EPAPER
Kirrak Couples Episode 1

Trisha : త్రిషకు షాక్ ఇచ్చిన కోర్టు… అర్థం లేదు అంటూ ఆ కేసు కొట్టేసిన జడ్జి

Trisha : త్రిషకు షాక్ ఇచ్చిన కోర్టు… అర్థం లేదు అంటూ ఆ కేసు కొట్టేసిన జడ్జి

Trisha : గత కొంతకాలంగా పొరుగు వారితో త్రిషకు నడుస్తున్న కాంపౌండ్ వాల్ గొడవ కేసును తాజాగా కోర్టు కొట్టేసింది. మరి త్రిష సమస్యకు పరిష్కారం దొరికిందా? అసలు ఈ వివాదం ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


వివాదం ఏంటంటే.. 

చెన్నైలోని సేనాడోప్ రోడ్ సెకండ్ స్ట్రీట్‌లో త్రిష ఇల్లు ఉంది. అయితే ఆమెకు, పొరుగున ఉన్న వారితో రెండు ఇళ్ల మధ్య ఉన్న కాంపౌండ్ వాల్ వల్ల గొడవ వచ్చింది. పొరుగింటి వాళ్ళు తన ఇంటి భవనాన్ని ప్రభావితం చేసేలా కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసి కొత్త ఇంటి నిర్మాణ పనులు చేపట్టకుండా ఆపాలంటూ నైబర్ మెయ్యప్పన్‌ పై త్రిష చెన్నై కోర్టులో కేసు వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు కాంపౌండ్ వాల్‌ను కూల్చి వేయరాదని ఆదేశించింది. కాగా తాజాగా త్రిష తన పొరుగున ఉన్న మెయ్యప్పన్‌తో ఈ విషయంలో రాజీ పడిందని సమాచారం. ఇందులో మెయ్యప్పన్ తన భార్య కావేరి, వారి న్యాయవాది సంతకం చేసిన జాయింట్ సెటిల్‌మెంట్ మెమోరాండంను కోర్టులో దాఖలు చేయడంతో కేసును ముగించారు. దీంతో త్రిష కట్టిన కోర్టు ఫీజు రీఫండ్‌ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు.


అంతకుముందు కేసును విచారించిన న్యాయమూర్తి ఎన్. సతీష్ కుమార్ గోడను పడగొట్టకుండా ఉండడానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు మళ్లీ జస్టిస్ డీకారామన్ ముందు తాజాగా విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే నటి త్రిష, ఆమె వ్యతిరేక పార్టీ మెయ్యప్పన్‌ ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నట్లు సమాచారం. దీంతో కేసును ముగించిన న్యాయమూర్తి.. త్రిష చెల్లించిన కోర్టు ఫీజును వాపసు చేయాల్సిందిగా రిజిస్ట్రీ శాఖను ఆదేశించారు. అలాగే ఆమె దాఖలు చేసిన కేసును మూసివేయాలని మద్రాసు హైకోర్టు ఆదేశించారు.

సమస్య ఎక్కడ వచ్చిందంటే?

నటి త్రిష 2005లో ఈ ఇంటిని కొనగా, ఆమె పొరుగు వారు 2023లో ఆ పక్క ఇంటిని కొన్నారు. తరువాత కొన్నాళ్ళకు వారి భవనాన్ని కూల్చివేసి కొత్త భవనాన్ని కట్టాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఇంటిని కూల్చి వేస్తుండగా, రెండు ఇళ్లకు మధ్యన ఉన్న కాంపౌండ్ వాల్ తో సమస్య మొదలైంది. ఎందుకంటే ఈ గోడను కూల్చివేస్తే త్రిష ఇంటికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని సమాచారం. నిజానికి వీరిద్దరూ ఆ ఇళ్లను కొనకముందే, ఆ ఇళ్ళల్లో ఉన్న మాజీ యాజమానులు ఇద్దరూ కలిసి ఆ గోడను నిర్మించుకున్నారట. కానీ ఇప్పుడు ఆ గోడ వల్ల త్రిష ఇంటికి సమస్య రావడంతో దాన్ని కూల్చవద్దనేది త్రిష వాదన.

కానీ అవతలి వ్యక్తులు వినకపోవడంతో కేసు వేసింది త్రిష. జనవరి 24న జస్టిస్ ఎన్. సతీష్ కుమార్ ముందు ఈ కేసు విచారణకు రాగా గోడను కూల్చకుండా స్టే విధించారు. అలా మధ్యంతర నిషేధం చాలాసార్లు పొడిగించారు. కానీ తాజాగా త్రిష తల్లి, ఆమె పొరుగువారు 2024 మార్చి 21న హైకోర్టుకు హాజరయ్యారు. అంతకంటే ముందే త్రిష, సదరు పొరుగువారు కాంప్రమైజ్ కావడంతో జడ్జి కేసును కొట్టేశారు.

Related News

Bhale Unnade OTT : అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mahesh Babu: మహేష్, రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ?

Devara Movie :’ దేవర ‘ హిట్ కొట్టిందా? సినిమాకు హైలెట్ అదే..?

Devara Review : దేవర మూవీ రివ్యూ

TheyCallHimOG: ఓజీ రివ్యూ.. సుజీత్ సంభవం.. పవన్ కమ్ బ్యాక్ అదిరింది

Pushpa 2: పుష్ప 2 సెట్ లో బాహుబలి డైరెక్టర్.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో

NTR: పెద్ద ఎన్టీఆర్ డ్యాన్స్ ను దింపేశాడు మావా.. ఆయుధ పూజకు పూనకాలేరా

Big Stories

×