EPAPER

Chiranjeevi Life Story: స్టార్ స్టార్ మెగాస్టార్.. చిరంజీవి ప్రస్థానం సాగిందిలా..!

Chiranjeevi Life Story: స్టార్ స్టార్ మెగాస్టార్..  చిరంజీవి ప్రస్థానం సాగిందిలా..!
Chiranjeevi biography telugu

Chiranjeevi biography telugu(Tollywood celebrity news):

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరంజీవి రూటే సెపరేట్. తెలుగు సినిమాలకు బ్రేక్ డ్యాన్సులను పరిచయం చేశారు. మెగాస్టార్ సినిమాలతో టాలీవుడ్ మార్కెట్ మరో లెవల్ కు వెళ్లింది. ఇలా చిరు తనకంటూ ప్రత్యేక స్థానం సంపాందించుకున్నారు. చిరు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో డిప్లొమా చేసి సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.


పునాదిరాళ్ల చిత్రంతో తొలి అవశాశం దక్కించుకున్నారు. కానీ చిరు నటించిన ప్రాణం ఖరీదు ముందు విడుదలైంది. బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు చిత్రం చిరంజీవికి మంచి పేరు తెచ్చింది. తాయారమ్మ బంగారయ్య చిత్రంలో చిన్న రోల్ పోషించారు. అలా సినిమాలో నటించే అవకాశం వస్తే చాలనుకున్నారు. లవ్ యూ, ఇది కథ కాదు మూవీస్ లో విలన్ గా నటించారు. అలా వరుసగా ఒక్కో మొట్టు ఎక్కుతూ వరుసగా హీరో అవకాశాలు అందుకున్నారు. నటుడిగా నిరూపించుకున్నారు. సుప్రీం హీరోగా మారారు. వరుస హిట్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసి మెగాస్టార్ గా ముద్రవేసుకున్నారు. తెలుగు సినిమాకు బిగ్ బాస్ అయ్యారు.

పునాదిరాళ్లు నుంచి ఇటీవల విడుదలై భోళాశంకర్‌ వరకు మెగాస్టార్ ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూశారు. ఖైదీ సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఛాలెంజ్, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, ఖైదీనెంబర్ 786, జగదీకవీరుడు అతిలోక సుందరి ఇలా వరకు హిట్స్ చిరంజీవి ఇమేజ్ ను మరింత పెంచేశాయి. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు చిత్రాలతో చిరంజీవి టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నారు.


ముఠామేస్త్రీ సినిమా తర్వాత వరుస ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. రిక్షావోడు, మెకానిక్ అల్లుడు, ఎస్పీ పరుశరాం, బిగ్ బాస్ ఇలా చాలా సినిమాలు ప్లాప్ అయినా పట్టుదలతో విజయం కోసం ప్రయత్నించారు . ఈ క్రమంలో1996లో చిరు నటించిన ఒక్క సినిమా కూడా విడుదలకాలేదు. హిట్లర్ తో మళ్లీ హిట్ బాట పట్టారు. మాస్టర్, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలు చిరంజీవి మార్కెట్ స్టామినా ఏంటో చూపించాయి.

2008లో సినిమాల నుంచి చిరంజీవి విరామం తీసుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 ఎన్నికల్లో 18 సీట్లు సాధించారు. పాలకొల్లులో ఓడిపోయిన చిరంజీవి.. తిరుపతి నుంచి గెలిచారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ్యుడయ్యారు. కేంద్రమంత్రి పదవిని చేపట్టారు. 2014 తర్వాత రాజకీయాలకు క్రమంగా దూరంగా ఉన్నారు.

మళ్లీ ఖైదీ నెంబర్ 150 మూవీ సినిమాతో మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చారు. సైరా, గాఢ్ పాదర్, ఆచార్య, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ ఇలా 68 ఏళ్ల వయస్సులోనూ నటిస్తూ యువహీరోలకు తగ్గని విధంగా డ్యాన్సులు చేస్తూ అలరిస్తున్నారు. చిరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకే పెద్దదిక్కులా ఉన్నారు. సినీ కెరీర్‌లో 150కిపైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. చిరంజీవి బ్లండ్ బ్యాంకు స్థాపించి సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. 2006లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్శ భూషణ్ అవార్డు అందుకున్నారు.

చిరంజీవి 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్తూరులో జన్మించారు. చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్. సినీమాల్లోకి వచ్చి చిరంజీవిగా మారారు. నేడు మెగాస్టార్ చిరంజీవి 68వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇది మెగా ఫ్యాన్స్‌కు పండుగరోజు. హాపీ బర్త్ డే మెగాస్టార్..

Related News

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Big Stories

×