EPAPER

Upendra: వరల్డ్‌వైడ్‌ టాప్ 50 సినిమా దర్శకుల లిస్ట్‌లో ఉపేంద్రకు చోటు

Upendra: వరల్డ్‌వైడ్‌ టాప్ 50 సినిమా దర్శకుల లిస్ట్‌లో ఉపేంద్రకు చోటు

Upendra's place in the list of worldwide top 50 film directors


Upendra’s place in the list of worldwide top 50 film directors : ప్రపంచంలోని ఉత్తమ దర్శకుల వివరాలను ప్రముఖ ఐఎండీబీ అనే సంస్థ అనౌన్స్‌ చేసింది. తాజాగా ప్రపంచ టాప్ 50 దర్శకుల పేర్ల లిస్ట్‌ను రిలీజ్ చేసింది. అత్యుత్తమ 50 మంది మూవీ దర్శకుల జాబితా గురించి పుల్‌ లెంథ్ ఇన్ఫర్మేషన్‌ని ఇచ్చింది. అయితే ఈ దర్శకుల జాబితా లిస్ట్‌లో సంచలన చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన ప్రముఖ దర్శకుడు రియల్ స్టార్ ఉపేంద్ర చోటు దక్కించుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

శాండల్‌వుడ్‌ ప్రముఖ దర్శకుడు, నటుడు ఉపేంద్ర ఈ జాబితాలో 8వ ప్లేస్‌ని దక్కించుకోవడం విశేషం. ప్రపంచంలోని అత్యుత్తమ 50 మంది దర్శకుల జాబితాలో హాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పెద్ద పెద్ద దిగ్గజ దర్శకులు బరిలో నిలవగా.. వీరికి ధీటుగా నిలిచారు ఉపేంద్ర. ఇంతమంది దిగ్గజ దర్శకులలో మన టాలీవుడ్ జక్కన్న పేరు కూడా లేకపోవడం మరో విశేషం. ఇంతమందిని దాటుకొని శాండల్‌వుడ్‌కు చెందిన ఉపేంద్ర ఈ జాబితాలో ఉండటంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Read More: ఓటీటీలోకి 12TH ఫెయిల్ తెలుగు వెర్షన్.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..

శాండల్‌వుడ్‌ నటుడు ఉపేంద్ర తాను నటించే సినిమాలలో కొత్త కొత్త ప్రయోగాలతో అటు ఆడియెన్స్‌ని, నిజ జీవితంలోనూ విలక్షణంగా ప్రవర్తిస్తూ ఇటు తనను అభిమానించే అభిమానులను అలరిస్తుంటారు. ఇక కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ విభిన్న పాత్రలు పోషించే ఉపేంద్ర.. తన అద్భుతమైన యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ని తన సినిమాలో విలీనం అయ్యేలా చేస్తారు. అంతలా అలరిస్తారు ఆడియెన్స్‌ని నటుడు ఉపేంద్ర.

హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ రెండో స్థానంలో ఉన్నారు. వీరంతా ఉన్న లిస్ట్‌లో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఉండటం కన్నడ ఇండస్ట్రీకి నిజంగా ఎంతో గర్వకారణమనే చెప్పాలి. ఇప్పటివరకు ఉపేంద్ర సుమారు 60 సినిమాల్లో నటించాడు. 10 సినిమాలకు దర్శకత్వం వహించాడు. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మంచి ఐడెంటీటీని తెచ్చుకొని.. రెండు ఇండస్ట్రీల ఆడియెన్స్‌ని తనకు ఫ్యాన్స్‌ అయ్యేలా ఆకట్టుకున్నాడు.

Read More: కత్రినా కైఫ్ తల్లి కాబోతోందా? వీడియో వైరల్…

అయితే తన మూవీల్లో యాక్టింగ్‌తో పాటుగా దర్శకత్వంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. ఓం, ష్, ఏ, తర్లేనా మగా వంటి మూవీలను అందరిలా కాకుండా చాలా డిఫరెంట్‌గా ఆడియెన్స్‌ థాట్‌కి భిన్నంగా దర్శకత్వం వహించి అందరి అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ సినిమాలు చూస్తే అందులో చాలామందికి జరిగిన సంఘటనలే గుర్తుకువస్తాయి. అంతలా రియలిస్ట్‌గా ఉంటాయని ఇప్పటికి తన పాత చిత్రాలను గుర్తు చేసుకుంటారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×