EPAPER
Kirrak Couples Episode 1

Saindhav Movie Review : సైంధ‌వ్‌ గా వెంకటేశ్ మెప్పించాడా..? మూవీ ఎలా ఉందంటే..?

Saindhav Movie Review : సైంధ‌వ్‌ గా వెంకటేశ్ మెప్పించాడా..? మూవీ ఎలా ఉందంటే..?

Saindhav Movie Review : ఈ సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల్లో సినిమాల సందడి కొనసాగుతోంది. శుక్ర‌వారం మ‌హేశ్ బాబు గుంటూరు కారంతో థియేటర్లను ఘాటెక్కించాడు. మరోవైపు హనుమాన్ దేశవ్యాప్తంగా జైశ్రీరామ్ నినాదాలు మోగిస్తోంది. శ‌నివారం విక్టరీ వెంక‌టేశ్ సైంధ‌వ్‌ గా ప్రేక్షకులకు ముందుకు వచ్చేశాడు. ఇది వెంకీమామకు 75వ సినిమా. ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా యాక్ష‌న్ క‌థ‌తో వెంకటేశ్ సంక్రాంతి బరిలో దిగాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? సైంధవన్ గా వెంకీ మెప్పించాడా? అసలు ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం..


స్టోరీ ఏంటంటే?
చంద్ర‌ప్ర‌స్థ అనే క‌ల్పిత న‌గ‌రం నేప‌థ్యంలో సైంధవ్ కథ సాగుతుంది.సైంధ‌వ్ కోనేరు అలియాస్ సైకో (వెంక‌టేశ్‌) త‌న కూతురు గాయ‌త్రి (బేబి సారా)తో క‌లిసి జీవిస్తుంటాడు. భ‌ర్తకు దూరమైన మ‌నో (శ్ర‌ద్ధ శ్రీనాథ్‌)తో అనుబంధం ఏర్ప‌డుతుంది. గ‌తంలో కార్టెల్ సంస్థ‌లో సైంధవ్ ప‌నిచేశాడు. అయితే పెళ్లి త‌ర్వాత భార్య‌కి ఇచ్చిన మాట కోసం ప‌ని చేయ‌డం మానేస్తాడు. కూతురే ప్ర‌పంచంగా బ‌తుకుతుంటాడు. అయితే తన కూతురు ‘స్పైన‌ల్ మ‌స్కుల‌ర్ అట్రోఫీ’ అనే జ‌బ్బుతో బాధపడుతుంది. ఆమె ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డుతుంది. ఆ జ‌బ్బు నయంకావాలంటే రూ.17 కోట్ల విలువ చేసే ఇంజెక్ష‌న్ అవ‌స‌రమ‌ని డాక్ట‌ర్లు చెబుతారు.ఆ డ‌బ్బు సైకో ఎలా సంపాదించాడు? త‌న కుమార్తె ప్రాణాల్ని కాపాడుకున్నాడా? చిన్న పిల్ల‌ల అక్రమ రవాణా, ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేసే కార్టెల్ సంస్థ నడుపుతున్న వికాస్ మాలిక్ (న‌వాజుద్దీన్ సిద్ధిఖీ), మిత్ర (ముఖేష్ రుషి)తో సైంధ‌వ్ పోరాటం ఎలా సాగింది? ఈ అంశాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మూవీ ఎలా ఉందంటే?
వెంక‌టేశ్ త‌న 75వ చిత్రం కోసం విభిన్నమైన యాక్షన్ కథను ఎంచుకున్నాడు. థ్రిల్ల‌ర్ మూవీస్ బాగా తీస్తాడ‌నే పేరున్న శైలేష్ కొల‌ను డైరెక్టర్ కావడం ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. వెంక‌టేశ్ ను చూపించిన విధానం మెప్పించింది. కానీ క‌థ‌ను నడించడంలో కాస్త తడబడ్డాడు. గ‌త చిత్రాల్లో అడుగ‌డుగునా ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేసేలా సీన్స్ రూపొందించిన శైలేష్ కొల‌ను.. సైంధ‌వ్‌ ఆ మార్క్ ను అందుకోలేకపోయాడు. క‌థ బాగున్నా కథనాన్ని సరిగ్గా రక్తి కట్టించలేకపోయాడు.


ప్రాణాపాయంలో ఉన్న కూతురును రక్షించుకునేందుకు సైంధ‌వ్ మ‌ళ్లీ కార్టెల్‌లోకి అడుగు పెట్టడం.. డ‌బ్బు సంపాదించే ప్రయత్నంలో చిక్కుముళ్లతో ఫస్టాఫ్ కాస్త ఆసక్తిగానే సాగుతుంది. యాక్ష‌న్ సీన్స్, వెంకీ స్టైలిష్ లుక్, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ పాత్ర మిన‌హా ఆకట్టుకున్నా.. సెకండాఫ్ అంచనాలకు అందుకోలేకపోవడం, భావోద్వేగాలూ బ‌లంగా పండ‌కపోవడం మైనస్ పాయింట్లుగా మారాయి.

ఎవ‌రెలా చేశారంటే?
యాక్షన్ సీన్స్ వెంకటేశ్ అదరగొట్టాడు. భావోద్వేగాల‌తో స‌న్నివేశాలను పండించాడు. న‌వాజుద్దీన్ సిద్ధిఖీ పాత్ర‌ను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంది. శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, రుహానీ శ‌ర్మ‌, ముఖేష్ రుషి, జ‌య‌ప్ర‌కాశ్ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం బాగానే ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది.

యాక్టర్స్ : వెంకటేశ్‌, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్,ఆండ్రియా జెరెమియా, రుహాని శర్మ, సారా, జయప్రకాష్
మ్యూజిక్ : సంతోష్ నారాయణన్
కెమెరామెన్: యస్.మణికందన్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
రచన, దర్శకత్వం : శైలేష్ కొలను
నిర్మాణ సంస్థ‌: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌

సైంధ‌వ్‌.. వెంకీ యాక్ష‌న్ అదిరింది.. కానీ సెంటిమెంట్ పండలేదు..

Related News

Jani Master Case : నేరాన్ని అంగీకరించాడా… అంగీకరించాల్సి వచ్చింది..?

Jani Master Case : బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ అవుట్… జానీ కేసుతో ఆమె లింక్ ఇదే..

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

Jani Master : జానీ మాస్టర్ కు అన్యాయం? బన్నీ పై నెటిజన్స్ ఆగ్రహం..

Jani Master Case : అంతటికీ కారణం విశ్వక్ సేన్… జానీ రిమాండ్ తర్వాత బయటకు వచ్చిన సంచలన నిజం..

Jani Master case : జానీ పై కేసుకు ఆ సినిమానే కారణం.. ఇన్నాళ్లకు వెలుగులోకి నిజం..

Big Stories

×