EPAPER

Upcoming movies 2023 : దసరా నుంచి సంక్రాంతి వరకు థియేటర్లలో సందడే సందడి..

Upcoming movies 2023 : దసరా నుంచి సంక్రాంతి వరకు థియేటర్లలో సందడే సందడి..
Upcoming movies 2023

Upcoming movies 2023 : అగ్రహీరోల సినిమాలు వరుసగా విడుదలవుతుండటంతో.. థియేటర్లలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. వరుస సెలవులు, పండుగ సీజన్ కావడంతో.. థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. భ‌గ‌వంత్ కేస‌రి’..’లియో’..’టైగ‌ర్ నాగేశ్వ‌రావు’ మూవీలతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. ఈ మూడు సినిమాలలో బాలయ్య మూవీకే కలెక్షన్లు ఎక్కువగా వస్తున్నాయని టాక్. ఈసారి అసలైన దసరా బాలయ్యదే.. ఎందుకంటే బాలయ్య జోరుకి బాక్సాఫీస్ షేక్ అవుతోంది మరి.


దసరా బరిలో సినిమాల సంగతి సరే. అసలు సిసలు పోటీ సంక్రాంతికి ఉండబోతోంది. పెద్దపండుగ బరిలో దిగడానికి మహేష్ బాబు గుంటూరు కారం .. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తోపాటు అర డజను సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అగ్ర హీరోల సినిమాలకు ఎటువంటి సమస్య లేదు. కానీ అసలు సమస్య అంతా చిన్న హీరోల సినిమాలకే వస్తుంది. మధ్యలో సలార్ బాంబు ఎప్పుడు పేలుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. మరోపక్క దీపావళి , క్రిస్మస్ లో కూడా థియేటర్ లో గట్టి పోటీ కనిపిస్తోంది.

ర‌ణ‌బీర్ క‌పూర్, రష్మీకా కాంబోలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమ‌ల్’ చిత్రం డిసెంబర్ 1న విడుదల కాబోతోంది. నాని, మృణాల్ ఠాకూర్ కాంబోలో వస్తున్న హాయ్ నాన్న చిత్రం డిసెంబర్ 7 విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక తన ఎక్స్ ట్రా మూవీతో డిసెంబర్ 8న నితిన్ బరిలోకి దిగుతున్నాడు. ఇక అదే రోజు ‘ఆపరేషన్ వాలెంటైన్’ అంటూ వరుణ్ తేజ్ థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్నాడు. వీటితోపాటుగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా డిసెంబర్ 8న రిలీజ్ అవుతుంది. రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్ హీరోగా వస్తున్న ‘సెల్పీష్’ మూవీ డిసెంబర్ 9న విడుదల అవుతుంది. మరోపక్క ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ మూవీ కూడా డిసెంబర్ 15న బరిలోకి దిగుతుంది.


ఇలా డిసెంబర్ నెల మొత్తం మిడిల్ టైర్ హీరోలు , ఒక మోస్తారు చిన్న హీరోల సినిమాలతో కలకలలాడుతుంది. అయితే ఆ తర్వాతే అసలు ట్విస్ట్ మొదలు కాబోతోంది.. డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ డిసెంబర్ 22న విడుదలవుతుందని టాక్. మరోపక్క జవాన్ చిత్రంతో బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి బజ్ క్రియేట్ చేసిన షారుక్ తన ‘డంకీ`తో థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్నాడు.

రిలీజ్ అవుతున్న సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఉండడమే కాకుండా ..భారీ అంచనాల మధ్య కోట్లల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొన్నవే కావడంతో వీటిపై అంచనాలు భారీగా ఉన్నాయి. డిసెంబర్ నెలలోనే ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

సంక్రాంతి బరిలో దిగలేని చిన్న సినిమాలు చాలా వరకు ఈ రెండు నెలలను టార్గెట్ గా పెట్టుకున్నాయి. ఇప్పుడు మిస్ అయితే ఇక సంక్రాంతి సంబరాలు పూర్తయ్యే వరకూ సినిమాల రిలీజ్ ఆపుకోవాలి. మరోపక్క అగ్ర హీరోల సినిమాలు క్యూ కట్టి ఉన్నప్పుడు థియేటర్ లు చిన్న సినిమాలకు దొరకడం కష్టమవుతుంది. అయితే ప్రస్తుతం ఈ రెండు నెలల్లో కూడా థియేటర్లు దొరకడం కాస్త కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక సినిమాల ప్రియులకు దసరా తర్వాత నుంచి ఈ సంక్రాంతి ముందు వరకు ఫుల్ ఫెస్టివల్ సీజన్ అనే చెప్పాలి.

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×