Trivikram Srinivas : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. స్వయంవరం సినిమాతో రచయితగా అడుగుపెట్టిన త్రివిక్రమ్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఒక సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాస్తున్నాడు అని తెలిసి, ఆ సినిమాకు వెళ్ళిన ఆడియన్స్ ఉన్నారు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటింగ్ లో ఒక సిగ్నేచర్ ఉంటుంది. ఒక డైలాగ్ వినగానే ఇది త్రివిక్రమ్ రాశాడు అని టక్కున చెప్పగలం. తెలుగు భాష ఎంత అందంగా ఉంటుంది అని చెప్పడంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక కీలక పాత్ర పోషించాడు అని చెప్పాలి. నలుగురు వ్యక్తులు కలిసినప్పుడు వారిలో కనీసం ఇద్దరైనా త్రివిక్రమ్ డైలాగుల్లో ఒకటైన మాట్లాడుతారు. అది త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్.
నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు త్రివిక్రమ్. ఆ సినిమా తర్వాత కేవలం స్టార్ హీరోస్తో మాత్రమే దర్శకుడుగా సినిమాలు చేశాడు. త్రివిక్రమ్ కెరియర్ లో తరుణ్ (Tharun), నితిన్ (Nithiin) తప్ప మిగతా సినిమాలన్నీ కూడా స్టార్ హీరోలు చేసినవే. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తప్ప మరో బ్యానర్ లో సినిమా చేయట్లేదు. ఆ బ్యానర్ కి అనుసంధానంగా నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ వైఫ్ కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఫార్చ్యూన్ ఫోర్ అని పేరుతో త్రివిక్రమ్ కూడా ఒక బ్యానర్ స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్ లో త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యానర్ లో ఒక సినిమా చేస్తే చాలు వరుసగా అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఈ బ్యానర్లు వెంకీ అట్లూరి, గౌతం తిన్ననూరి, కళ్యాణ్ శంకర్ వంటి దర్శకులు రిపీటెడ్ గా పనిచేస్తున్నారు.
Also Read: Lokesh Kanagaraj : లియో 2 గురించి కేవలం విజయ్ అన్న మాత్రమే చెప్పాలి
అలానే కొంతమంది హీరోయిన్స్ కూడా రిపీటెడ్ గా పని చేస్తున్నారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించింది సంయుక్త మీనన్. ఆ తర్వాత సితార ఎంటర్టైన్స్ బ్యానర్లు నిర్మితమైన సార్ (Sir) సినిమాలో మెయిన్ లీడ్ గా నటించింది సంయుక్త. ఇక రీసెంట్ గా హారిక హాసిని బ్యానర్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu) మరదలు పాత్రలో కనిపించింది మీనాక్షి చౌదరి. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వచ్చిన లక్కీ భాస్కర్ (Lucky Bhasker) సినిమాలు మెయిన్ లీడ్ గా నటించింది. ఈ సినిమాలో సుమతి అనే పాత్రలో కనిపించింది మీనాక్షి. ఈ పాత్రకి మీనాక్షి కరెక్ట్ అని త్రివిక్రమ్ తో పాటు నాగ వంశీ కూడా తెలిపారట. అప్పుడు సంయుక్త విషయంలోనూ, ఇప్పుడు మీనాక్షి విషయంలోనూ త్రివిక్రమ్ చెప్పడం వల్లనే హీరోయిన్ గా వాళ్లను పెట్టుకున్నారు వెంకీ.