EPAPER

Venkat Prabhu: ఒకే కథతో రెండు సినిమాలు.. తప్పు ఒప్పుకున్న ‘ది గోట్’ డైరెక్టర్

Venkat Prabhu: ఒకే కథతో రెండు సినిమాలు.. తప్పు ఒప్పుకున్న ‘ది గోట్’ డైరెక్టర్

Venkat Prabhu: విజయ్ హీరోగా నటించిన ‘ది గోట్’ (The GOAT) దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. కానీ తమిళంలో తప్పా మిగతా భాషా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా కోసం టెక్నాలజీ పరంగా ఎన్నో ప్రయోగాలు చేశారు దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu). విజయ్‌పై చేసిన ఆ ప్రయోగాలు చూసి ఇతర భాషా ప్రేక్షకులు విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ తమిళంలో మాత్రం ‘ది గోట్’ థియేట్రికల్ రన్‌ను ఎవరూ ఆపలేకపోయారు. తాజాగా ‘ది గోట్’ సినిమా కథకు, మరొక తమిళ సినిమా కథకు చాలా దగ్గర పోలీకలు ఉన్నాయని వెంకట్ ప్రభుకు ప్రశ్న ఎదురయ్యింది. ఆ విషయాన్ని దర్శకుడు సైతం ఒప్పుకున్నారు.


బెటర్‌గా రాసేవాడిని

విజయ్ (Vijay) హీరోగా నటించిన ‘ది గోట్’కు, తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘రాజదురాయ్’ అనే సినిమాకు చాలా దగ్గర పోలీకలు ఉన్నాయి. తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో ఈ విషయంపై దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు. ‘‘నాకు నిజంగా గోట్ చేసిన తర్వాత, అది విడుదలయిన తర్వాత రాజదురయ్ సినిమా కథ కూడా సేమ్ అని అప్పుడు తెలిసింది. అలా అంతా అయిపోయిన తర్వాతే తెలిసింది. విడుదలయిన తర్వాత సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాలకు పోలికలు ఉన్నాయని విన్నాను. అప్పుడు ఆ సినిమా చూడాలని చూశాను. ఒకవేళ తెలిసుంటే ముందే చూసేవాడిని, దానికంటే కొంచెం బెటర్ కథ రాసేవాడిని’’ అంటూ ఈ ట్రోల్‌ను పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు వెంకట్ ప్రభు.


Also Read: తల్లి కాబోతోంది… సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య హీరోయిన్

అర్థం కావట్లేదు

‘‘ది గోట్ సినిమా కథ ఒక యూనివర్సల్ కథ. తండ్రీ, కొడుకులకు విభేదాలు అనేది కామన్‌గా జరిగేదే. ఆ కథతో వచ్చిన చాలా సినిమాలు చూసే ది గోట్ చేశాను. కానీ రాజదురయ్ మాత్రం మిస్ అయ్యాను. అది ఎలా జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. సినిమా అనేది చాలా నేర్పిస్తుంది’’ అంటూ కథతో దగ్గర పోలికలు ఉన్న ఇతర సినిమాలను కూడా ఉదాహరణగా చెప్పుకొచ్చారు వెంకట్ ప్రభు. అయితే ఈ దర్శకుడు ఇంత పాజిటివ్‌గా మాట్లాడడం, తప్పు ఒప్పుకోవడం మంచిదే అని కొందరు ప్రేక్షకులు ఫీల్ అవుతుండగా.. మరికొందరు మాత్రం ఆయన అన్నీ తెలిసే చేసి ఇప్పుడు కావాలని ప్లేట్ మారుస్తున్నారని మళ్లీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

డిశాస్టర్ టాక్

‘ది గోట్’ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్‌లో కనిపించాడు. స్నేహ, మీనాక్షి చౌదరీ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఎందరో సీనియర్ ఆర్టిస్టులను ఈ మూవీ కోసం రంగంలోకి దించారు వెంకట్ ప్రభు. అంతే కాకుండా త్రిష, శివకార్తికేయన్ వంటివారితో గెస్ట్ రోల్స్ కూడా చేయించారు. మొత్తానికి తమిళనాడులో ‘ది గోట్’ బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఓవర్సీస్‌లో కూడా పరవాలేదనిపించింది. కానీ తెలుగు, హిందీ భాషల్లో మాత్రం ఈ సినిమాకు డిశాస్టర్ టాక్ లభించింది. అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది ‘ది గోట్’. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.

Related News

Vijay Devarakonda : దేవరకొండ కాళ్లపై పడ్డ కేరళ అభిమాని… సినిమాలను మాత్రం హిట్ చేయరు

Salman Khan : సల్మాన్ ఖాన్ కు భద్రత కట్టుదిట్టం… ‘బిగ్ బాస్ ‘ షూటింగ్ పరిస్థితి ఇదీ!!

Pushpa 2: ఉత్తరాంధ్రలో భారీ ధర.. ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ఇదే..!

Anee Master : జానీ గురించి అనీ మాస్టర్ ప్రెస్ మీట్… వెనకుండి ఇంత కథ నడిపించింది ఆ స్టార్ హీరోనా?

Anee Master : జానీ మాస్టర్ మంచోడు.. అరెస్టుపై విస్తుపోయే నిజాలు..!

SSMB -29: మహేష్ – రాజమౌళి నుంచీ బిగ్ అప్డేట్.. ఊహించలేదుగా.. !

Samantha: మయోసైటిస్ మాత్రమే కాదు ఆ వ్యాధి కూడా.. హాట్ బాంబ్ పేల్చిన సామ్..!

Big Stories

×