E-Paper
Advertisement

Vijay Deverakonda: పోలీస్ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ.. రాంచరణ్ సినిమానేనా? #VD12

Vijay Deverakonda: పోలీస్ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ.. రాంచరణ్ సినిమానేనా? #VD12
Advertisement

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ. సాలా క్రాస్ బ్రీడ్. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం మినహా మిగతా సినిమాలన్నీ ఫ్లాప్. అందులో కొన్ని అట్టర్ ఫ్లాప్ కూడా. ఇటీవలి లైగర్ అయితే డిజాస్టర్. అలా అలా పడిలేస్తూ.. తన 12వ సినిమాకు సిద్ధమయ్యాడు విజయ్. లైగర్ ఫెయిల్యూర్ నుంచి తేరుకొని.. కొత్త సినిమా ప్రకటించేశాడు. జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్నాడేమో.. ఈ కొత్త సినిమాలో అనేక క్రేజీ అంశాలు కనిపిస్తున్నాయి.

ఫ్యాన్స్ కు పొంగల్ ఫీస్ట్ ఇచ్చాడు దేవరకొండ. #VD12 వర్కింగ్‌ టైటిల్‌తో తన నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేశాడు. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్ చేశాడు.

Advertisement

ఫస్ట్ లుక్ అదిరిపోయింది. విజయ్ ముఖం కనిపించకుండా ముఖానికి మాస్క్ తో ఉన్నా.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అని తెలుస్తోంది. పోస్టర్ లో నీళ్లలో మంటలకు తగలబడుతున్న పడవ లాంటి క్రైమ్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి.

ఇక, అనానమస్ స్పై పేరుతో ఓ పవర్ ఫుల్ కొటేషన్ కూడా ఉంది. ‘నేను ఎవరిని మోసం చేస్తున్నానో చెప్పేందుకు.. నేను ఎక్కడి వాడినో నాకు తెలియదు’ అంటూ ఇంగ్లీష్ లో ఉన్న కొటేషన్ ఆసక్తి రేపుతోంది. దాన్ని బట్టి.. విజయ్ ది “స్పై” క్యారెక్టర్ లా అనిపిస్తోంది. పక్కా యాక్షన్, థ్రిల్లర్ కావొచ్చని అంటున్నారు.

Advertisement

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. హీరోయిన్, విలన్, టైటిల్ తదితర ఇన్ఫర్మేషన్ ఏమీ ప్రస్తుతానికి తెలీకున్నా.. డైరెక్టర్ తో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోతున్నాయి.

VD12 కి ‘గౌతమ్ తిన్ననూరి'(Gowtam Tinnanuri) డైరెక్టర్. తెలుసుగా ఇతనెవరో. నాని హీరోగా తీసిన ‘జెర్సీ’కి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు. అందుకే ఈ సినిమాపైనా సడెన్ గా ఆసక్తి పెరిగింది.

గతంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ చిత్రాన్ని ప్రకటించాడు గౌతమ్‌. ఆ భారీ ప్రాజెక్టు మొదలుకాకముందే ఆగిపోయింది. ఇప్పుడు అదే గౌతమ్.. విజయ్ తో సినిమా చేస్తున్నాడు. అంటే, రాంచరణ్ తో చేయాల్సిన సినిమాను దేవరకొండతో చేస్తున్నారని అంటున్నారు. అదే స్టోరీనా.. లేదంటే వేరే కథనా అనేది తెలియాల్సి ఉంది. మరి, మాస్+క్లాస్ హీరో విజయ్ దేవరకొండను పోలీస్ ఆఫీసర్ గా ఎలా చూపిస్తాడో. జెర్సీలో ఎమోషన్స్, స్క్రీన్ ప్లే తో కట్టిపడేసిన గౌతమ్.. విజయ్ సినిమాను ఏ యాంగిల్ లో తెరకెక్కిస్తాడో..అంటూ ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు మొదలైపోయాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×