EPAPER

Vettaiyan: ‘వేట్టయాన్’పై తెలుగు ప్రేక్షకుల ఆగ్రహం.. ఇదేనా మీరు ఇచ్చే గౌరవం?

Vettaiyan: ‘వేట్టయాన్’పై తెలుగు ప్రేక్షకుల ఆగ్రహం.. ఇదేనా మీరు ఇచ్చే గౌరవం?

Vettaiyan: ఒకప్పుడు రజినీకాంత్ అంటే వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ అని అభిమానులు అంటుండేవారు. అలా తన స్టైల్‌తో, మ్యానరిజంతో సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. అందుకే ఒకప్పుడు రజినీకాంత్ సినిమా అంటే తమిళనాడులో ఒక పండగలాగా ఉండేది. ఆఫీసులకు సెలవులు కూడా ఇచ్చేవారు. మొదటి రోజు టికెట్ దొరకాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. రజినీకాంత్‌కు తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా క్రేజ్ తగ్గిపోయింది. పైగా రజినీ.. తమను అగౌరవ పరిచినట్టుగా ఉందని తెలుగు ప్రేక్షకులు ఫీలవుతున్నారు. దానికి ‘వేట్టయాన్’ టైటిలే కారణం.


లోకువ అయిపోయారా

టీజే జ్ఞానవేల్, రజినీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమే ‘వేట్టయాన్’. ఈ మూవీలో రజినీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు. ‘వేట్టయాన్’ అంటే వేటగాడు అని అర్థం. ‘తమిళంలో వేట్టయాన్ అని టైటిల్ పెట్టినా.. దానిని తెలుగులో అందరికీ అర్థమయ్యేలా వేటగాడు అని మార్చొచ్చు కదా.. మరీ తెలుగు ప్రేక్షకులు అంటే అంత లోకువ అయిపోయారా?’ అంటూ తెలుగు ప్రేక్షకులు రజినీకాంత్ సినిమాపై ఫైర్ అవుతున్నారు. అంతే కాకుండా రజినీకాంత్ నటించిన పలు సినిమాలు తమిళంలో ఫ్లాప్ అయినా కూడా తెలుగులో హిట్ అందుకున్నాయి. కనీసం అలా అయినా తెలుగు ప్రేక్షకుల మీద గౌరవం లేదా అని ఫీలవుతున్నారు.


Also Read: వెట్టయాన్ మూవీ రివ్యూ… రజినీకాంత్‌కి ఇది సరిపోయిందా…?

నోరుతిరగని తమిళ పదాలు

‘వేట్టయాన్’ టైటిల్‌పై ఉన్న కోపంతో సోషల్ మీడియాలో #BoycottVettaiyan అనే హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు కొందరు ప్రేక్షకులు. ఒకవేళ తెలుగు సినిమాలు.. ఇతర భాషల్లో విడుదలయితే ఆ భాషకు తగినట్టుగా టైటిల్స్‌ను మారుస్తున్నారు తెలుగు మేకర్స్. కానీ కోలీవుడ్ మేకర్స్‌లో అలాంటి ఆలోచనే రావడం లేదు. అసలు నోరు తిరగని తమిళ పదాలను తీసుకొచ్చి తెలుగులో టైటిల్స్‌గా పెట్టడం అస్సలు కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు కొందరు మూవీ లవర్స్. తెలుగు ప్రేక్షకుల డబ్బులు కావాలి కానీ తెలుగు భాష వద్దా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ తమిళ టైటిల్స్ ఎఫెక్ట్.. ‘వేట్టయాన్’ సినిమాపై భారీగానే పడుతుంది. అందుకే తెలుగులో బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయని సమాచారం.

ధనుష్ కూడా ఇంతే

‘వేట్టయాన్’ మాత్రమే కాదు.. ఈమధ్య కాలంలో విడుదల అవుతున్న చాలావరకు తమిళ సినిమాలు.. తెలుగులో విడుదలవుతున్నా కూడా టైటిల్స్‌ను మాత్రం తెలుగు భాషలోకి మార్చకపోవడం ప్రేక్షకులను మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. కొన్నిరోజుల క్రితం ధనుష్ హీరోగా నటించిన ‘రాయన్’ సినిమాను కూడా అదే టైటిల్‌తో తెలుగులో విడుదల చేశారు. అయినా కూడా ఈ సినిమాను చూడడానికి చాలామంది తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. ‘వేట్టయాన్’కు కూడా అదే జరిగేసరికి ఆడియన్స్ సహనం కోల్పోయారు. ఇంత నెగిటివిటీ మధ్య ‘వేట్టయాన్’ సినిమా అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలకు సిద్దమయ్యింది. ప్రీ బుకింగ్స్ విషయంలో తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా ఈ సినిమా వెనకబడి ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

Related News

Janaka Aithe Ganaka Censor : ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పచ్చి బూతులు… అమ్మబాబోయ్ భరించలేం..

Vettaiyan: రజినీకాంత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘వేట్టయాన్’ స్పెషల్ స్క్రీనింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్

Viswam Censor : మూవీ చూసి బెదిరిపోయిన సెన్సార్ బోర్డ్… మొత్తం 14 కట్స్.. ఏ సీన్స్ కట్ చేశారంటే..?

JD Chakravarthy: చిరంజీవి.. పరమ దుర్మార్గుడు.. 8 రోజులు అలా..

Naga Chaitanya: నాగచైతన్య ట్విటర్ అకౌంట్ హ్యాక్.. అదేంటి అలా పోస్ట్ చేశాడు?

Prabhash : రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించిన ప్రభాస్..!

Unstoppable with NBK: సీజన్ 4 మొదటి గెస్ట్ గా అల్లు అర్జున్.. నంద్యాల టాపికే హైలైట్.. ?

Big Stories

×