Vijay Thalapathy Net worth : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay dalapathi ) అటు సినిమాలలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తమిళగ వెట్రి కజగం పార్టీని ఏర్పాటు చేశారు. ఇకపోతే ఈ పార్టీ పుట్టడానికి ప్రధాన కారణం నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ కి అటు పిల్లల నుంచి పెద్దల వరకు అభిమానులంతా ఎక్కువగా ఉన్నారు. అందుకే సమిష్టిగా తనకు ఓట్లు వేస్తారనే ఆశతో ఈ పార్టీ పెట్టారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఈయన నటించిన గోట్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది . ఇక ఆ సినిమా అందించిన విజయంతో ఫుల్ స్వింగ్ లో ఉన్న విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా వచ్చేశారు.
సంపన్న రాజకీయ నాయకుడిగా విజయ్..
తమిళగ వెట్రి కజగం అనే పార్టీని ప్రారంభించి, అక్టోబర్ 27న తొలి సదస్సు నిర్వహించిన విజయ్ తమిళనాడు రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ఇకపోతే 2026 ఎన్నికలలో భారీ పోటీ నెలకొన్న నేపథ్యంలో విజయ్ రాకతో సంపన్న అభ్యర్థుల జాబితాలో పోటీ నెలకొనడం ఇక్కడ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ ఆస్తి విలువ, ఆయన బంగ్లా, ఇల్లు , సినిమాల ద్వారా ఎంత సంపాదించారు అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు సైతం ఆసక్తి కనుబరుస్తున్నారు.
విజయ్ ఆస్తుల వివరాలు..
ఇకపోతే విజయ్ హీరో గానే కాకుండా ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకోబోతున్నారు. ఇక ఆయన హీరోగా మారిన తర్వాత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఆస్తుల విలువ రూ.600 కోట్లు ఉంటుందని సమాచారం. చెన్నైలో అద్భుతమైన సముద్ర తీర ప్రాంతాన బంగ్లా నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు అత్యాధునిక కార్లు , ఆయన కార్ గ్యారేజీలో ఉంటాయి అలాగే సినిమాలతో పాటు పలు వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తున్న విజయ్ ఏడాదికి రూ.120 కోట్లు వీటి ద్వారా సంపాదిస్తున్నారు. ఇకపోతే ఈయన పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్ర శేఖర్. కోలీవుడ్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన, అత్యాధునిక వాస్తు తో అందమైన ఇంటిని చెన్నైలో కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఈ ఇల్లు బంగాళాఖాతానికి చాలా దగ్గరగా ఉంటుందని సమాచారం. అంతేకాదు దీని విలువ రూ.80 కోట్లు ఉంటుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోగా కూడా రికార్డు సృష్టించారు విజయ్. ఇక సినిమాల ద్వారా ఒక్కో సినిమాకి రూ.100 కోట్లకు పైగానే పారితోషకం తీసుకుంటున్నారు. అలాగే ఒక్కో యాడ్ కి రూ.10 కోట్ల మేర పారితోషకం తీసుకుంటున్న ఈయన, తన హోదాకి తగ్గట్టుగా ఒక్కో యాడ్ కి తీసుకుంటున్నట్లు సమాచారం. కార్ కలెక్షన్స్ విషయానికి వస్తే రూ.2.5 కోట్లు విలువ చేసే రోల్స్ రాయిస్ ఘోస్ట్ , బీఎండబ్ల్యూ x5, బీఎండబ్ల్యూ x6 , మెర్సిడెస్ బెంజ్ జి ఎల్ ఏ, ఫోర్డ్ మస్టాంగ్ ఇలా కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే కార్లు ఈయన సొంతం. మొత్తానికైతే ఇప్పుడు అత్యధిక ఆస్తులు కలిగి ఉన్న సంపన్న నాయకుడిగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.