EPAPER

Heroines: ప్రాణాంతక వ్యాధులు.. ధైర్యంతో పోరాటం.. చివరికి..!

Heroines: ప్రాణాంతక వ్యాధులు.. ధైర్యంతో పోరాటం.. చివరికి..!

Heroines: ఇండస్ట్రీలోకి వచ్చారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్నారు. దిగ్గజ హీరోల సరసన నటించి మెప్పించారు. ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు. కోట్లాది మంది ఫ్యాన్స్‌ హృదయాలు గెలుచుకున్నారు. ఇండస్ట్రీలో ఒకరేంజ్‌లో దూసుకెళ్ళారు. అంతలోనే వారి కెరీర్‌కు సడన్ బ్రేకులు పడ్డాయి. ఊహించని భయంకరమైన వ్యాధుల బారిన పడ్డారు. అయితేనేం ఏమాత్రం భయపడలేదు. ధైర్యంగా ఎదుర్కొన్నారు. విజేతలుగా నిలిచారు.


సమంత

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా కెరీర్‌పైనే ఫోకస్ పెట్టింది స్టార్ హీరోయిన్ సమంత. వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది. ఈక్రమంలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. దాదాపు 9 నెలల పాటు ఆ వ్యాధితో పోరాడి ఇటీవలే కోలుకుంది. తిరిగి సినిమాలపై దృష్టి పెడుతోంది. అభిమానులు చూపించిన ప్రేమ, ఆప్యాయతల వల్లే త్వరగా మయోసైటిస్ నుంచి కోలుకున్నానని సమంత చెప్పుకొచ్చింది.


శ్రుతిహాసన్

స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా మానసిక సమస్యలతో ఇబ్బంది పడింది. కొన్ని రోజులపాటు ఈ సమస్యలు ఆమెను తీవ్రంగా వేధించాయి. కొన్ని సందర్భాల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతూ.. ప్రతి చిన్నదానికి అసహనానికి గురవుతుంటుంది. కొన్ని రోజుల పాటు బయటి ప్రపంచానికి దూరంగా ఉంది. మానసిక వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకొని తిరిగి మామూలు మనిషి అయింది. సంగీతం కూడా తనకు ఉపశమనం కలిగించిందని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇతరులతో మనుసు విప్పి మాట్లాడడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని.. తాను అలాగే చేస్తానని శ్రుతిహాసన్ తెలిపింది.

హంసా నందిని

‘ఒకటవుదాం’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అందాల భామ హంసా నందిని. రామయ్యా వస్తావయ్యా, భాయ్, అత్తారింటికి దారేది, ఈగ, అధినేత సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో రొమ్ము క్యాన్సర్ బారిన పడింది హంసా. తనకు అనుమానం కలిగి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. అయినా కూడా అధైర్యపడలేదు.. కొన్నేళ్ల పాటు ఆ వ్యాధితో పోరాడింది. చివరికి విజయం సాధించింది.

సోనాలిబింద్రే

క్యాన్సర్ బారిన పడిన హీరోయిన్లలో సోనాలిబింద్రే ఒకరు. ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న క్రమంలో క్యాన్సర్ బారిన పడింది సోనాలి. దీంతో ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంది. కొన్నేళ్ల పాటు ఆ వ్యాధితో పోరాడి చివరికి విజయం సాధిచింది. ‘‘క్యాన్సర్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. మన జీవిత ప్రయాణం ఎప్పుడూ ఆగిపోకూడదు’’ అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

Related News

OG: బాబాయ్ కంటే ముందు ఓజీ క‌థ నేను విన్నా – వరుణ్ తేజ్

Jani Master: కొరియోగ్రాఫర్ జానీకి భారీ షాక్.. నేషనల్ అవార్డు రద్దు!

Srinu Vaitla : బ్రూస్ లీ డిజాస్టర్ సినిమా కాదు, ఆ సినిమా మంచి లాభాలను తీసుకువచ్చింది

Priyamani: ఇప్పటికీ టార్గెట్ చేస్తూ.. నరకం చూపిస్తున్నారు.. హీరోయిన్ ఎమోషనల్..!

OG Update: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

Harudu Glimpse: కమ్ బ్యాక్ కోసం సిద్ధమయిన హీరో వెంకట్.. ‘హరుడు’ నుండి గ్లింప్స్ విడుదల

Posani: ఎన్ – కన్వెన్షన్ కూల్చడం కరెక్టే.. పోసాని షాకింగ్ కామెంట్..!

×