EPAPER

Uday Kiran: మార్చురీలో అలాంటి పని.. ఉదయ్ కిరణ్ మృతదేహం పై మ్యూజిక్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్..!

Uday Kiran: మార్చురీలో అలాంటి పని.. ఉదయ్ కిరణ్ మృతదేహం పై మ్యూజిక్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్..!

Uday Kiran.. ప్రముఖ డైరెక్టర్ తేజ (Teja) దర్శకత్వంలో వచ్చిన చిత్రం (Chitram)అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఉదయ్ కిరణ్ (Uday Kiran) ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సొంత టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న హీరోగా రికార్డ్ సృష్టించారు ఉదయ్ కిరణ్. ముఖ్యంగా నువ్వు నేను, మనసంతా నువ్వే ఇలా వరుస విజయాలు అందుకున్న ఈయన 2001లో ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత కలుసుకోవాలని సినిమాలో తన నృత్య ప్రతిభను అందరికీ చూపించారు. తెలుగులో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న తర్వాత 2005లో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ అనే చిత్రం ద్వారా తమిళ రంగ ప్రవేశం చేశారు. అక్కడ మరో రెండు సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించినా.. ఆ తర్వాత కొంతకాలానికి అక్కడి నుంచి వచ్చేశారు.


పేరు మోసిన నటుడు.. అవకాశాలు లేక ఆత్మహత్య.

ఇకపోతే ఆ తర్వాత కాలంలో ఈయన నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన ఈయన.. ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఈయన ఆత్మహత్య అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇకపోతే ఈయన మన మధ్య లేకపోయినా ఈయనకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది. అయితే ఈసారి ఏకంగా ఆయన డెడ్ బాడీ గురించి వార్తలు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈయనతో సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ తేజ తాను చనిపోయేలోపైనా ఉదయ్ కిరణ్ మరణానికి గల కారణాన్ని బయటపెడతాను అంటూ ఒక ఇంటర్వ్యూలో సంచలన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.


ఉదయ్ కిరణ్ డెడ్ బాడీ కి మార్చురీలో ఘోర అవమానం.

మరొకవైపు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్పి పట్నాయక్ కూడా ఉదయ్ కిరణ్ తో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయ్ కిరణ్ చనిపోయిన సమయంలో మార్చురీలో ఏం చేశారు అనే విషయాన్ని తాజాగా బయటపెట్టారు. ఉదయ్ కిరణ్ చేసిన ఎన్నో సినిమాలకు ఆర్పి పట్నాయక్ (RP Patnaik) సంగీత దర్శకుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య బాండింగ్ కూడా బాగా ఏర్పడింది. ఆ సన్నిహితంతోనే ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు ఆర్పి పట్నాయక్. ఆయన మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ మరణ వార్త విని ఆశ్చర్యపోయాను. హడావిడిగా హాస్పిటల్ కి వెళ్ళాను. అక్కడ ఉదయ్ కిరణ్ డెడ్ బాడీని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. ఎంతో పెద్ద పేరున్న హీరో చనిపోయాక ఆయన డెడ్ బాడీని ఒక మూలన పడేశారు. మార్చురీలో ఆయన బాడీ దగ్గర ఎవరూ లేరు. అంత పెద్ద పేరున్న నటుడికి మార్చురీలో కనీసం మర్యాద లభించకపోవడం నన్ను మరింత బాధకు గురిచేసింది. ఒక మూలన పడిన ఆయన శవాన్ని నేను చూసి తట్టుకోలేకపోయాను అంటూ ఆర్ పి పట్నాయక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చచ్చిపోతే ఎంత పేరు మోసిన వాళ్ళయినా సరే హీనంగా చూస్తారు అంటూ తెలిపారు.

Related News

Tripti Dimri : యానిమల్ బ్యూటి చేసిన మొదటి యాడ్?..అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు..

Naga Vamshi : ఆ హీరోల పరువు అడ్డంగా తీసేసిన నిర్మాత.. నమ్మించి ముంచడం అంటే ఇదే..

Balayya : ఇదెక్కడి పిచ్చి మామా .. బాలయ్య పండక్కి సెలవు కావాలట..!

Love Reddy: థియేటర్లో నటుడిపై మహిళ దాడి..ఇంత వైలెంట్ ఏంటి భయ్యా..

Mokshagna: వారసుడు కోసం వారసురాళ్లే కావాలా.. వర్మ.. ?

Ka Movie: అసలే హైప్ లేదంటే.. ఇంకా లేట్ చేయండి.. ఉన్న ఉత్సాహం కూడా పోతుంది

Sudigali Sudheer: వాళ్లే నన్ను బ్యాడ్ చేస్తున్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన సుధీర్

Big Stories

×