EPAPER
Kirrak Couples Episode 1

Top 5 YouTube channels : ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 యూట్యూబ్ ఛానెల్స్ ఇవే..

Top 5 YouTube channels : ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 యూట్యూబ్ ఛానెల్స్ ఇవే..

Top 5 YouTube channels : ప్రస్తుతం సోషల్ మీడియాను ఉపయోగించని వారు చాలా తక్కువ ఉన్నారు. మెసేజింగ్ యాప్స్ ఉపయోగించని వారు కూడా యూట్యూబ్‌ను వీడియోలు చూసి ఎంజాయ్ చేయడానికి ఉపయోగిస్తుంటారు. అందుకే చాలామంది యూట్యూబ్‌తో తమ టాలెంట్‌ను బయటపెట్టుకోవడం, ఆదాయాన్ని సంపాదించుకోవడం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో కోట్ల యూట్యూబ్ ఛానెల్లలో టాప్ 5 సబ్‌స్రైబర్స్ ఉన్న ఛానెళ్లు ఏంటంటే..


  1. టీ సిరీస్ :
    టి సిరీస్ అనేది ఇప్పటికే సినిమాల ప్రొడక్షన్‌లో ఫుల్ బిజీగా ఉంది. అంతే కాకుండా మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా ఈ సంస్థ వేగంగా దూసుకుపోతోంది. 1983 జులై 11న ఢిల్లీలో టీ సిరీస్ ప్రారంభమయ్యింది. ప్రముఖ మ్యూజిక్ ప్రొడ్యూసర్ గుల్షన్ కుమార్ టి సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం టీ సిరీస్‌కు గుల్షన్ కుమార్ వారసుడు భూషన్ కుమార్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా అభివృద్ధి చెందుతున్న సమయంలో టీ సిరీస్‌కు ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటే బాగుంటుందని భావించిన సంస్థ.. ఆ పేరుతో 2006లో ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఛానెల్‌కు 232 బిలియన్‌కు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వారు రిలీజ్ చేసే ప్రతీ వీడియోకు 200 బిలియన్‌కు పైగా వ్యూస్ వస్తాయి. అందుకే ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 యూట్యూబ్ ఛానెల్‌గా పేరుతెచ్చుకుంది.
  2. కోకోమిలన్:
    కోకోమిలన్ అనే పేరు పిల్లలు ఉండే ప్రతీ ఇంటివారికి చాలావరకు తెలిసే ఉంటుంది. ఈ జెనరేషన్‌లో పిల్లలు మాటలు రాకముందే యూట్యూబ్‌లో వీడియోలకు అలవాటు పడుతున్నారు. యానిమేషన్ వీడియోలు పిల్లలను బాగా ఆకర్షిస్తున్నాయి. దాంతో పాటు రైమ్స్ వంటివి కూడా వారిని ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. అలా పిల్లలను ఎంటర్‌టైన్ చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లలో కోకోమిలన్ ముందు స్థానంలో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఛానెల్‌లో 843 వీడియోలు ఉన్నాయి. అందులో చాలావరకు రైమ్సే ఉంటాయి. కోకోమిలన్‌కు 151 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 2006 సెప్టెంబర్ 1న ప్రారంభమయిన ఈ ఛానెల్.. జే జియోన్ ప్రారంభించారు. తన భార్య, పిల్లల కోసం ప్రారంభించిన ఈ ఛానెల్ ఎంతోమంది పిల్లలను ఎంటర్‌టైన్ చేయడానికి ఉపయోగపడుతోంది.
  3. సెట్ ఇండియా:
    సెట్ నెట్‌వర్క్ అనేది టీవీలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌గా పేరు తెచ్చుకుంది. ఈ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఎన్నో ఇతర ఎంటర్‌టైన్మెంట్ ఛానెళ్లు కూడా ఉన్నాయి. అందుకే తన ప్రేక్షకులను ఆకర్షించడానికి సెట్ ఇండియా యూట్యూబ్ ఛానెళ్‌ను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఛానెల్‌లో 1,02,635 వీడియోలు ఉన్నాయి. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 149 మిలియన్ సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుంది. ఇటీవల సోని లివ్ పేరుతో ఒక ఓటీటీని కూడా ప్రారంభించింది సెట్ ఇండియా. పాటలు, సినిమాలు లాంటి ఎంటర్‌టైన్మెంట్ అందిస్తున్న ఈ ఛానెల్.. ప్రపంచంలోనే టాప్ 3 యూట్యూబ్ ఛానెల్‌గా స్థానం దక్కించుకుంది.
  4. మిస్టర్ బీస్ట్:
    ప్రపంచవ్యాప్తంగా ఈ మిస్టర్ బీస్ట్ చాలా ఫేమస్. అతడి అసలు పేరు జిమ్మి డోనాల్డ్‌సన్. అమెరికాకు చెందిన ఈ యూట్యూబర్ కేవలం తన యూట్యూబ్ ఛానెల్‌తోనే ఎంటర్‌టైన్మెంట్ ప్రియులను తనవైపు తిప్పుకున్నాడు. ఈరోజుల్లో అడ్వెంచర్లను ఇష్టపడని యువత చాలా తక్కువ. అందుకే అడ్వెంచర్లు చేయాలనుకునే యువత కోసం ఖరీదైన స్టంట్లను చేసి చూపిస్తుంటాడు. అది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువతను ఆకర్షించింది. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానెళ్లో 733 వీడియోలు ఉన్నాయి. ఇప్పటివరకు మిస్టర్ బీస్ట్ 127 మిలియన్ సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నాడు. కొన్నాళ్ల క్రితం టాప్ 1 స్థానంలో ఉన్న టీ సిరీస్ కంటే ఎక్కువ సంపాదన అందుకున్నాడు మిస్టర్ బీస్ట్. ప్రస్తుతం ప్రపంచంలోనే ఫేమస్ యూట్యూబ్ ఛానెళ్లలో మిస్టర్ బీస్ట్ నాల్గవ స్థానంలో ఉన్నాడు.
  5. ప్యూడైపై:
    టెక్నాలజీ ఎంత పెరిగినా.. వర్చువల్ టెక్నాలజీలో ఎన్ని గేమ్స్ వచ్చినా.. ఇప్పటికీ వీడియో గేమ్స్ ఆడేవారు కూడా ఉన్నారు. వీడియో గేమ్స్‌లో పోటీలు పెట్టుకొని ఆడి ఎంటర్‌టైన్ అయ్యేవారు కూడా ఉన్నారు. ఫెరిక్స్ ఆర్విడ్ ఉల్ఫ్ జెల్‌బర్గ్.. స్వీడెన్‌కు చెందిన యూట్యూబర్. తను తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో గేమ్స్ ఆడిస్తూ, ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తూ యూజర్లను ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానెల్‌లో 4,693 వీడియోలు ఉన్నాయి. 111 మిలియన్ సబ్‌స్క్రైబర్లతో ప్రపంచంలోనే టాప్ 5 స్థానాన్ని దక్కించుకున్నాడు.


Related News

Devara Movie: మరోసారి ‘దేవర’కు ‘ఆంధ్రావాలా’తో పోలిక.. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో?

Devara Pre Release Event: ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ మాస్.. ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సెల్?

Director Shankar: ఆ సీన్స్ కాపీ కొట్టారు.. ‘దేవర’ ట్రైలర్‌పై దర్శకుడు శంకర్ షాకింగ్ ఆరోపణలు?

Guinness World Record : గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్న ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్… ఎంత మంది సౌత్ స్టార్స్ ఉన్నారో తెలుసా?

Chiranjeevi: గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చిరుకు చోటు… ఎందుకో తెలుసా?

Amitabh Bachchan: అప్పుడు నేలపైనే పడుకునేవారు, ఆయన స్టార్లలోనే సుప్రీమ్.. రజినీపై అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Devara Pre Release Event: ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చు అన్ని కోట్లా? గట్టిగానే ప్లాన్ చేశారుగా!

Big Stories

×