Sankranthi Movies 2025 : ప్రతి ఏడాది సంక్రాంతికి కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే వచ్చే ఏడాది కూడా సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతాయని అనుకున్నారు. కానీ 2025 సంక్రాంతికి కేవలం మూడు సినిమాలు మాత్రమే రిలీజ్ కాబోతున్నాయని తెలుస్తుంది. మొన్నటివరకు సినిమా లెక్కలు ఎక్కువగానే కనిపించాయి. కానీ ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యినట్లు తెలుస్తుంది. అసలు సంక్రాంతికి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన కొన్ని సినిమాలు ఎందుకు తప్పుకున్నాయో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మూడు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.. ఇక ఆ ఆలస్యం ఎందుకు సంక్రాంతి బరిలో దిగబోతున్న ఆ మూడు సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం పదండీ.
మొన్నటివరకు సంక్రాంతి రేసులో ఏడు సినిమాల వరకు పోటీ పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, నందమూరి బాలకృష్ణ ‘NBK109’, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం, అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ వంటి పలు భారీ చిత్రాలు సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. డేట్ ను అనౌన్స్ చేసి షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాయి. కానీ తాజాగా మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఆ సినిమాలు చూస్తే..
‘NBK109’..
నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబోలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా చివరి దశలో ఉన్నట్లు సమాచారం.. ఇక సంక్రాంతి 2025 సందర్భంగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక తేదీ ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, ఈ సినిమాపై పక్కా ఆ టైమ్ లోనే వస్తుందని ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది..
‘గేమ్ ఛేంజర్’..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా సంక్రాంతికి హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
‘వెంకటేష్ – అనిల్ రావిపూడి ‘..
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ , బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, ప్రెస్టీజియస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను కంప్లీట్ చేయడానికి అంతా సిద్ధమైంది.. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ చెయ్యలేదు. ఎస్వీసీ ప్రొడక్షన్ నెం. 58గా తెరకేతున్న ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉంది. రిలీజ్ ముందు రోజు సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.
ఇది.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాలో బరిలోకి దిగితున్నాయి. ముగ్గురు స్టార్ హీరోలు కావడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు తమ హీరో సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..