిగానే ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ‘పెదకాపు’ త‌ర‌వాత విరాట్ చాలా క‌థ‌లు విన్నాడు. కొన్ని క‌థ‌లు ఓకే కూడా అయ్యాయి. అయితే ‘నాగ‌బంధనం’ క‌థ మ‌రింత న‌చ్చ‌డంతో, ఓకే చేసిన క‌థ‌లు కూడా ప‌క్క‌న పెట్టి ఈ సినిమాని ప‌ట్టాలెక్కిస్తున్నారు. ఇక ఈ పెదకాపు ను నాగబంధనం నిలబెడుతుందా లేదా వేచి చూడాలి.ఈ సినిమా వర్కౌట్ అయితే హీరోగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని విరాట్ కర్ణ సాధించుకుంటాడు అని చెప్పొచ్చు.

Related News

Pawan Kalyan: పవన్ నోట.. బన్నీ మాట.. వారితో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు

Allu Arjun : అల్లు అర్జున్ గారు కావొచ్చునా…? ఇదేం ట్విస్ట్ డీసీఎం గారు…?

Citadel Honey Bunny: ‘సిటాడెల్’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న సామ్

Ram Gopal Varma : సల్మాన్ వివాదం, సిద్ధిఖీ హత్యపై సినిమా తీస్తే… ఆర్జీవీ పోస్ట్ వైరల్

Raja Saab: ఫ్యాన్స్ కి శుభవార్త.. డార్లింగ్ ఫ్యాన్స్ కోసం మరో వరల్డ్..!

Allu Arjun : నష్టాల్లో కూరుకుపోయిన దిల్ రాజును కాపాడిన బన్నీ… అదే జరగకపోయి ఉంటే…

Ram Charan: ఒకప్పుడు ఎమ్మెస్ రాజు గారిని సంక్రాంతి రాజు అనే వారు, ఇప్పుడు ఆ ప్లేస్ ని దిల్ రాజు భర్తీ చేశారు

Big Stories

×