Tollywood’s Richest Director : తెలుగులో రిచెస్ట్ డైరెక్టర్ ఎవరు అనే క్వశ్చన్ వస్తే మీకు వచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటాయి…
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు చేసిన రాజమౌళినా..?
పుష్పతో బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమారా..?
మాటల మాంత్రికుడు అని చెప్పుకునే త్రివిక్రమా..?
దేవరతో కంబ్యాక్ ఇచ్చిన కొరటాల శివనా..?
ఈ మధ్య హిట్ కొట్టిన ఇంకెవరైన డైరెక్టర్స్ పేర్లు గుర్తుస్తున్నాయా..? అయితే ఇక్కడ చర్చించుకునేది వీళ్లెవరి గురించి కాదు…
చేసింది 4 సినిమాలు అందులో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఒకే ఒక సినిమా. దానితోనే కోట్ల రూపాయలు వెనకేసుకుంటూ… ఇండస్ట్రీలోనే రిచెస్ట్ డైరెక్టర్‌గా మారిపోయాడు ఆయన.
ఈ ఏడాది ప్రారంభంలో సినిమా రిలీజ్ అయింది. 300 కోట్ల వరకు ఆ సినిమా కలెక్ట్ చేసింది. అప్పటి వరకు చిన్న డైరెక్టర్ గా ఉన్న ఆయన ఒక సారిగా స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు. వరుసగా సినిమాలను అనౌన్స్ చేశాడు. కొన్నింటికి స్టోరీలు… కొన్నింటికీ నిర్మాత.. ఇలా ఏదో ఒక రోల్ ను ఫిక్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు.
అంతే కాదు… చాలా మంది నిర్మాతల దగ్గర కోట్లాది రూపాయలను అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. ఆ సినిమాలు స్టార్ట్ అయ్యాయా… అంటే ఇంకా అవ్వలేదు. వ్యూచర్‌లో అవుతాయా… అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే.. ‘మమ్మల్ని అడగకండి సార్’. అనే ఆన్సర్ మాత్రమే వస్తుంది.
ఓ సూపర్ స్టార్ రిలేటివ్ అయిన ఓ యంగ్ హీరో సినిమా వస్తుంది. దీనికి ఈ రిచెస్ట్ డైరెక్టర్ కేవలం కథ ఇచ్చిన దానికే దాదాపు 1 కోటి రూపాయలపైన రెమ్యునరేషన్ తీసుకున్నాడట.
ఓ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు డెబ్యూ మూవీకి ఈయన డైరెక్టర్ అని ఓ సినిమా అనౌన్స్ చేశారు. అదిరిపోయే, సూపర్ కథను ఇచ్చాడు. అయితే ఇప్పుడు తాను డైరెక్షన్ చేయలేను… తన అసిస్టెంట్‌తో డైరెక్షన్ చేయిస్తా అని అంటున్నాడట. ఈ మూవీకి ఆయన కథను అందించారు కదా… ఆ కథకే దాదాపు 2 కోట్ల రూపాయలు అందుకున్నాడట.
అలాగే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా వస్తుంది. దీనికి కూడా కథ ఇచ్చింది ఈయనే. ఈ మూవీని తన అసిస్టెంట్ అయిన ఓ లేడీ డెబ్యూ డైరెక్టర్‌తో చేయిస్తున్నాడు. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి కూడా కథను అందించింది ఈయనే కదా. అందుకు గాను ఈ రిచెస్ట్ డైరెక్టర్ అందుకున్న పారితోషికం 2 కోట్లు.
ఇలా కొన్ని సినిమాలను నుంచి తీసుకున్నది.. కొంత మంది నిర్మాతల నుంచి అడ్వాన్స్‌ల రూపం మొత్తం 30 నుంచి 40 కోట్ల వరకు వెనకేసుకున్నాడని సమాచారం. అంతే కాదు.. హైదరాబాద్ లో చాలా చోట్ల ప్రాపర్టీలు కూడా కొంటున్నాడట.
ఈ రిచెస్ట్ డైరెక్టర్ చిత్రపూరి కాలనీ సమీపంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరలో ఓ అపార్ట్‌మెంట్‌లో 3 ఫ్లోర్స్‌ను కొనుగోలు చేశాడట.
అలాగే, మై హోం కి చెందిన ఓ ఫేమస్ అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లోర్స్‌ను కొనుగోలు చేశాడట.
ఇవి మాత్రమే కాదు… నగరంలో, నగర శివారులో కూడా ఈ రిచెస్ట్ డైరెక్టర్ కోట్ల విలువ చేసే ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దు కోవాలి కరెక్టే. దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు. కానీ, ఈ డైరెక్టర్ వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నా.. ఒక్క సినిమాను కూడా పూర్తి చేయడం లేదు. పైగా కొత్త సినిమాల కోసం అడ్వాన్స్ లు తీసుకుంటున్నాడు. అందుకే ఆయనపై ఇండస్ట్రీలో చాలా వ్యతిరేకత వస్తుందని తెలుస్తుంది. డైరెక్షన్ పక్కన పెట్టి జేబులు నింపుకోవడం బిజీ బిజి గా ఉంటున్నాడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.