EPAPER

Tollywood Actor: ఆ యాక్సిడెంట్ గాయాలు ఇప్పటికీ మానలేదు.. యాక్టర్ ఎమోషనల్ జర్నీ..!

Tollywood Actor: ఆ యాక్సిడెంట్ గాయాలు ఇప్పటికీ మానలేదు.. యాక్టర్ ఎమోషనల్ జర్నీ..!

Tollywood Actor.. ఆధునిక ప్రపంచంలో అందరితో పాటు మనము పరిగెత్తాలి అంటే అందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా భవిష్యత్తులో ఎదగడానికి పడే ఇబ్బందులు.. కలిగే ఆటుపోట్లు, అన్నీ ఎదుర్కొన్నప్పుడే మనిషి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. ముఖ్యంగా అనుకున్నది సాధించాలి అంటే ఎంతోమంది అవమానాలు, ఆరోపణలు , కష్టాలు, ఇబ్బందులు , కన్నీళ్లు. ఇక చెప్పుకుంటూ పోతే మరెన్నో.. దారి మధ్యలో ఎన్నో తారసపడతాయి. అన్నింటిని దిగమింగుకొని ముందడుగు వేస్తేనే అనుకున్నది సాధిస్తాము అని అంటున్నారు ఒక నటుడు. హీరోగా స్టార్ స్టేటస్ ను పొందాలనుకున్నాడు అయితే అనూహ్యంగా ఆయన కెరియర్ మలుపు తిరిగింది. ఊహించని పెద్ద యాక్సిడెంట్ .13 రోజులపాటు కోమాలో ఉండి తిరిగి 18వ రోజు షూటింగ్ సెట్లో అడుగు పెట్టారు. ఇక ఆయన ఎమోషనల్ జర్నీ చూస్తే మాత్రం కన్నీళ్లాగవ్. మరి ఆయన ఎవరు అసలేం జరిగింది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.


నరుడి బ్రతుకు నటనతో హీరోగా మారిన శివ..

ఆయన ఎవరో కాదు శివకుమార్ రామచంద్రవరపు (Shiva Kumar Ramachandravarapu)షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా అనేక పాత్రలు పోషించి వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు హీరోగా “నరుడి బ్రతుకు నటన “( Narudi Brathuku Natana )అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ యంగ్ హీరో. సినిమా టైటిల్ లో ఉన్నట్టే తన నిజ జీవితంలో కూడా జరిగింది అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే ఈయన నటించిన నరుడి బ్రతుకు నటన సినిమా అక్టోబర్ 25వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శివ మీడియాతో మాట్లాడుతూ తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పాడు.


కోమాలో 13 రోజులు.. డిస్చార్జ్ అయిన మరుసటి రోజే షూటింగ్..

శివ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల క్రితం మాదాపూర్ వద్ద నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. రాత్రిపూట స్కూటీ మీద వెళ్తుంటే ఒక కారు వచ్చి గుద్దింది. కింద పడిపోవడంతో కుడిపక్క తలకు భారీగా దెబ్బ తగిలి ,హాస్పిటల్ లో 13 రోజుల పాటు కోమలో ఉన్నాను. దానికి కొన్ని రోజుల ముందు ఈ సినిమా షూటింగ్ కూడా ఫిక్స్ అయ్యింది. కేరళలో షూటింగ్ కోసం టికెట్లు కూడా బుక్ చేసుకున్నాము. అన్ని అరేంజ్మెంట్ అయిన తర్వాత నాకు ఆక్సిడెంట్ అవ్వడంతో మా చిత్ర బృందం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయారు. డాక్టర్ కనీసం 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పాడు. నీళ్లల్లో అసలు తడవకూడదని, తలను ఎక్కువగా ఊపకూడదు అని కూడా చెప్పారు. కానీ హాస్పిటల్ నుంచి 17వ రోజు డిశ్చార్జ్ అయి 18వ రోజు షూటింగ్ కి వెళ్ళిపోయాను.

షూట్ అయ్యే వరకు బ్రతికితే చాలు..

డాక్టర్ చెప్పినవి ఏవి నేను పట్టించుకోకుండా మెడిసిన్ వాడుతూ.. నీటిలో మునుగుతూ.. తలతో ఫైట్స్ కూడా చేశాను.. ప్రతిరోజు షూట్ అయ్యే వరకు బ్రతికితే చాలు అనుకొని జీవితాన్ని గడిపాను. షూట్ అయింది. నేను కూడా పూర్తిగా కోలుకున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు శివ. ఏది ఏమైనా శివ యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్లి వచ్చిన తర్వాత కూడా రెస్ట్ లేకుండా సినిమా కోసం పనిచేశారు అంటే ఆయన కష్టపడే తత్వానికి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నరుడు బ్రతుకు నటన జీవితం విలువ చెప్పే ఒక మంచి సినిమా అని కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే నేషనల్ , ఇంటర్నేషనల్ అవార్డులు కూడా అందుకున్న ఈ సినిమా థియేటర్లలో ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

Related News

War 2: వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫొటోస్ లీక్.. ఏమున్నాడ్రా బాబు

Unstoppable 4 : బాలయ్య టాక్ షోకి ‘గేమ్ ఛేంజర్’… ఇది మామూలు ప్లాన్ కాదు భయ్యో

Laggam Movie Review : ‘లగ్గం’ మూవీ రివ్యూ

Chiranjeevi : 28న చిరుకు అక్కినేని పురస్కారం… ఎవరి చేతుల మీదు గానో తెలుసా..?

RajaSaab: ఇద్దరు కాదు.. ముగ్గురు అంట.. తాతమనవడు.. ఇంకా.. ?

Kannappa : శివయ్యా… నీపైనే భారమంతా… కేదారనాథ్ యాత్రలో కన్నప్ప టీం..

Suriya: టాలీవుడ్ సీనియర్ హీరోల చుట్టూ తిరుగుతున్న తమిళ్ హీరో.. బాగానే ప్లాన్ చేశాడుగా..?

Big Stories

×