EPAPER

V V Vinayak : ‘అఖిల్’ విషయంలో భాధ పడుతుంటా.. బయ్యర్స్‌కి నేనే డబ్బులిచ్చా: వి.వి.వినాయక్

V V Vinayak : ‘అఖిల్’ విషయంలో భాధ పడుతుంటా.. బయ్యర్స్‌కి నేనే డబ్బులిచ్చా: వి.వి.వినాయక్

V V Vinayak : బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వి.వి.వినాయక్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ఛత్రపతి రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. కాగా.. మరే సినిమా చేయటం లేదు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అందులో ఆయన డైరెక్ట్ చేసి డిజాస్టర్ అయిన అఖిల్ సినిమా గురించి కూడా ప్రస్తావించారు. ‘‘అఖిల్ సినిమా విషయంలో మా మధ్య గొడవలేం రాలేదు. అయితే మేం అనుకున్నది వర్కవుట్ కాలేదు. నిజానికి ఆ కథ అఖిల్‌కి పెద్దదైపోయిందని అనిపించింది. అయితే సినిమా చేసే సమయంలో అందరికీ కరెక్ట్‌గానే అనిపించింది. ఆ సినిమా విషయంలో బయ్యర్స్‌కి నష్టాలు రాకూడదని నేను అందరినీ పిలిచి మధ్యలో ఓ పెద్దాయన్ని పెట్టుకుని పెద్ద మొత్తంలో డబ్బులిచ్చేశాను.


కానీ అఖిల్ ఎంతో ఇష్టపడి నాతో సినిమా చేశాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఆ విషయంలో నేను ప్రతి రోజూ ఇప్పటికీ బాధపడుతుంటాను. కానీ తప్పకుండా తను ఏదో ఒక రోజు పెద్ద స్టార్‌గా ఎదుగుతాడు’’ అని అన్నారు వినాయక్. ఇదే ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధం, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం గురించి కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.


Tags

Related News

Aay Movie: ఆయ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్నామండీ

Game Changer: గేమ్ ఛేంజర్ అప్డేట్.. ఎర్ర కండువాతో చరణ్ అదిరిపోయాడు

Faria Abdullah: మన చిట్టిలో ఇంత టాలెంట్ ఉందా.. అదిరిపోయింది బంగారం

Viran Muttemshetty: అల్లు అర్జున్ కజిన్ హీరోగా గిల్ట్.. ఫస్ట్ లుక్ చూశారా..?

Sri Sri Sri Rajavaru: ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ విచ్చేస్తున్నారు.. నేషనల్ అవార్డ్ దర్శకుడితో నార్నే నితిన్ సినిమా

Devara Trailer: పండగ సందర్భంగా ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Nandamuri Balakrishna: బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో.. జనాలను చంపేద్దామనుకుంటున్నారా.. ?

Big Stories

×