EPAPER

Gaami Movie Review: విశ్వక్ సేన్ ‘గామి’ ఫుల్ రివ్యూ.. హిట్టా ఫట్టా

Gaami Movie Review: విశ్వక్ సేన్ ‘గామి’ ఫుల్ రివ్యూ.. హిట్టా ఫట్టా

Vishwak sen Gaami Movie Review


Gaami Movie Review:

సినిమా రివ్యూ: గామి
నటీనటులు: విశ్వక్‌సేన్, అభినయ, చాందిని చౌదరి, హారిక, మహ్మద్ సమద్ తదితరులు
దర్శకత్వం: విద్యాధర్ కాగిత
విడుదల తేదీ: మార్చి 8, 2024


టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు విశ్వక్ సేన్ డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్లు అందుకుంటున్నాడు. పలు సినిమాలలో విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ హీరో నటించిన తాజా చిత్రం ‘గామి’.

దాదాపు ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా.. ట్రైలర్‌తో ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. అలాంటి అంచనాల నడుమ ఈ రోజు థియేటర్లలోకి ఈ మూవీ వచ్చింది. మరి అందరి అంచనాలను ఈ మూవీ అందుకుందా? లేదా ? అనేది ఇప్పుడు ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

శంకర్ (విశ్వక్ సేన్) ఇందులో అఘోరా పాత్రలో నటించాడు. ఒక మనిషి స్పర్శ తగిలితే అతడి శరీరం రకరకాల మార్పులకు గురవుతుంది. అయితే ఈ సమస్య అతడికి ఎలా వచ్చింది అనేది అతడికి తెలియదు.

READ MORE: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ టీవీ నటి మృతి

అంతేకాకుండా అతడి గతం ఏంటనేది కూడా మర్చిపోతాడు. అందువల్ల తన సమస్యకు పరిష్కారం దొరకాలంటే దాదాపు 36 ఏళ్లకి ఒకసారి హిమాలయాల్లోని ద్రోణగిరి పూసే మాలిపత్రాలు అనే ప్రత్యేకం పువ్వులు సేవించాలని తెలుసుకుంటాడు.

అయితే అదే సమయంలో భారత్, చైనా బోర్డర్‌లో మనుషులపై ప్రయోగాలు జరుగుతుంటాయి. అయితే అందులో సిటీ 333 (మహ్మద్ సమద్) అనే టెస్ట్ సబ్జెక్ట్ ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే దక్షిణ భారతదేశంలోని ఒక ఊరిలో దుర్గ (అభినయ) అనే దేవదాసి, ఆమె కూతురు ఉమ (హారిక)లది మరో స్టోరీ.

ఈ మూడు కథలూ చివరికి ఏం అయ్యాయి? శంకర్ తన సమస్యని అధిగమించాడా? సీటీ 333 అక్కడ్నుంచి తప్పించుకున్నాడా? ట్విస్ట్. ఈ విషయాలు తెలియాంటే సినిమా చూడాలి.

READ MORE: సైలెంట్‌గా ఓటీటీలోకి ‘ఊరుపేరు భైరవకోన’.. ఇది ఎవరూ ఊహించి ఉండరు..

విశ్లేషణ: ‘గామి’ సినిమా చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇందులో విశ్వక్‌సేన్ సమస్య గురించి తెలపడానికే దాదాపు 15 – 20 నిమిషాల టైం పడుతుంది. అయితే వారు హిమాలయాలకు ఎప్పుడైతే బయల్దేరతారో అక్కడ నుంచి సినిమా స్పీడ్ పుంజుకుంటుంది.

అక్కడ నుంచి స్టోరీ చాలా ఇంట్రస్టింగ్‌గా సాగుతుంది. సీటీ 333పై జరిగే ప్రయోగాలు, అతను అక్కడి నుంచి పారిపోవడానికి చేసే ప్రయత్నాలు అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటాయి. అభినయ, తన కూతురు ఉమ కథ ఈ సినిమాకు మంచి పాయింట్. ఇక విజువల్‌ పరంగా ఈ మూవీ ఓ రేంజ్‌లో ఉందని చెప్పాలి.

అంతేకాకుండా హిమాలయాల నేపథ్యంలో కనిపించే కొన్ని సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో వచ్చే సింహం సీక్వెన్స్‌లు, సినిమా చివరి 30 నిమిషాలు హైలెట్‌గా నిలిచాయి.

READ MORE: గామి ట్విట్టర్ రివ్యూ.. తప్పకుండా చూడాల్సిన చిత్రం

ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ సినిమాటోగ్రాఫర్. విశ్వనాథ్ తన కెమెరాతో సినిమాకు ప్రాణం పోశాడు. అలాగే నరేష్ కుమారన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్.

శంకర్ పాత్రలో విశ్వక్ సేన్ జీవించేశాడనే చెప్పాలి. ఎమోషనల్ సీన్లలో విశ్వక్ తన పెర్ఫార్మెన్స్‌తో దుమ్ముదులిపేశాడు. అలాగే సిటీ 333 పాత్రలో మహ్మద్ సమ్మద్, ఉమ పాత్రలో హారిక కూడా తమ యాక్టింగ్‌తో సినీ ప్రియులను కట్టిపడేశారు.

ఇక ఈ మూవీలో ఫస్ట్ నుంచి చివరివరకు ఉండే మరో రోల్ చాందిని చౌదరి. ఈ మూవీతో నటి చాందిని తన నట విశ్వరూపాన్ని చూపించారు. అలాగే దుర్గ పాత్రలో అభినయ కూడా ఆకట్టుకున్నారు. మొత్తంగా చెప్పాలంటే విజువల్స్, థ్రిల్లింగ్ సీన్ల, అడ్వంచరస్‌ను ఇష్టపడేవారు గామి మూవీని తప్పక చూడాల్సిందే

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×