EPAPER

Tollywood:రీ రిలీజులతో సరిపెడుతున్న టాప్ హీరోలు

Tollywood:రీ రిలీజులతో సరిపెడుతున్న టాప్ హీరోలు

Tollywood re release movies updates(Telugu cinema news):


ఒకప్పుడు శుక్రవారం వచ్చిందంటే చాలు సినిమా హాల్స ముందు క్యూకట్టేవారు. అగ్రహీరోల సినిమాలు రిలీజ్ అయితే చాలా ఆ ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. భారీ కటౌట్లు, దండలు, పాలాభిషేకాలతో పండుగ వాతావరణం కల్పించేవారు ఫ్యాన్స్. కరోనా తర్వాత జనం ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. ఇంట్లోనే హోం థియేటర్లు ఏర్పాటు చేసుకుని యావత్ కుటుంబం మత్తం కలిసి సినిమాలు చూస్తున్నారు. జనాన్ని థియేటర్లకు రప్పించే సినిమాలు వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు.ఇక ఈ సంవత్సరం హనుమాన్, గుంటూరు కారం, టిల్లూ స్క్వేర్, కల్కి వంటి సినిమాలే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. కల్కి మూవీతో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి తెలుగు సినిమా స్టామినాను మరోసారి చాటారు ప్రభాస్. కనీసం ఆ స్థాయిలో కాకున్నా..మూడునాలుగొందల కోట్లను రాబట్టే సినిమాలే గగనమయిపోతున్నాయి.

కంటెంట్ లేకేనా?


థియేటర్లకు రప్పించే కంటెంట్ లేకపోవడమేనా లేక పెరిగిన టిక్కెట్ ధరలా అని ప్రశ్నించుకుంటే కల్కి విషయంలో డబుల్ టికెట్ ఛార్జీలు వసూలు చేసినా మూవీని చూశారు.అంటే దీనిని బట్టి కంటెంట్ కూడా జనం కోరుకుంటున్నారని తెలుస్తోంది. సమ్మర్ అంతా ఎలాంటి భారీ కమర్షియల్ మూవీస్ రిలీజ్ చేయలేదు నిర్మాతలు. కేవలం కల్కి మూవీకి కలిసొచ్చిన అంశం కూడా అదొకటి. అప్పటిదాకా భారీ కమర్షియల్ మూవీస్ చూసి చాలా కాలం అవుతున్న సందర్భంలో కల్కి మూవీకి కలెక్షన్ల కనకవర్షం కరిసింది. కల్కి మూవీ తర్వాత కూడా భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతాయని..అగ్ర హీరోల సినిమాలు క్యూ కడతాయని భావించారు అంతా. ఆగస్టు 15న విడుదలవుతుందనుకున్న పుష్ప 2 సైతం వాయిదా పడింది.

షూటింగ్ లు ఆలస్యం

వాస్తవానికి అగ్ర హీరోల సినిమాలు దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని కేవలం ప్యాచ్ వర్క్ పనులు మినహా పెండింగ్ లో ఉన్నాయి. అయినా టాప్ హీరోలు ఆ దిశగా ప్రయత్నించడం లేదు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు మూవీ ఇంతవరకూ షూటింగ్ పట్టాలే ఎక్కలేదు. ఎలాగూ రెండు మూడేళ్ల గ్యాప్ ఉండటంతో ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు తన పాత సినిమా రిలీజ్ చేయిస్తున్నారు. అప్పట్లో కృష్ణ వంశీ దర్శకత్వంతో మహేష్ బాబు నటించిన మురారి మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఎంటర్ టైన్ చేసింది. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ఆగస్టు 29న నాగార్జున బర్త్ డే. ఈ సందర్భంగా పాతికేళ్ల క్రితం రిలీజయిన శివ మూవీని రీ రీలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజున గబ్బర్ సింగ్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు మూవీని కూడా రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22న ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేస్తామని నిర్మాత ప్రకటించారు.

4 కె టెక్నాలజీ

ఈ సినిమాలన్నీ 4 కె రిజల్యూషన్ టెక్నాలజీని జోడించి నిర్మాతలు ప్రేక్షకాభిమానులకు సరికొత్త అనుభూతి కలిగేలా ప్లాన్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ..అగ్ర హీరోలు ఇలానే రీ రిలీజులతో సరిపెడతారా అని..కంటెంట్ లేకనే ఇలా పాత సినిమాలు రిలీజ్ లపై దృష్టిపెట్టారని అనుకునే ప్రమాదం లేకపోలేదు. అగ్ర హీరోల ఫ్యాన్స్ మాత్రమే ఈ రీ రిలీజ్ సినిమాలను ఆదరిస్తున్నారే తప్ప మరే ఇతర సినిమాలకు ఆశించిన కలెక్షన్లు రావడం లేదు. రీ రిలీజులు కూడా ఎక్కువైతే వాటికున్న ఆదరణ కూడా ముందు ముందు తగ్గిపోయే ఛాన్స్ ఉందని సినీ విమర్శకులు చెబుతున్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×