EPAPER

Trivikram : మాటల మాంత్రికుడు.. ఆ డైలాగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్..

Trivikram :  మాటల మాంత్రికుడు.. ఆ డైలాగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్..

Trivikram : ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అని అంటారు. కానీ త్రివిక్రమ్ కు మాత్రం ఈ సూత్రం వర్తించదేమో అనిపిస్తుంది. ఒకవైపు మాటలతో తూటాలు పేల్చే రచయితగా.. మరో వైపు డైనమిక్ డైరెక్టర్ గా రెండు భిన్నమైన పాత్రలను పోషించడంలో త్రివిక్రమ్ కు సాటి ఎవరూ లేరు. త్రివిక్రమ్ డైలాగ్స్ కి ఫిదా అయిన టాలీవుడ్ అతని మేధా సంపత్తికి ముచ్చటపడి మాటల మాంత్రికుడు అన్న బిరుదుని కట్టబెట్టింది. చిన్న చిన్న పదాలు ఉపయోగించి , రోజువారి మనం మాట్లాడుకునే మాటలలో నుంచి అద్భుతమైన డైలాగులు రాయగలిగే సత్తా త్రివిక్రమ్ సొంతం.


నవంబర్ 7, 1971లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ జన్మించారు. ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ లో త్రివిక్రమ్ గోల్డ్ మెడల్ స్టూడెంట్. కొంతకాలం చదువుకు పదును పెట్టి విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. అయితే సాహిత్యంపై ఉన్న మక్కువతో క్రమంగా అతను సినీ రంగ ప్రవేశం చేశాడు.

మొదట్లో పోసాని కృష్ణ మురళి వద్ద సహాయకుడిగా కూడా పనిచేశాడు. అప్పట్లో త్రివిక్రమ్ సునీల్ తో కలిసి ఒకే రూమ్ షేర్ చేసుకునేవాడు. అందుకే చాలా సందర్భాలలో హీరో సునీల్ త్రివిక్రమ్ జీవితంలో మర్చిపోలేని వ్యక్తి అని అభివర్ణిస్తూ ఉంటాడు.


1999లో విడుదలైన స్వయంవరం చిత్రంలో మొదటిసారి త్రివిక్రమ్ రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ మూవీలో డైలాగ్స్ ఎవర్ గ్రీన్ గా ఉండడంతో క్రమంగా త్రివిక్రమ్ కు ఆఫర్స్ వచ్చాయి. సముద్రం , నువ్వే కావాలి, నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చావు, వాసు , మల్లీశ్వరి, జై చిరంజీవ , మన్మధుడు ఇలా చాలా సినిమాలకు స్టోరీ, స్క్రీన్ ప్లే రచయితగా త్రివిక్రమ్ మంచి పేరు సంపాదించారు. అలా క్రమంగా రచయితగా ఉన్న త్రివిక్రమ్ నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడుగా మారాడు.

శ్రియ, తరుణ్ కాంబినేషన్లో వచ్చిన ఆ చిత్రం మంచి సక్సెస్ సాధించడంతో నెక్స్ట్ అతడు మూవీ మహేష్ బాబుతో చేశాడు. అతడు అప్పట్లో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పటికీ అతడు మూవీలో ” వాడు మగాడు రా బుజ్జి..”,”నిజం చెప్పే ధైర్యం లేని వాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు.” లాంటి డైలాగ్స్ బ్రెయిన్ లో అలా ఉండిపోయాయి. ఇక ఆ తర్వాత జల్సా , జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి.. ఇలా అంచలంచెలుగా తన మాటకు పదును పెడుతూ ఇండస్ట్రీలో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోయాడు త్రివిక్రమ్. జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీలో రిలేషన్స్ ప్రాముఖ్యత చూపించడంతోపాటు డైలాగ్స్ హైలైట్ చేసే పద్ధతి అద్భుతంగా ఉంటుంది.

మంచి సక్సెస్ సాధించే సమయంలో ఖలేజా , అజ్ఞాతవాసి రూపంలో త్రివిక్రమ్ కాస్త నిరాశ ఎదురయింది. ఇక అతని పని అయిపోయింది అనుకునే సమయానికి తిరిగి అల వైకుంఠపురం అంటూ.. అందరిని అలరించాడు. ఇప్పుడు మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీతో సంక్రాంతి బరిలోకి సై అని దిగుతున్నాడు. అన్నం అంతా ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అన్నట్లు త్రివిక్రమ్ ఏంటో చెప్పడానికి అతని డైలాగ్ ఒకటి వింటే చాలు.

ఆశ క్యాన్సర్‌ ఉన్నోడిని కూడా బతికిస్తుంది. భయం అల్సర్‌ ఉన్నోడిని కూడా చంపేస్తుంది. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది. విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది. ఈ ఒక్క డైలాగ్ జీవితం పట్ల ఒక మనిషి ఆశ ,నిరాశ ఎలా ఉంటుందో అద్భుతంగా వర్ణించాడు త్రివిక్రమ్. ఇలాంటి ఆణిముత్యాలు త్రివిక్రమ్ మూవీలో ఎన్నో.. విమర్శను సైతం వండి విస్తరలో అందంగా వడ్డించి విందు భోజనంగా పెట్టడం ఒక్క త్రివిక్రమ్ కే సాధ్యమవుతుంది. అలాంటి మాటల మాంత్రికుడికి బిగ్ టీవీ తరపున జన్మదిన శుభాకాంక్షలు.

Related News

Mahesh Babu : మహేష్ బాబు సినిమాలో ఎన్టీఆర్.. ఇదేం ట్విస్ట్ మామా.. నిజమైతే థియేటర్లు చిరిగిపోవాల్సిందే..

Chiranjeevi: ఏఎన్నార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం.. చిరు పోస్ట్ వైరల్

Srikanth Odela: దేవిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు అంటే ఈసారి ఏం ప్లాన్ చేసాడో

NTR 31 : హీరో లేకుండానే “ఎన్టీఆర్31” షూట్… ఎన్టీఆర్ సెట్స్ లో అడుగు పెట్టేదెప్పుడంటే?

Allu Arjun : ఆ సినిమా నుంచి హీరోయిన్ తప్పుకుంది… తర్వాత బన్నీ బతిమలాడి తీసుకొచ్చాడు.

NTR: చచ్చిపోతానేమో అనుకున్నా.. ఛీఛీ.. నా మీద నాకే చిరాకేసింది..

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Big Stories

×