EPAPER

Eagle Movie Review & Rating: ఈగల్ రివ్యూ.. మాస్ మహారాజా డిజాస్టర్ రికార్డుల నుంచి తేరుకున్నాడా..?

Eagle Movie Review & Rating: ఈగల్ రివ్యూ.. మాస్ మహారాజా డిజాస్టర్ రికార్డుల నుంచి తేరుకున్నాడా..?
Eagle Movie Review

Eagle Movie Review and Rating:


మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఏ సినిమాలోనైనా.. తనదైన మార్క్ కామెడీ, యాక్షన్ సీన్లతో ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతాడు. కానీ.. ధమాకా తర్వాత రవితేజ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. గతేడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదలైనా.. అన్నీ డిజాస్టర్లుగానే నిలిచాయి. వాల్తేరు వీరయ్యలో నటించినా.. అది చిరంజీవి తమ్ముడి పాత్రలో కొద్దిసేపు మాత్రమే ఉంటాడు. రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీ ఫట్ అయ్యాయి. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావుపై అంచనాలున్నా.. ప్రేక్షకులను మెప్పించడంలో ఆ సినిమా విఫలమైంది. వరుస ఫెయిల్యూర్ మూవీస్ తర్వాత వచ్చిన ఈగల్ సినిమా అయినా.. రవితేజకు హిట్ ఇచ్చిందో లేదో చూద్దాం.

సినిమా – ఈగల్
నటీనటులు – రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, వినయ్ రాయ్, నవీప్, శ్రీనివాస్ అవసరాల, మధు, అజయ్ ఘోష్, ప్రణీత పట్నాయక్ తదితరులు.
డైరెక్టర్ – కార్తీక్ ఘట్టమనేని
ప్రొడ్యూసర్ – టీజీ విశ్వ ప్రసాద్
ప్రొడక్షన్ బ్యానర్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
మ్యూజిక్ డైరెక్టర్ – దవ్ జంద్


మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన మూవీ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాలతో సహా పలువురు నటీ నటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.

పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌తో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్‌తో ఆ హైప్‌ను మరింతగా పెంచుకుంది. ఇక సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా థియేటర్లు లేకపోవడంతో సోలో రిలీజ్‌గా నేడు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా అనేది ఫుల్ రివ్యూలో చూసేద్దాం.

కథ:

ఓ ఇంగ్లీష్ పేపర్‌లో జర్నలిస్ట్‌గా పనిచేసే నళిని (అనుపమ పరమేశ్వరన్) అనుకోకుండా అరుదైన పత్తితో నేసిన ఒక స్పెషల్ కాటన్ క్లాత్‌ను చూస్తుంది. దాని గురించి పూర్తిగా తెలుసుకుంటుంది. అయితే ఆ క్లాత్‌కి విపరీతమైన పబ్లిసిటీ చేసి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి కనబడట్లేదు అని తెలుసుకుంటుంది. దీంతో అదే విషయంపై ఆమె పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ రాయడంతో సీబీఐ రంగంలోకి దిగి నళిని పనిచేసే సంస్థపై దాడి చేస్తాయి.

దీంతో నళిని జోబ్ పోతుంది. అక్కడ ఆమెకు ఒక డౌట్ మొదలవుతుంది. అంత చిన్న న్యూస్‌కి ఇంతలా అందరూ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని అనుకుని.. అసలు మిస్సయిన సహదేవ్ వర్మ ఎవరు? అని తెలుసుకునేందుకు నళిని ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి తాలూకాలో ఉన్న తలకోన ప్రాంతానికి వెళ్తుంది.

ఆ గ్రామంలో ఒక్కొక్కరినీ అడుగుతూ ఆ పత్తి గురించి.. ఆ పత్తిని విదేశాల్లో ఫేమస్ చేసిన సహదేవ్ (రవితేజ) గురించి తెలుసుకుంటుంది. ఈ క్రమంలో అతను ఈగల్ అని.. ప్రపంచ దేశాలు అతని కోసం వెతుకుతున్నారని తెలుసుకుంటుంది. అయితే ఎక్కడో యూరప్‌లో సఫారీ తీసుకుని కాంట్రాక్టు కిల్టింగ్ చేసే స్నైపర్ సహదేవ్ వర్మ తలకోన అడవుల్లో ఏం చేస్తున్నాడు.

కాంట్రాక్ట్ కిల్లింగ్స్ ఆపేసి.. పత్తిని పండిస్తూ చేనేత కార్మికులను ముందుకు తీసుకువెళ్లాలని ఎందుకు అనుకున్నాడు?. అతని గురించి పేపర్లో రాస్తే సీబీఐ ఎందుకు కంగారు పడాల్సి వచ్చింది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే.

విశ్లేషణ:

సినిమా మొదటి నుంచి సహదేవ్ (రవితేజ) క్యారెక్టర్ మీద నెమ్మదిగా అంచనాలు పెంచుతూ తీసుకువెళ్లారు. ఫస్ట్ హాఫ్ నుంచి హీరో మీద ఎలివేషన్లు పెంచుతూ చివరి వరకు సినిమా నడిపించారు. కాంట్రాక్ట్ కిల్లింగ్ చూసుకుంటూ డబ్బు సంపాదించే హీరో లైఫ్‌లోకి ఒక హీరోయిన్ వచ్చి ఆమె కోసం మంచిగా మారదామనుకున్న సమయంలో ఆమె చనిపోతే.. ఆమెకోసం అప్పటి వరకు తాను చేసిన పని వదిలేసి అక్రమ ఆయుధాలు అరికట్టడమే పనిగా పెట్టుకుంటాడు.

దానికోసం ఇండియా వ్యాప్తంగా జరిగే అన్ని అక్రమ ఆయుధాల డీలింగ్స్‌లో ఇన్వాల్వ్ అవుతాడు. అక్రమ ఆయుధాలు దుర్మార్గుల చేతికి వెళితే ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతాయి అనే కాన్సెప్ట్‌తో సినిమాని నడిపించారు. ఒకవిధంగా చెప్పాలంటే.. ఈ కథకి ఒక మంచి మెసేజ్‌ని జోడించి యాక్షన్ సినిమాలా చెప్పారు.

ఇక ఈ మూవీలో రవితేజ మార్క్ కామెడీ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయవద్దు. మునుపటి సినిమాల కంటే ఈ సినిమాలో రవితేజ కాస్త భిన్నంగా కనిపించాడు. ఇక స్క్రీన్ ప్లేని గతం, వర్తమానంలోకి మారుస్తూ కథని చెప్పడంతో కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. మొదటి హాఫ్ మొత్తం నళిని.. సహదేవ్ ఎవరు అని తెలుసుకోవడం ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో అతని గతం కథని చూపిస్తారు.

క్లైమాక్స్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటాయి. తుపాకులు, ఆయుధాలతో కొత్త కొత్త ప్రయోగాలు చేసారు. ఈ మూవీలో వీటితో చూపించే సీన్స్ బాగున్నాయి. అయితే కొన్ని లాజిక్స్ దూరం అనిపించినా.. ఓవరాల్‌గా సినిమా మొత్తం మీద ఎంగేజ్ చేసే విధంగా ఉంది. అంతేకాకుండా మూవీ చివర్లో ఈ సినిమాకు పోర్ట్ 2 అనౌన్స్ చేయడం గమనార్హం.

నటీనటుల విషయానికొస్తే..

మాస్ మహారాజ్ రవితేజ ఎప్పటిలానే అదరగొట్టేశాడు. తన రొటీన్ పాత్రల కంటే భిన్నంగా సహదేవ్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. గడ్డంతో కొత్త లుక్‌లో యాక్షన్ సీన్స్‌లో మరింత మెప్పించాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ తరహా పాత్రలో పర్వాలేదనిపించుకుంది. రవితేజ సరసన కావ్య థాపర్ లవ్ సన్నివేశాల్లో చాలా అందంగా, క్యూట్‌గా కనిపించి అలరించింది.

అలాగే నవదీప్‌కి చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ పాత్రలో కనిపించాడు. వినయ్ రాయ్ పాత్ర చిన్నదైనా తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు. రా ఆఫీసర్స్‌గా అవసరాల శ్రీనివాస్, మధుబాల మెప్పిస్తారు. ఊరి ఎమ్మెల్యేగా అజయ్ ఘోష్ అక్కడక్కడా తన కామెడీతో అలరిస్తాడు.

కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ నుంచి దర్శకుడిగా మారడంతో విజువల్స్ మాత్రం చాలా అద్భుతంగా, స్టైలిష్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదరిపోతుంది. సాంగ్స్ యావరేజ్ అనిపిస్తాయి. కొన్ని సీన్స్‌లో ఆర్ట్ డైరెక్టర్ చేసిన ఆర్ట్ వర్క్‌ని మెచ్చుకోవల్సిందే. సినిమా కోసం నిర్మాత టీజీ విశ్వప్రశాద్ పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపిస్తుంది. మణిబాబు రాసిన డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

ఓవరాల్‌గా చెప్పాలంటే ఈగల్ మూవీ ఒక స్టైలిష్ అండ్ ఎంగేజింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనే చెప్పాలి.

Related News

Allu Arjun: వినాయకుడికి పూజ చేసిన అల్లు అర్హ..ఎంత క్యూట్ గా ఉందో..

Aay Movie: ఆయ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్నామండీ

Game Changer: గేమ్ ఛేంజర్ అప్డేట్.. ఎర్ర కండువాతో చరణ్ అదిరిపోయాడు

Faria Abdullah: మన చిట్టిలో ఇంత టాలెంట్ ఉందా.. అదిరిపోయింది బంగారం

Viran Muttemshetty: అల్లు అర్జున్ కజిన్ హీరోగా గిల్ట్.. ఫస్ట్ లుక్ చూశారా..?

Sri Sri Sri Rajavaru: ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ విచ్చేస్తున్నారు.. నేషనల్ అవార్డ్ దర్శకుడితో నార్నే నితిన్ సినిమా

Devara Trailer: పండగ సందర్భంగా ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Big Stories

×