EPAPER

Tollywood Heroine: రూ.500 కోట్ల స్కామ్ లో ఇరుక్కున్న తెలుగు హీరోయిన్.. ఎవరంటే..?

Tollywood Heroine: రూ.500 కోట్ల స్కామ్ లో ఇరుక్కున్న తెలుగు హీరోయిన్.. ఎవరంటే..?

Tollywood Heroine.. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా స్కామ్ లలో ఇరుక్కుంటున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు రాజ్ కుంద్రా నీలి చిత్రాల యాప్ కేసులో పట్టుబడగా జైలు నుంచి ఇటీవలే ఆయన బయటకు వచ్చారు. సుమారు రూ.200 కోట్లు మేరా స్కామ్ చేసిన సుకేష్ చంద్రశేఖర్ పలువురు హీరోయిన్లతో రొమాంటిక్ రిలేషన్ లో ఉండడం అప్పట్లో సంచలనం సృష్టించింది.. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తన పోడ్ కాస్ట్ తో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఒక హీరోయిన్ రూ.500 కోట్ల మేర యాప్ ఆధారిత కుంభకోణానికి పాల్పడినట్లు తెలిసి ఢిల్లీ పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు..


రియా చక్రవర్తికి సమన్లు జారీ..

ముఖ్యంగా సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్న పలువురు ప్రముఖులు ఒక అప్లికేషన్ ను విపరీతంగా ప్రచారం చేశారు. ఆ యాప్ లో డబ్బు పెట్టుబడి పెట్టిన తర్వాత వినియోగదారులను మోసం చేశారు. ఇలాంటి కేసులో ఒక తెలుగు హీరోయిన్ సమాన్లు అందుకుంది అని సమాచారం.. అసలు విషయంలోకి వెళితే.. తూనీగా తూనీగా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రియా చక్రవర్తి.. మరోవైపు హాస్యనటి భారతి సింగ్, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ వంటి ఇతర ప్రముఖులతో హైబాక్స్ మొబైల్ యాప్ లింక్ ను తెగ ప్రచారం చేశారు. డబ్బును పెట్టుబడిగా పెట్టిన యాప్ ద్వారా తమకు సంబంధం ఉందని క్లైమ్ చేస్తున్న వ్యక్తుల నుండి పోలీసులకు అనేక ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.


హై బాక్స్ యాప్ పేరిట భారీ కుంభకోణం..

వినియోగదారులు తమకు ఇష్టమైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు , యూట్యూబర్ల నుండి ప్రమోషనల్ వీడియోలు చూసిన తర్వాతనే ఈ యాప్ లో తమ డబ్బులు పెట్టుబడిగా పెట్టారని , ఈ కథనంలో తెలిపినట్లు సమాచారం. ముఖ్యంగా సెలబ్రిటీలు ప్రచారం చేసిన ఈ యాప్ తక్కువ పెట్టుబడితో అధిక డబ్బును ఇస్తుందని వాగ్దానం చేసింది. హై బాక్స్ అనేది ఒక చక్కటి ప్రణాళిక బద్ధమైన స్కామ్ లో భాగమైన ఒక మొబైల్ అప్లికేషన్ అని చెప్పవచ్చు. దీని ద్వారా నిందితులు ప్రతిరోజు ఒకటి నుండి ఐదు శాతం వరకు ఆదాయాన్ని హామీ ఇస్తున్నారు. నెలలో 30% నుండి 90% వరకు ఆదాయం అని ప్రకటించగానే దాదాపు 30 వేల మంది వ్యక్తులు ఈ యాప్ లో పెట్టుబడి పెట్టారు. ఇకపోతే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హేమంత్ తివారి కూడా ఈ యాప్ ద్వారా నిందితులు ప్రతిరోజు ఒక నెలలో 30 నుండి 90% వరకు హామీ ఇచ్చినట్లు పీటిఐకి తెలిపినట్లు వెల్లడించారు. ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ యాప్ మొదట్లో ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది. ఆ తర్వాత దీనిని ఎరగా వేసి వేలాది రూపాయలు సొంతం చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే సాంకేతిక లోపాలు, న్యాయపరమైన సమస్యలు రావడంతో జూలై నుంచి వారి చెల్లింపులు కాస్త నిలిచిపోయాయి. ముఖ్యంగా ఆదర్శ సింగ్, లక్ష్మీ చౌదరి, అభిషేక్ మల్హన్, సౌరవ్ జోషి వంటి తదితర చాలామంది ప్రభావశీలులకు లీగల్ నోటీసులు పంపిన పోలీసులు.. ప్రధాన నిందితుడు చెన్నైకి చెందిన శివరాం నాలుగు ఖాతా నుండి 18 కోట్ల స్వాధీనం చేసుకున్నట్లు కూడా తేలింది. మొత్తానికి అయితే యాప్ ప్రచారం చేసిన ఈమెను నమ్మి మోసపోయిన చాలామంది కేసు పెట్టగా ప్రస్తుతం కోర్టు ఈమెకు సమన్లు జారీ చేసినట్లు సమాచారం.

Related News

Rajendra Prasad: అశ్రునయనాల మధ్య ముగిసిన రాజేంద్రప్రసాద్ కూతురి అంత్యక్రియలు.. !

Samantha: ఫెయిల్యూర్ హీరోయిన్ పై ప్రశంసలు.. అసలు కథ ఏంటంటే..?

Viswam Trailer : గోపీచంద్ ‘విశ్వం’ ట్రైలర్ వచ్చేసింది.. కామెడీ, యాక్షన్ సీన్స్ అదుర్స్..

Mamitha Baiju: యూత్ క్రష్ ‘ప్రేమలు’ బ్యూటీ ఏం చదివిందో తెలుసా?

Teja Sajja : తేజా సజ్జాకు అరుదైన గౌరవం.. ఆ సినిమా వల్లే టాప్..!

Star Producer: ప్రకాష్ రాజ్ వల్ల రూ.1 కోటి నష్టపోయా.. నిర్మాత కామెంట్స్ వైరల్..!

×