EPAPER

Shiva Balaji: యూట్యూబ్ పై కేసు పెట్టిన శివబాలాజీ

Shiva Balaji: యూట్యూబ్ పై కేసు పెట్టిన శివబాలాజీ

Tollywood actor Shiva Balaji complaint police against Youtuber: బిగ్ బాస్ వన్ విజేతగా నిలిచిన శివబాలాజీ తెలుగులో చాలా చిత్రాలలో నటించి మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. పుట్టింది, పెరిగింది అంతా చెన్నై లోనే ..తెలుగులో మాత్రం తొలి సారి కనిపించింది అశోక్ గాడీ లవ్ స్టోరీ. సురేశ్ కృష్ణ దర్శకత్వంలో 2003లో ఈ మూవీ రిలీజయింది. ఇది యావరేజ్ గా ఆడింది. తర్వాత కొన్ని చిత్రాలు చేసినా శివబాలాజీకి మాత్రం గుర్తింపు నిచ్చిన చిత్రం ఆర్య. అల్లు అర్జున్ ఆ మూవీలో హీరో. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు శివబాలాజీ. తర్వాత విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్ర పోషించిన సంక్రాంతి మూవీలో తమ్ముడి పాత్ర చేసిన శివబాలాజీకి ఆ మూవీ కూడా మంచి పేరే తెచ్చిపెట్టింది.


సైడ్ క్యారెక్టర్ తో గుర్తింపు

అన్నవరం మూవీలో పవన్ కళ్యాణ్ చెల్లెలు భర్తగా నటించాడు శివ బాలాజీ. కాటమ రాయుడు మూవీలో పవన్ కళ్యాణ్ కు తమ్ముడిగా నటించారు. రవితేజ, నరేష్ తో కలిసి సముద్ర ఖని దర్శకత్వంలో శంభో శివ శంభో మూవీలో మంచి క్యారెక్టర్ చేశారు శివ బాలాజీ. నీతోనే డ్యాన్స్ రియాలిటీ షో కు జడ్జిగా చేశారు. బిగ్ బాస్ 1 లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఉంటూనే తన లీడర్ షిప్ క్వాలిటీతో మెప్పించారు. అందుకే తొలి సీజన్ విన్నర్ అయ్యారు. ఈ మధ్య యూట్యూబ్ నిర్వాహకులు సినీ తారల వ్యక్తిగత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారని..ఫలానా హీరోకి ఫలానా హీరోయిన్ కు మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని ఇష్టమొచ్చిన రాతలు రాస్తూ తమని అవమానపరుస్తున్నారని శివ బాలాజీ ఆందోళన చెందుతున్నారు.గతంలోనూ చాలా మంది టాలీవుడ్ తారలు ఇలాంటి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలని అనుకున్నారు.


యూ ట్యూబర్ పై ఫైర్

మరీ హీరోయిన్లను చీఫ్ గా చూపిస్తున్నారని..ఎవరైనా హీరోతో రెండు సార్లు నటిస్తే చాలు వారిద్దరి మధ్య ఎఫైర్ ఏదో నడుస్తోందని చూపిస్తుంటారని..ఒకప్పుడు జర్నలిజం అంటే ఎంతో గౌరవ ప్రదంగా ఉండేదని..వారు ఏదైనా విమర్శించినా నటనా పరంగానో మరో రకంగానో విమర్శించేవారు తప్ప..ఇలా లేని సంబంధాలను అంటగట్టి మానసిక ఆనందాన్ని అనుభవిస్తున్నారని..కొంత మంది వీళ్ల టార్చర్ భరించ లేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే శివ బాలాజీ తరచుగా కొందరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు సినీ తారలను టార్గెట్ చేసి అసభ్యకరంగా వారిని చూపిస్తున్నారని ఓ ట్యూబ్ నిర్వాహకుడిపై ఫైర్ అయ్యారు. అంతేకాదు అతనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

టాలీవుడ్ కు బ్యాడ్ నేమ్

విజయ్ చంద్రహాసన్ అనే ఓ యూ ట్యూబ్ నిర్వాహకుడు తమ వ్యక్తిగత ఇమేజ్ కు భంగం కలిగించేలా కొన్ని ఫేక్ వీడియోలు క్రియేట్ చేశాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఇటీవల మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు పై కూడా దారుణమైన ట్రోలింగులు రూపొందిస్తూ పబ్లిక్ లోకి వదులుతున్నారని ..వీరి ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మధ్య పెరిగిపోయిన ఏ1 టెక్సాలజీని కూడా కొందరు యూ ట్యూబ్ నిర్వాహకులు దారుణంగా వాడుకుంటున్నారని..వీళ్ల వలన తెలుగు చలన చిత్ర పరిశ్రమ కు చెడ్డపేరు వస్తోందని..తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు శివ బాలాజీ.

 

Related News

Rajamouli : ఏంటి జక్కన్న.. తెలుగు హీరోలను వదిలేశావా?

Johnny Master Case : కిరాచక భార్యాభర్తలు… సాటి మహిళ కూడా కనికరించలే..

Political Celebrities: నష్ట జాతకులుగా మారిన సెలబ్రిటీస్.. మొన్న పృథ్వీ.. నేడు జానీ..!

Siddarth -Aditi Rao Hydari: మరీ ఇంత మోసమా… కాస్త ఆలోచించాల్సింది లవ్ బర్డ్స్

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Big Stories

×