EPAPER

Vinnaithaandi Varuvaayaa: రీ రిలీజ్‌లో ఇదొక రికార్డ్.. రెండున్నర సంవత్సరాలుగా అదే సినిమా స్క్రీనింగ్

Vinnaithaandi Varuvaayaa: రీ రిలీజ్‌లో ఇదొక రికార్డ్.. రెండున్నర సంవత్సరాలుగా అదే సినిమా స్క్రీనింగ్

Vinnaithaandi Varuvaayaa: ఈరోజుల్లో కొత్త సినిమలకు ఎంత క్రేజ్ ఉందో.. రీ రిలీజ్ సినిమాలకు కూడా అంతకంటే చాలా క్రేజ్ ఉంది. రీ రిలీజ్ సినిమాలకు వెళ్లడం దానిని ఒక మ్యూజికల్ ఈవెంట్‌లాగా మార్చడం.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంటుంది. మొదటిసారి థియేటర్లలో విడుదలయి అయినప్పుడు హిట్ కాలేని ఎన్నో సినిమాల రీ రిలీజ్ అయిన తర్వాత రికార్డులు క్రియేట్ చేశాయి. కలెక్షన్స్ విషయంలో కూడా అదే రేంజ్‌లో దూసుకుపోయాయి. అలా ఒక మూవీ అయితే ఒక థియేటర్‌లో రెండున్నర సంవత్సరాలు.. అంటే 1000 రోజుల నుండి రన్ అవుతోంది. ఆ సినిమానే ‘విన్నైతాండి వరువాయా’.


అక్కడే స్క్రీనింగ్

తమిళ దర్శకుడు గౌతమ్ వసుదేవ్ మీనన్.. లవ్ స్టోరీలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్. ఆయన సినిమాలు, అందులోని ప్రేమకథలు ప్రేక్షకులకు చాలా ఇష్టం. అలాంటి సినిమాల్లో ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది ‘విన్నైతాండి వరువాయా’ (Vinnaithaandi Varuvaayaa). శింబు (Simbu), త్రిష (Trisha) జంటగా నటించిన ఈ మూవీ 2010లో థియేటర్లలో విడుదలయ్యింది. అప్పట్లోనే ఈ మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూత్‌ను నవ్వించింది, ఏడిపించింది, ప్రేమలో పడేసింది. ఇక ఇన్నాళ్లే తర్వాత ‘విన్నైతాండి వరువాయా’ను మరోసారి రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. రెండున్నర సంవత్సరాల క్రితం చెన్నైలోని అన్నానగర్ పీవీఆర్ థియేటర్‌లో రీ రిలీజ్ స్క్రీనింగ్ మొదలయ్యింది.


Also Read: నిర్మాణ సంస్థకు బ్యాడ్ టైం… ఈ బ్యానర్లో సినిమా చేస్తే హీరోల కెరీర్ ఢమాల్

ఇదొక రికార్డ్

‘విన్నైతాండి వరువాయా’ రీ రిలీజ్‌కు ఎంతోమంది అభిమానులు వచ్చారు. ఆ మూవీని మరోసారి థియేటర్లలో బాగా ఎంజాయ్ చేశారు. అలా రెండున్నర సంవత్సరాల నుండి అన్నానగర్‌లోని పీవీఆర్‌లో ఈ సినిమా రన్ అవుతూనే ఉంది. దీంతో ఇప్పటికీ ఈ మూవీని థియేటర్‌లో చూస్తున్న ప్రేక్షకులు కూడా చాలామందే ఉన్నారు. ఇక రీ రిలీజ్‌ల విషయంలో ఇదొక రికార్డ్ అని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇందులో శింబు, త్రిషల కెమిస్ట్రీనే మూవీకి ప్రాణంగా నిలిచింది. ఇదే సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా తెరకెక్కించాడు గౌతమ్ మీనన్. తమిళంలో దీని టైటిల్ ‘విన్నైతాండి వరువాయా’ అయితే తెలుగులో దీనినే ‘ఏమాయ చేశావే’గా మార్చాడు.

ఎండింగ్ మారింది

‘విన్నైతాండి వరువాయా’కు ‘ఏమాయ చేశావే’కు కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులు ఇష్టపడే విధంగా కొన్ని మార్పులు చేశాడు దర్శకుడు గౌతమ్ మీనన్ (Gautham Menon). తమిళంలో క్లైమాక్స్‌లో శింబు, త్రిష కలవలేదు. సాడ్ ఎండింగ్‌తోనే సినిమా అయిపోతుంది. కానీ తెలుగులో ‘ఏమాయ చేశావే’లో సమంత, నాగచైతన్యను కలిపాడు డైరెక్టర్. సాడ్ ఎండింగ్ అయితే తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేరు అనే ఆలోచనతో ఈ మూవీని హ్యాపీగానే ముగించారు. సాడ్ ఎండింగ్‌తో అయినా కూడా ‘విన్నైతాండి వరువాయా’ను ఆదరించారు తమిళ ప్రేక్షకులు. ఇప్పుడు రీ రిలీజ్‌ను కూడా రెండున్నర ఏళ్లుగా ఆదరిస్తుంటేనే దానిపై ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది.

Related News

The Raja Saab: ‘రాజా సాబ్’ పోస్టర్ రిలీజ్.. అరే ఏంట్రా ఇది?

NBK 109: ముందుకా వెనక్కా.. కన్ఫ్యూజన్‌లో బాలయ్య

Ekta Kapoor: ఏక్తా కపూర్ పై పోక్సో కేసు, బాలీవుడ్ నిర్మాతకు చిక్కులు తప్పవా?

Vishwambhara : దొరికిపోయిన ‘విశ్వంభర’… టీజర్లోనే ఇన్ని డమ్మీలైతే సినిమా పరిస్థితి ఏంటో?

Shobhitha dulipala: సాంప్రదాయంగా పెళ్లి పనులు షురూ.. నాటి కాలాలను గుర్తుచేసిన శోభిత..!

Hit 3: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా హిట్ 3.. కాశ్మీర్లో షూటింగ్..ఆ రోజు నుంచే..!

Big Stories

×