EPAPER

Indian Actors: ఇండియాలో అలాంటి హీరోలు ఈ నలుగురే.. నిజంగా గ్రేట్ కదా..!

Indian Actors: ఇండియాలో అలాంటి హీరోలు ఈ నలుగురే.. నిజంగా గ్రేట్ కదా..!

Indian Actors : ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఒక నలుగురు హీరోలు మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా వాళ్ల పేరు వింటే బాక్సాఫీస్ షేక్ అయినట్లే. వారు సినిమాలు అనౌన్స్ చేశారంటే చాలు.. రికార్డులు సైతం బద్దలవ్వాల్సిందే. ఇంతకు ఆ నలుగురు హీరోలు ఎవరో కాదు.. ఎన్టీఆర్ (NTR),అల్లు అర్జున్(Allu Arjun), ప్రభాస్ (Prabhas), కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay ) ఇప్పుడు వీళ్లు ప్రాజెక్టులు టేకప్ చేస్తే నిర్మాతలకు కాసుల వర్షమే అని చెప్పడంలో సందేహం లేదు. సినిమా సినిమాకి రేంజ్ పెంచుకుంటూ దూసుకుపోతున్నారు.


ఇండియాలో ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు రూ.1000 కోట్ల మూవీ అని ఆడియన్స్ సైతం డిసైడ్ అయిపోతున్నారు. బాలీవుడ్ హీరోల హిట్ సినిమాలకి, ప్రభాస్ ఫ్లాప్ సినిమాలకి కలెక్షన్స్ దాదాపు ఒకేలా ఉంటున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కల్కి సినిమాతో రూ .1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఎవరికి అందని ఎత్తులో నిలిచాడు ప్రభాస్. దీనికి తోడు మరో నాలుగు సినిమాలు లైన్ లో పెట్టి అన్ని భాషల్లో స్టార్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు.

మరొకవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. దేవర సినిమాతో పాన్ ఇండియా సినిమాలకి ఒక కొత్త టార్గెట్ ఫిక్స్ చేశాడని చెప్పవచ్చు. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా పాగా వేస్తున్నాడు. అక్కడ హృతిక్ రోషన్ తో కలిసి వార్ -2 లో నటిస్తూ అక్కడి హీరోలకు టెన్షన్ పుట్టిస్తున్నారు.


అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన , పుష్ప సినిమాతో తన రేంజ్ ను మరింత పెంచుకున్నారు. పుష్ప -2 తో దుమ్మురేపాలని , రికార్డులు బ్రేక్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు.

మరోవైపు విజయ్ దళపతి.. ప్రస్తుతం రూ.275 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే ఒకే ఒక్క హీరోగా రికార్డు సృష్టించారు. విజయ్ తో సినిమా అంటే తమిళ డైరెక్టర్లకు ఒక ఛాలెంజ్.

ఈ నలుగురు హీరోలు కూడా బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ మిగతా హీరోలకి సవాల్ విసురుతున్నారు. ఇలాంటి ఈ నలుగురు హీరోలలో ఒక కామన్ విషయం ఉంది. అదేమిటంటే వీళ్లంతా కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో వీళ్ళ లుక్స్ చూసి చాలామంది నెగటివ్ కామెంట్స్ చేశారు. చూడడానికి అందంగా లేరని, సినిమా రంగంలో సెట్ కారని , అసలు వీరి సినిమాలో ఎవరు చూస్తారని ఇలా ఎన్నో అవమానాలు చేశారు.

ఉదాహరణకు ప్రభాస్ ను ఈశ్వర్ సినిమా సమయంలో ఎన్నో కామెంట్స్ చేశారు. రాఘవేంద్ర సమయంలో ప్రభాస్ లుక్స్ చూసి ఆడియన్స్ కూడా కామెంట్ చేశారు.

విజయ్ కెరియర్ మొదలు పెట్టినప్పుడు నల్లగా ఉండేవాడు. ఆ సమయంలో విజయ్ గురించి తమిళ జనాలే కామెంట్ చేయడం గమనార్హం.

అప్పట్లో ఎన్టీఆర్ కూడా లావుగా ఉండేవాడు. ఆ టైంలో ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి హీరోగా పనికిరాడు అని ఒక వర్గం వారు రకరకాల కామెంట్లు గుప్పించారు.

వీరికి తోడు అల్లు అర్జున్ కూడా గంగోత్రి సినిమా సమయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఆ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇలా ఒకప్పుడు ధారణమైన ట్రోల్స్ ఎదుర్కొన్న ఈ నలుగురు ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా సెటిలై పోవడంతో ప్రతి ఒక్కరు వీరి టాలెంట్ కి ఫిదా అవుతున్నారు.

Related News

Unstoppable with NBK : అన్ స్టాపబుల్ ఈ సారి ప్లాప్ ?… ఏ మాత్రం లేని ఆదరణ..

Jai Hanuman: రానా రాముడిగా మారితే జరిగేది ఇదే… ప్రశాంత్ వర్మ ప్లాన్ బెడిసికొట్టనుందా?

Salman Khan Receives another Threat : భిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరోసారి బెదరింపులు… ఈ సారి రెండు ఆఫర్స్..!

Game Changer Movie Teaser: మెగా ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా.. టీజర్ లాంచ్ కి సర్వం సిద్ధం..!

Chandini Chowdary : తీవ్ర గాయం… సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన హీరోయిన్… మరి బాలయ్యతో సినిమా?

Director Krish Second Marriage: రెండో పెళ్లికి సిద్ధమైన డైరెక్టర్ క్రిష్.. వధువు ఎవరంటే..?

War 2 : ‘వార్ 2 ‘ లో ఎన్టీఆర్ చనిపోతాడా? స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లా…!

Big Stories

×