EPAPER

Singer Chinmayi Fire on Trollers: ట్రోలర్స్, మీమ్స్ పై సింగర్ చిన్మయి ఫైర్‌.. సమాజం ఎటు పోతోందంటూ..

Singer Chinmayi Fire on Trollers: ట్రోలర్స్, మీమ్స్ పై సింగర్ చిన్మయి ఫైర్‌.. సమాజం ఎటు పోతోందంటూ..

Singer Chinmay fire on Trolls And Memes: టాలీవుడ్ సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా.. మరోవైపు సింగర్‌గా ఆడియెన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.తాజాగా డార్క్ కామెడీ, అడల్ట్ మీమ్స్, ట్రోల్స్ చేసే వారి మీద సింగర్‌ చిన్మయి తనదైన శైలీలో మండిపడింది.దేశంలో రేప్‌లు చేసే వారిని చూసి ఆగ్రహిస్తున్నామని, కానీ మన పక్కనే ఉంటూ ఇలా వినోదం పేరుతో అడల్ట్ జోకులు వేసే వారిని నిలదీయలేకపోతోన్నామని, ఇలాంటి మీమ్స్, ట్రోల్స్ ఎందుకు వేస్తున్నామని అడిగే దమ్ము మనకు లేకపోయిందంటూ అందరినీ విమర్శించింది చిన్మయి.ఇలాంటి వాటి మీద రియాక్ట్ అయితే యాంటి నేషనల్, ఫెమినిస్ట్, అర్బన్ నక్సల్స్ అంటూ విమర్శిస్తారని మండిపడింది.


అంతేకాదు తాజాగా ఓ వీడియోని షేర్ చేసింది.తన అభిప్రాయాన్ని చెబుతూ..సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ పేరిట జరుగుతున్న అరాచకాలని ప్రశ్నించింది.చిన్నారి మీద మైనర్‌లు చేసిన అత్యాచార ఘటన మీద అందరూ స్పందిస్తున్నారని,అసలు ఈ సమాజం ఎటు పోతోందని, చిన్న పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చి పాడు చేస్తున్నారని, వారికి ఇచ్చే ముందు ఇంటర్‌నెట్ కట్ చేసేయాలని ఇలా ఏవేవో సలహాలు ఇస్తున్నారని చిన్మయి మండిపడింది. కానీ నెట్టింట్లో మళ్లీ వారే మీమ్స్, ట్రోల్స్ అంటూ అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారని చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఇక ఇదిలా ఉంటే గతంలో కూడా భారత్‌లో పుట్టడం కర్మ అంటూ సోషల్‌మీడియా వేదికగా తన ఆవేదనని వ్యక్తం చేసి వార్తల్లో నిలిచింది. ఈ మేరకు తాజాగా చిన్మయి ఓ వీడియోని షేర్ చేసింది.అందులో నంద్యాల ఘటన మీద రియాక్ట్ అయింది.మూడో తరగతి చదువుతున్న చిన్నారి మీద మైనర్ విద్యార్థులు చేసిన అత్యాచార ఘటన మీద అందరూ రియాక్ట్ అవుతున్నారు.అయ్యో సమాజం ఎటు పోతోంది, ఏమైపోతోంది అంటూ పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారని చిన్మయి మండిపడుతోంది.ఈ క్రమంలో ఓ మీమ్‌ను తన వీడియోలో చూపించింది.దాని కింద నెటిజన్లు పెట్టిన కామెంట్లను చూపించింది.ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేశారు.అసభ్యకరమైన ఆ కామెంట్లను చిన్మయి చూపించింది.ఇలా కామెంట్లు చేసే వారు మన చుట్టూ ఉంటారు. వారిని ప్రశ్నించే గట్స్, దమ్ము మీకు ఉందా? పైగా చదువుకున్న వారే ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు.


Also Read:ఓటీటీలోకి భారతీయుడు ఎంట్రీ, షాక్‌లో ఆడియెన్స్..

ఇదంతా ఏంటని అడిగితే మళ్లీ ఫెమినిస్టులు, అర్బన్ నక్సల్స్,యాంటీ నేషనల్స్ అంటూ కొంతమంది కేసులు పెట్టేందుకు రెడీ అవుతారని చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది.సోషల్ మీడియాలో ఓ నటుడు, నటి నచ్చకపోయినా సరే వారి కుటుంబాన్ని మొత్తం లాగీ దారుణంగా ట్రోల్ చేస్తూ తిడుతున్నారంటూ చిన్మయి సోషల్ మీడియా అబ్యూజింగ్ గురించి మాట్లాడింది.ప్రస్తుతం చిన్మయి షేర్ చేసిన ఈ వీడియో మీద నెట్టింట్లో చర్చలు తీవ్రస్థాయిలో నడుస్తున్నాయి. అందులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుందని అన్నారు ఆమె.

 

View this post on Instagram

 

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)

Tags

Related News

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Big Stories

×