Amaran Movie : దీపావళి సందర్బంగా ఈరోజు ఏకంగా తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. నువ్వా నేనా అనే టాక్ తో ఒక్కొక్క దూసుకుపోతున్నాయి. ఒకటికి మించి మరొకటి పాజిటివ్ టాక్ తో రచ్చ చేస్తున్నాయి. అందులో ఆమరన్ మూవీకే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని పబ్లిక్ టాక్ ను చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా ఒక మిలిటరీ సోల్జర్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకేక్కింది.. ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటించగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇక కలెక్షన్స్ కూడా బాగానే అందుకుంటుంది. ఇక తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
శివ కార్తికేయన్, సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ అమరన్.. దీపావళి కానుకగా ఈ మూవీ ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. ఈరోజు ఉదయం నుంచి మొదలైన షోలతో పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా ఒకవైపు మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో ముందుగా మరో హీరోను అనుకున్నారట కానీ శివ కార్తికేయన్ ను ఫైనల్ చేశారట.. అమరన్ చిత్రాన్ని ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాలనీ ఆ చిత్ర దర్శకుడు అనుకున్నాడట. పుష్ప కి ముందే ఈ సినిమా కథని ఆయనకీ చెప్పాలని అనుకున్నాడు. కానీ అల్లు అర్జున్ అపాయిట్మెంట్ దొరకడం అప్పట్లో కష్టమైందట, అతన్ని ఎలా కలవాలి అనే విషయం కూడా తెలియదట. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం విడుదల అవ్వడం, ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ అవ్వడం, పుష్ప 2 తో బిజీ అవ్వడంతో ఆ సినిమాకు నో చెప్పాడని టాక్.. దాంతో సెకండ్ అప్షన్ గా శివ కార్తికేయన్ ఎంపిక చేశారు. ఇప్పుడు సినిమా సక్సెస్ ను అందుకుంది.
ఈ మూవీ బిజినెస్ విషయానికొస్తే.. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి అటు తమిళంలో, ఇటు తెలుగు లో కళ్ళు చెదిరిపోయే రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ ఏడాది విడుదలైన ‘దేవర’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’, ‘వెట్టియాన్’ వంటి భారీ చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ తో సమానంగా గంటకి 30 వేలకు పైగా టికెట్స్ సేల్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఒక్క తమిళనాడులో 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. దీపావళి కి మంచి కలెక్షన్స్ ను అందుకుంది. ఇక ఈ వీకెండ్ కలెక్షన్స్ ఇంకాస్త పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక పుష్ప2 సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.