EPAPER

Tollywood Directors: దర్శకులు..సెకండ్ హాఫ్ లో టాలెంట్ చూపించండయ్యా..?

Tollywood Directors: దర్శకులు..సెకండ్ హాఫ్ లో టాలెంట్ చూపించండయ్యా..?

Tollywood Directors: ఏ సినిమాకు అయినా ఫస్ట్ హాఫ్ కన్నా.. సెకండ్ హాఫ్ నే కీలకం. మొదట సగం ఎంత బోరింగ్ గా ఉన్నా కూడా ఇంట్రడక్షన్, కథ లైన్ చూపిస్తారు కాబట్టి.. కొద్దిగా ల్యాగ్ ఉన్నా.. బోరింగ్ గా ఉన్నా  ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అసలు విషయమంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. ఆ సెకండ్ హాఫ్ ను ఎంత గ్రిప్పింగ్ గా మలచగలిగితే.. సినిమా అంత హైప్ వస్తుంది. ప్రీ క్లైమాక్స్, ట్విస్ట్ లు..  క్లైమాక్స్ కోసం ప్రతి ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అసలు అక్కడే బోరింగ్ అనిపిస్తే.. ఇక సినిమా చూసి ఏం ప్రయోజనం అని అనుకోకుండా  ఉండరు.


ప్రస్తుతం టాలీవుడ్ లో ఇలా సెకండ్ హాఫ్ లు బోల్తా కొట్టే షెడ్డుకు పోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కల్కి మూవీ తీసుకుంటే.. ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా ల్యాగ్ ఉంటుంది.. బోరింగ్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ప్రభాస్- అమితాబ్ మధ్య యుద్ధం ఉంటుందా.. ? అనే క్యూరియాసిటీ ఉంటుంది. ఇక ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంగ్ పడిందో.. సినిమా రూపురేఖలు మొత్తం మారిపోయాయి. అలా సెకండ్ హాఫ్ తో ప్రేక్షకులను సీట్ లో కూర్చోపెట్టిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.

దసరా కానుకగా ఈసారి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మా నాన్న సూపర్ హీరో, విశ్వం, వెట్టయాన్, మార్టిన్, జిగ్రా. ఈ సినిమాల గురించి చెప్పాలంటే.. కథ, కథనాలు బాగానే ఉన్నా.. కొన్నింటికి సెకండ్ హాఫ్ నే మైనస్ గా నిలిచాయి.  డబ్బింగ్ సినిమాలు పక్కన పెడితే..   తెలుగు డైరెక్టర్స్.. సెకండ్ హాఫ్ ను మలచడంలో కొద్దిగా టాలెంట్ చూపించి ఉంటే బావుండేది అనే టాక్ వినిపిస్తుంది. మా నాన్న సూపర్ హీరో.. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది.


ఇద్దరు తండ్రులు.. ఒకరు కన్నవారు.. ఇంకొకరు పెంచిన వారు. ఒక కొడుకు వారిద్దరి కోసం ఏం చేశాడు అనేది సినిమా. ఎంతో ఎమోషనల్ రైడ్ గా ఈ చిత్రం సాగిపోయింది. కానీ, సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ అభిలాష్ కంకర కొద్దిగా తడబడ్డాడు అనే మాట వినిపిస్తుంది. డీసెంట్ ఫస్టాఫ్ తర్వాత  సెకండ్ హాఫ్ మీద ఎన్నో అంచనాలను పెట్టుకొని చూసిన ప్రేక్షకులకు నిరాశనే దక్కుతుంది. మొదటి సగంలానే మలిసగం కూడా మలిచి ఉంటే.. ఒక మంచి తండ్రీకొడుకుల కథగా ఈ సినిమా ఇండస్ట్రీలో మిగిలిపోయేది అని చెప్పొచ్చు.

ఇక ఇది కాకుండా విశ్వం సినిమా కూడా సెకండ్ హాఫ్ తన్నేసిందని మాట వినిపిస్తుంది. శ్రీను వైట్ల లాంటి సీనియర్ డైరెక్టర్ నుంచి చాలా గ్యాప్ తరువాత ఒక సినిమా వస్తుంది అంటే  అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీ సీన్స్, ట్విస్ట్ లు అన్ని బావున్నా .. సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులను సీట్స్ లో కూర్చోబెట్టేంతలా కథనాన్ని మలచలేకపోయినట్లు తెలుస్తోంది. వీటితో పాటు రిలీజ్ అయిన వెట్టయాన్ కూడా మొదటి సగం బావుంది.. రెండో సగం అంతగా నచ్చలేదని చెప్పుకొస్తున్నారు. ఇక   మార్టిన్, జిగ్రా సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనే టాక్ నడుస్తోంది.

ఇదే కాదు ఈ ఏడాదిలో రిలీజ్ అయినా చాలా సినిమాలు సెకండ్ హాఫ్ డైలీ అవ్వడం వలనే.. పరాజయాన్ని చవిచూశాయని చెప్పాలి.  దీంతో ప్రేక్షకులు.. డైరెక్టర్స్ కు ఒకటే మాట చెప్పుకొస్తున్నారు. ఏ డైరెక్టర్ అయినా కూడా తమ  టాలెంట్ సెకండ్ హాఫ్ లో చూపించమని చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు రిలీజ్ అయ్యే సినిమాలు ఎలాంటి విజయాలను అందుకుంటాయో చూడాలి.

Related News

Unstoppable With NBK: షో ప్రోమోకు గెస్ట్ గా ఐశ్వర్య రాయ్.. ఏం మాట్లాడుతున్నారా.. నరాలు కట్ అయిపోతున్నాయి

Chiranjeevi- Venkatesh: ఎక్స్ కాప్ తో విశ్వంభర.. పిక్ ఆఫ్ ది డే అంటే ఇదేరా

Exclusive: బోయపాటి- బాలకృష్ణ విధ్వంసం..అఖండ 2 మొదలయ్యేది ఎప్పుడంటే.. ?

Dasara 2 : దేవిశ్రీని పక్కన పెట్టిన నాని… ముచ్చటగా మూడోసారి ఆ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ కోసం ప్రయత్నాలు

Pooja Hegde : బుట్టబొమ్మ మామూలుది కాదు… ఈ చిన్న స్ట్రాటజీ తో నిర్మాతలను బుట్టలో వేసుకుందా?

Sayaji Shinde: బ్రేకింగ్.. మొన్న పవన్.. నేడు పవార్.. షాకిచ్చిన షాయాజీ షిండే

Big Stories

×