EPAPER

N convention hall rent :ఎన్ కన్వెన్షన్ అద్దెల వసూళ్లు మామూలుగా లేవుగా?

N convention hall rent :ఎన్ కన్వెన్షన్ అద్దెల వసూళ్లు మామూలుగా లేవుగా?

Tollywood Hero Nagarjuna N convention hall rents per day: శనివారం ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వార్తలతో నగరం అంతా హాట్ టాపిక్ గా మరింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నాగార్జునకు ఫోన్లు చేసి పలకరించారు. అధికారులు అన్ని అనుమతులూ ఉన్నా అక్రమంగా కూల్చేశారని.. కోర్టుకెక్కిన నాగార్జున మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వార్తలు గత 24 గంటలుగా నెట్టింట వీడియోల రూపంలో హల్ చల్ చేస్తున్నాయి. పలు టీవీ ఛానల్స్ లో వీటిపై కథనాలు వండి వార్చారు. అయితే నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన మాదాపూర్ లో కట్టిన ఎన్ కన్వెన్షన్ ను వివాహ వేడుకలు, బర్త్ డే పార్టీలు, గెట్ టూ గెదర్ ఫంక్షన్లకు దీనిని బుక్ చేసుకుంటారు. అయితే చాలా మంది ఎన్ కన్వెన్షన్ లో అద్దెలు ఎలా ఉంటాయని ఆసక్తి కనబరుస్తున్నారు.


ఖరీదైన ప్రాంతం

పెళ్లిళ్ల సీజన్ లో మామూలు ఫంక్షన్ హాళ్లు రోజుకు రెండు నుంచి మూడు లక్షలు వసూళ్లు చేస్తున్నారు. అలాంటిది అత్యంత ఖరీదైన ప్రాంతంలో నెలకొల్పిన ఎన్ కన్వెన్షన్ లో అద్దెలు మరెంత ఉంటాయో అని ఆసక్తి గా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. సిటీలో ఉన్న చాలా మంది బడా పారిశ్రామిక వేత్తలు, సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఎన్ కన్వెన్షన్ లో వేడుకలు చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. చక్కగా ఎన్ కన్వెన్షన్ కు ఆనుకుని సుందరమైన సరస్సు చూపరులను కట్టిపడేస్తుంటుంది. హైటెక్ సిటీ, శిల్పారామం పరిసర ప్రాంతాలు కావడంతో అడ్రెస్ కనుక్కోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందని భావిస్తుంటారు. సిటీలో ఏ ఫంక్షన్ హాల్ కూ లేని ప్రకృతి శోభ ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. తమ్మిడికుంట చెరువుకు ఆనుకుని కట్టిన ప్రాంగణంకు వచ్చిన అతిథులకు ఆహ్లాదం కలుగజేస్తుంది.


ఒకే సారి మూడు వేల మందికి పైగా..

దాదాపు మూడు వేల మందికి పైగా కూర్చుని వేడుక చూసే సదుపాయం ఉంది. 27 వేల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో అత్యంత విశాలమైన ప్రాంగణం ఉంటుంది. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లు కూడా జరుగుతుంటాయి. ఇక చుట్టుపక్కల ఐటీ కంనెనీలకు సంబంధించి ఫారిన్ డెలిగేట్ల సమావేశాలు, వార్షిక సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుకుంటారు. భారీ ఫంక్లన్ హాల్సే కాదు.. బర్త్ డే వేడుకలు జరుపుకునేందుకు మినీ ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ లో వేడుక జరుపుకోవడం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు నగరంలోని శ్రీమంతులు. ఎన్ కన్వెన్షన్ ఆరంభించి 14 సంవత్సరాలు పూర్తవుతోంది. అయితే ఇందులో కనీసం అద్దె రూ.5 లక్షలతో మొదలవుతుందని సమాచారం.

ఎన్ కన్వెన్షన్ ప్రత్యేకతే వేరు

గంటకి ఇంత చొప్పున వసూలు చేస్తారని టాక్. నగర పరిధిలో అనేక ఫంక్షన్ హాల్స్ ఉన్నప్పటికీ ఎన్ కన్వెన్షన్ ప్రత్యేకతే వేరు. పైగా నాగార్జునకు ఉన్న సినీ పరిచయాలతో అక్కడ ప్రముఖ నిర్మాతలు, సినీ కుటుంబాలు తరచుగా ఇక్కడే వేడుకలు జరుపుకుంటారు. కాస్త రేటు ఎక్కువే అయినా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రత్యేకంగా వేడుకలు జరుపుకుంటారు. ఒక సారి ఇందులో ఫంక్షన్ చేసుకున్నవారు మళ్లీ మళ్లీ ఇందులోనే చేసుకోవాలని అనుకోవడం విశేషం. నాగ్ ముందుగానే పర్మిషన్లు.. అవీ సక్రమంగా తీసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదని కొందరు నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×