EPAPER
Kirrak Couples Episode 1

Upasana Konidela: ఆరోగ్యం విషయంలో మరో ముందడుగు.. హెచ్పీసీఎల్‌తో మెగా కోడలు పార్ట్‌నర్‌షిప్

Upasana Konidela: ఆరోగ్యం విషయంలో మరో ముందడుగు.. హెచ్పీసీఎల్‌తో మెగా కోడలు పార్ట్‌నర్‌షిప్

Upasana Konidela: మెగా కోడలుగా చాలామందికి పరిచయమయ్యారు ఉపాసన కొణిదెల. కానీ తన గురించి, తన సామాజిక సేవ గురించి తెలిసిన తర్వాత ఉపాసనకు చాలామంది అభిమానులు అయ్యారు. ఇప్పటికీ అపోలో హాస్పిటల్స్‌కు వైస్ ఛైర్‌పర్సన్‌గా పనిచేస్తూనే మరోవైపు ‘యువర్ లైఫ్’ అనే వెల్‌నెస్ సెంటర్‌ను స్థాపించారు. ఇండియాలోని వెల్‌నెస్ ఇండస్ట్రీలో ‘యువర్ లైఫ్’లో ఒక కొత్త అడుగు వేసేలా చేసింది. ఇక ఉపాసన భర్త రామ్ చరణ్ కూడా ఇందులో కో ఫౌండర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే వెల్‌నెస్ విషయంలో ఎన్నో కొత్త ఆలోచనతో ముందుకొచ్చిన ‘యువర్ లైఫ్’.. ఇప్పుడు కొత్త పార్ట్‌‌నర్‌షిప్‌తో మరింత మెరుగుపడాలని చూస్తోంది.


అన్నివిధాలుగా సాయం

వెల్‌నెస్ ఇండస్ట్రీలో ‘యువర్ లైఫ్’ ద్వారా ఎన్నో మార్పులు తీసుకురావాలని ఉపాసన కోరుకుంటున్నారు. ఇండియాలో హెల్త్ సెక్టార్ ఎలా ఉంది, దానిని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచిస్తున్నారు. అందుకే ‘యువర్ లైఫ్’లో టెక్నాలజీ ద్వారా వెల్‌నెస్ గురించి ప్రజల్లో ఎలా అవగాహన కలిగేలా చేయవచ్చు. అందుకే టెక్నాలజీ సాయంతోనే డాక్టర్ల అపాయింట్మెంట్స్, మెడిసిన్ డెలివరీలు, ఆన్‌లైన్‌లో కన్సల్టేషన్ లాంటి వాటివల్ల బిజీగా గడిపేవారికి కూడా వెల్‌నెస్ గురించి ఆలోచించే సమయం దొరుకుతుంది. ఇలాంటి ఆలోచనతోనే దేశవ్యాప్తంగా ఉన్న 550 హెల్త్ సెంటర్లు.. 20 లక్షలకు పైగా ప్రజల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.


Also Read: చేసేది ప్యాచ్ వర్క్ మాత్రమే.. పవన్ ఎన్ని రోజులు కేటాయించారంటే.?

ఉద్యోగులకు అందుబాటులో

ఉపాసన స్థాపించిన ‘యువర్ లైఫ్’ మరో అడుగు ముందుకేసింది. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)తో పార్ట్‌నర్‌షిప్‌కు సిద్ధమయ్యింది. దీంతో ఇండియాలోని వెల్‌నెస్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాలని ఉపాసన ఆశపడుతోంది. ప్రస్తుతం 94 హెచ్పీసీఎల్ సైట్స్‌లో యువర్ లైఫ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అక్కడ వారానికి ఒకసారి డాక్టర్లను కలిసే అవకాశం కల్పించడం, నిరంతరం ఆన్‌లైన్‌లో డాక్టర్ సపోర్ట్ అందడం, ఎమర్జెన్సీ మ్యానేజ్‌మెంట్.. ఇలాంటివన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా హెచ్పీసీఎల్‌లో పనిచేసే ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

సమాజాన్ని మెరుగుపరచాలి

హెచ్పీసీఎల్‌తో పార్ట్‌నర్‌షిప్‌పై ఉపాసన కొణిదెల సంతోషం వ్యక్తం చేశారు. ‘‘వెల్‌నెస్ అనేది కేవలం ట్రెండింగ్‌లో ఉన్న పదం మాత్రమే కాదు. ఇది సమాజాన్ని మెరుగుపరిచే మార్గం. ఆరోగ్యం విషయంలో ప్రజలు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం కోసం హెచ్పీసీఎల్‌తో మా పార్ట్‌నర్‌షిప్ ఒక ఉదాహరణ కావాలి. దీని ద్వారా వెల్‌నెస్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలన్నది నా ఆశ. మేము కార్పొరేట్ వెల్‌నెస్‌కు ప్రాముఖ్యత ఇస్తున్నాం. పనిచేసే చోట ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలిగేలా చేయాలని అనుకుంటున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు ఉపాసన. ఈ విషయం తెలిసినవారు రామ్ చరణ్, ఉపాసన లక్ష్యాలు, కలలు చాలా పెద్దవని, అవి నెరవేరాలని కోరుకుంటున్నారు.

Related News

Aishwarya Rai Bachchan: ఒక్క ఫోటోతో రూమర్స్ కి చెక్.. ఇకనైనా ఆగేనా..?

Star Hero Daughter : హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో కూతురు..

Rakul Preet : మరో బిజినెస్ లోకి రకుల్ ప్రీత్.. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ..

Hari Hara Veera Mallu: చేసేది ప్యాచ్ వర్క్ మాత్రమే.. పవన్ ఎన్ని రోజులు కేటాయించారంటే.?

Star Hero : సినిమాలు ఫ్లాప్.. కానీ రెమ్యూనరేషన్ మాత్రం తగ్గట్లేదు..హీరో రేంజ్ వేరే లెవల్..

Sandeep Kishan : పేరు మార్చుకున్న యంగ్ హీరో… న్యూమరాలజిని నమ్ముకుంటే లక్ కలిసొస్తుందా?

Big Stories

×