EPAPER

Venkatesh: ఈ విలన్ వెంకీ సొంత బావ అని మీకు తెలుసా.. ఎన్ని సినిమాల్లో నటించారంటే..?

Venkatesh: ఈ విలన్ వెంకీ సొంత బావ అని మీకు తెలుసా.. ఎన్ని సినిమాల్లో నటించారంటే..?

Venkatesh…కొంతమంది నటన మీద వ్యామోహంతో సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి అన్నింటినీ వదులుకోవడానికి కూడా సిద్ధపడితే, మరికొంతమందికి అనుకోకుండానే అవకాశం దక్కుతుంది. ఇంకొంతమందికి అసలు నటన అంటే ఏంటో తెలియకపోయినా అదృష్టం వరించి వారిని అందలం ఎక్కిస్తూ ఉంటుంది సినీ పరిశ్రమ. సరిగ్గా ఇలాంటి ఒక అదృష్టం ఒక వ్యక్తికి లభించింది. ఆ వ్యక్తి తనకు నటన అంటే ఏంటో తెలియదు అని, తాను నటనా రంగంలోకి రాను బాబోయ్ అంటూ మొత్తుకున్నా బలవంతంగా ఆయనను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి, ఇప్పుడు ఆయనను స్టార్ సెలబ్రిటీగా మార్చేశారు. అంతేకాదు ఆయన విక్టరీ వెంకటేష్ (Venkatesh) కి సొంత బావ కూడా.. మరి ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం.


ప్రొడ్యూసర్ ను బలవంతంగా నటుడిగా మార్చారా..

ఆయన ఎవరో కాదు కొల్లా అశోక్ కుమార్(Kolla Ashok Kumar) .. రక్త తిలకం అనే చిత్రం ద్వారా నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత 1990లో చెవిలో పువ్వు అనే సినిమాను నిర్మించే సమయంలో.. కొత్త వాళ్లతో టాలెంట్ ను గుర్తించి చూపించే డైరెక్టర్ కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) సెట్ లో కనిపించిన అశోక్ కుమార్ ని చూసి..’ నువ్వు నా చిత్రంలో నటిస్తావా?’ అని అడిగారట. దానికి అశోక్ కుమార్.. నేను నటించడం ఏంటి ..? అసలు నాకు నటనే తెలియదు? అయినా నేను ఇండస్ట్రీలో నిర్మాతగా ఉంటాను.. కానీ నటుడిగా మాత్రం కాదు.. అని చెప్పారట. దాంతో పట్టు వదలని కోడి రామకృష్ణ.. అసలు నువ్వేంటో నాకు తెలుసు.. నీకు ఎలాంటి పాత్రలు ఇవ్వాలో కూడా నాకు తెలుసు.. ముందు నువ్వు ఒప్పుకో.. మిగతాదంతా నాకు వదిలేయ్ నేను చూసుకుంటాను.. అని తెలిపారట.
అలా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన భారత్ బంద్ సినిమాలో విలన్ పాత్రతో అరంగేట్రం చేశారు అశోక్ గల్లా కుమార్.


విలన్ గా మారిన వెంకీ బావ..

నటన రాదు మొర్రో అని మొత్తుకున్న అశోక్ కుమార్ కి ఈ సినిమా ఊహించని విజయాన్ని అందించింది. నిర్మాతగానే అప్పటి వరకు ఉన్న ఈయన ఒక్కసారిగా విలన్ గా అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మ సినిమా ఈయనకు మరింత పేరు తీసుకొచ్చింది. ఏది ఏమైనా అదృష్టం ఉండాలి కానీ అనుకోకపోయినా అందలం ఎక్కువచ్చు అని నిరూపించారు. ఇకపోతే ఈయన నిర్మాతగా మారడానికి కారణం ఈయన మేనమామ స్వర్గీయ లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు (Daggubati Ramanaidu) . అంటే హీరో వెంకటేష్ (Venkatesh ) కి స్వయాన బావ అవుతారు. ఇంతటి సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఆయన ఎప్పుడూ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించుకోలేదు. సొంతంగానే ఇండస్ట్రీలో ఎదగాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే నిర్మాతగా అడుగులు వేసిన ఈయనకు కోడి రామకృష్ణ అదృష్టంగా మారి ఆయనను నటుడిగా మార్చేశారు. ఒకవైపు నిర్మాతగా, మరొకవైపు నటుడిగా కూడా పలు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించారు అశోక్ కుమార్..

కొల్లా అశోక్ కుమార్ సినిమాలు..

భారత్ బంద్ అనే సినిమాతో విలన్ గా 1991లో ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఆ తర్వాత నటనకు ఆరేళ్లు విరామం ఇచ్చారు. అలా 1997లో ఒసేయ్ రాములమ్మ సినిమాలో విలన్ గా మెప్పించి, అదే ఏడాది 1997లో ప్రేమించుకుందాం రా, అంతఃపురం, ఆవారా గాడు, జయం మనదేరా, ఈశ్వర్ వంటి చిత్రాలలో నటించి 2002లో టక్కరి దొంగ అనే సినిమాలో చివరిగా నటించి , నటుడిగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇక నిర్మాతగా రక్త తిలకం, ధ్రువ నక్షత్రం, చెవిలో పువ్వు, ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

Related News

Kanguva First Review : “కంగువ” ఫస్ట్ రివ్యూ… మూవీ టాక్ ఏంటంటే?

Ka Movie: ట్రైలర్ బావుంది.. కానీ, కిరణ్ అబ్బవరంకే లక్ లేదు..?

Pushpa 2 Remuneration : పుష్పగాడి రేంజే వేరబ్బా.. అందుకే అన్ని రూ.కోట్లు..!

Ka Movie Trailer : చీకటి వలయం… గందరగోళం… సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటున్న ట్రైలర్..!

Sai Pallavi : ఆ హీరోలు అందరూ ఉనికిని కోల్పోతారు… సాయి పల్లవి నుంచి షాకింగ్ కామెంట్స్..!

Raja Saab : ప్రభాస్ తాత గెటప్ వెనుక ఇంత కథ ఉందా.. మారుతి ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

Tripti Dimri : యానిమల్ బ్యూటి చేసిన మొదటి యాడ్?..అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు..

Big Stories

×