EPAPER
Kirrak Couples Episode 1

Vani Jairam: వాణీ జయరామ్ మృతదేహానికి పోస్టుమార్టం కంప్లీట్.. ఏం తేలిందంటే?

Vani Jairam: వాణీ జయరామ్ మృతదేహానికి పోస్టుమార్టం కంప్లీట్.. ఏం తేలిందంటే?

Vani Jairam: ప్రముఖ గాయని వాణీ జయరామ్ కన్నుమూయడంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. తన గానామృతంతో అందరినీ అలరించిన జయరామ్ ఇక లేరనే వార్త అందరితో కంటతడిపెట్టిస్తోంది. అయితే వాణీ తలకు బలమైన గాయం కావడం, రక్తస్త్రావం కావడంతో ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇక చెన్నైలోని ఒమేదురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో వాణీ జయరామ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె తలకు ఒకటిన్నర ఇంచు గాయం అయినట్లు గుర్తించారు. గాయంపై ఎలాంటి నిర్ధారణకు రాలేమని.. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. దీంతో పోస్టుమార్టం రిపోర్టులో ఏం రాబోతోందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం వాణీ మృతదేహాన్ని వారి నివాసానికి తరలించారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వాణీ జయరామ్‌ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులతో పాటు, పెద్ద ఎత్తున అభిమానులు వారి నివాసానికి తరలివస్తున్నారు.


తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్‌ 30న జన్మించిన వాణీజయరాం… తెలుగు, తమిళం సహా పలుభాషల్లో పాడారు. ఇటీవలే వాణీజయరాంకు కేంద్రం పద్శభూషణ్‌ ప్రకటించింది. ఆరుగులు అక్కాచెల్లెళ్లల్లో వాణీజయరాం ఐదో సంతానం. వాణీజయరాం మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

కర్ణాటక సంగీతం ఔపోసన పట్టిన ఆమె, ముత్తుస్వామి దీక్షితార్‌ కీర్తనలు చక్కగా పాడేవారు. ఎనిమిదో ఏటనే సంగీత కచేరీ నిర్వహించిన ప్రశంసలు అందుకున్నారు. మద్రాసు క్వీన్స్‌ మేరీ కళాశాల నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ.. ఇలా 14 భాషల్లో దాదాపు 20వేలకు పైగా పాటలు ఆలపించారు. ఇటీవలే వాణీ జయరాంకు కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్‌ ప్రకటించింది.

చిన్నప్పటి నుండే సంగీతం నేర్చుకున్నారు. అయితే ఆమె కుటుంబం కేవలం శాస్త్రీయ సంగీతం మాత్రమే పాడేది. సినిమా పాటలు వద్దనేవారు. పలువురు గురువుల వద్ద సంగీతం నేర్చుకున్న వాణీ జయరాంకు పదేళ్ల వయసులో ఆల్‌ ఇండియా రేడియోలో మొదటిసారి పాటలు పాడే అవకాశం వచ్చింది. అప్పట్నుంచి రేడియోలో, స్కూల్లో, సంగీత ప్రదర్శనలలో పాటలు పాడారు.

కానీ ఎప్పుడూ సినిమా పాటలు పాడలేదు. అయినా వాణీ జయరాంకి సినిమా పాటల మీద ఆసక్తి ఏర్పడి రేడియోలో వింటూ నేర్చుకునేవారు. ఎలాగైనా సినిమాల్లో పాటలు పాడాలని వాణీ జయరాం అనుకునేవారు. అయితే అంతలోనే ఆమెకి పెళ్లి జరిగింది. కానీ ఆమె భర్త జయరాం ప్రోత్సాహం ఇవ్వడంతో కర్ణాటిక్‌, హిందుస్థానీ సంగీతాలను నేర్చుకొని కచేరీలు ఇస్తూ సినిమా అవకాశాల కోసం ఎదురు చూశారు. ఓ సారి ముంబైలో తన మొదటి కచేరి ఇచ్చినప్పుడు సంగీత దర్శకుడు వసంత్‌దేశాయ్‌ ఆమె గొంతు బాగుందని చెప్పి 1970లో బాలీవుడ్ మూవీ ‘గుడ్డీ’లో పాట పాడే అవకాశం ఇప్పించారు. ఆ సినిమాలో తను పాడిన మొదటి పాట ‘బోలే రే’ అప్పట్లో సూపర్‌ హిట్టయి అవార్డులు కూడా రావడంతో మొదటి పాటతోనే వాణీ జయరాం దశ తిరిగింది.

14 భాషల్లో దాదాపు 8వేలకు పైగా పాటలు పాడిన వాణీ జయరాం నంది అవార్డులు, వివిధ స్టేట్ అవార్డులు, నేషనల్, ఫిలింఫేర్, సైమా, వివిధ దేశాల అవార్డుల్ని అందుకున్నారు. తాజాగా ఆమెకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేశారు.ఆమెను సినీ పాటలవైపు ప్రోత్సహించిన ఆమె భర్త జయరాం 2018లో కన్నుమూశారు.

Related News

Madhoo Bala: సీనియర్ నటి మధుబాల కూతుళ్లను చూశారా.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే

Veena Srivani: ప్రాయశ్చిత్త శ్లోకాలంటూ ఓవర్ యాక్షన్.. క్షమాపణ చెప్పండి.. వేణుస్వామి భార్య సంచలన వ్యాఖ్యలు

Ratan Tata: నిర్మాతగా మారిన రతన్ టాటా.. ఆయన ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా గురించి మీకు తెలుసా?

Karthi: మహేష్- రాజమౌళి సినిమాలో కార్తీ.. ఆయన ఏమన్నాడంటే.. ?

Ananya Panday: ఏంటి పాప నీ కోరిక.. ఫ్యాన్స్ హర్ట్ అవ్వరూ ..!

Swag: శ్రీ విష్ణు స్వాగ్.. కాన్సెప్ట్ నచ్చలేదా లేక శ్రీ విష్ణునే మెప్పించలేదా..?

Koratala Siva: ఆ స్టార్ హీరోతో సినిమా చేయను.. దేవర డైరెక్టర్ కఠిన నిర్ణయం వెనుక కారణం..?

Big Stories

×