Tollywood Heroine : తెలుగు చిత్రపరిశ్రమలో ఎప్పుడు ఎవరికీ అదృష్టం వచ్చి తలుపుతడుతుందో చెప్పలేము.. ఒకసారి భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయితే, ఇంకోసారి చిన్న సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. అలాగే హిరో, హీరోయిన్ల విషయంలో కూడా అంతే.. ఒక్కసారిగా ఫెమస్ అవుతారు. అలా ఇటీవల కాలంలో చాలా మంది యంగ్ బ్యూటీస్ లైట్ లోకి వచ్చి హైలైట్ అయ్యారు. కేవలం ఒక్క సినిమాతోనే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నారు. ఆ లిస్ట్ లోకి తాజాగా మత్తు వదలరా 2 హీరోయిన్ కూడా వచ్చి చేరింది. ఫెమస్ అవ్వడం మాత్రమే కాదు. ఇండస్ట్రీలో తన క్రష్ ఎవరో కూడా నిర్మొహమాటంగా బయట పెట్టేసింది. తనకు మెగా ఫ్యామిలీలోని స్టార్ హీరో అంటే పిచ్చి అని చెప్పకనే చెప్పేసింది. ఆమె గుండెను గలాస్ చేసిన హీరో ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
టాలీవుడ్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మత్తు వదలరా 2 సినిమా ఎప్పుడు అయితే ఓటిటి లో విడుదలకి వచ్చిందో ఆ సినిమాలో నటించిన ఓ యంగ్ బ్యూటీ రియాగా కనిపించింది.. ఆమె ఈ సినిమాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో అని తెగ గూగుల్ లో వెతికేస్తున్నారు ఫ్యాన్స్.. అసలు ఈ రియా అసలు పేరు ఇషా యాదవ్ కాగా ఈ యంగ్ బ్యూటీ నార్త్ ఇండియా నుంచి మొదటిసారిగా తెలుగు సినిమాలో కనిపించింది. అయితే ఒక్క సారిగా హైలైట్ అయ్యిన ఈ యంగ్ హీరోయిన్ మెగా హీరోలలో ఓ హీరో అంటే బాగా క్రష్ అట.. అది కూడా తన స్కూల్ ఏజ్ తొమ్మిదో క్లాస్ నుంచే తనకు బాగా ఇష్టమని ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.. ఇంతకీ ఆ హీరో ఎవరో అనుకుంటున్నారు కదూ.. ఆ హీరో ఎవరో కాదు రామ్ చరణ్..
సౌత్ లో రామ్ చరణ్ అంటే ఎంతో ఇష్టం అని అది కూడా తన 9త్ క్లాస్ నుంచే చరణ్ అంటే ఎంతో క్రష్ అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు నార్త్ బ్యూటీ. తన చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ అంటే పిచ్చి అంటుంది. మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అక్కడ కూడా ఎలా ఉందో తెలుస్తుంది. మొత్తానికి అయితే ఒక్క సినిమాలో సెన్సేషన్ అయ్యిన రియా తన ఫెవరెట్ హీరో అండ్ క్రష్ ఎవరో రివీల్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది.. ఇక తన డ్రీమ్ రామ్ చరణ్ ను ఎప్పుడు కలుస్తుందో? ఆయన సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేస్తుందేమో చూడాలి.. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భారీ సినిమా గేమ్ ఛేంజర్ రిలీజ్ తో సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఇంకోపక్క దర్శకుడు బుచ్చిబాబు తో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక రియా ఒక్క త్వరలోనే కొత్త సినిమా డీటెయిల్స్ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.