Jai Hanuman: టాలీవుడ్‌లో అసలు సినిమాటిక్ యూనివర్స్ అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో తెలియని ప్రేక్షకులకు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ను పరిచయం చేశాడు యంగ్ డైరెక్టర్. పైగా ఇతర భాషల్లో ఉన్నట్టుగా యాక్షన్, థ్రిల్లర్‌తో సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేయలేదు. దేవుళ్ల ఆధారంగా ఫిక్షనల్ కథను రెడీ చేసుకొని ‘హనుమాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ‘జై హనుమాన్’తో మరోసారి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేయడానికి సిద్ధమయ్యాడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma). అయితే ఈ మూవీని ఒక బాలీవుడ్ స్టార్ రిజెక్ట్ చేయడం వల్లే అది రిషబ్ శెట్టి చేతికి వచ్చిందని వార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు
‘హనుమాన్’ తర్వాత వెంటనే ‘జై హనుమాన్’ను ప్రారంభిస్తానని, వచ్చే ఏడాదిలోనే దానిని కూడా విడుదల చేస్తానని ఫ్యాన్స్‌కు మాటిచ్చాడు ప్రశాంత్ వర్మ. కానీ మధ్యలో ఇతర ప్రాజెక్ట్స్‌తో చాలా బిజీ అయిపోయాడు. దీంతో ‘జై హనుమాన్’పై అప్డేట్ అందించడానికి తనకు కాస్త సమయం పట్టింది. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తానని అప్డేట్ అందించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. అందులో రిషబ్ శెట్టి హీరోగా నటించనున్నాడని వార్తలు వచ్చినా చాలామంది నమ్మలేదు. కానీ ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్‌లో హనుమంతుడిగా రిషబ్ కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ అవకాశాన్ని ఒక స్టార్ హీరో వదిలేసుకున్నాడని సమాచారం.
Also Read: RKD – ప్రశాంత్ వర్మ టీం అప్… అందుకే నిరంజన్ అవుట్.. మైత్రీ ఇన్..?
అక్కడే కలిశాడు
‘జై హనుమాన్’ సినిమాను ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ఒక బాలీవుడ్ స్టార్ కూడా చేరారు. తనే సన్నీ డియోల్. ముందుగా ‘జై హనుమాన్’ కోసం పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల పేర్లను పరిగణలోకి తీసుకోగా అవేమీ వర్కవుట్ అవ్వలేదు. అందుకే ఏకంగా బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు ప్రశాంత్ వర్మ. అదే సమయంలో అక్కడ పలువురు యాక్టర్లతో పాటు సన్నీ డియోల్‌ను కలిశాడు. ‘జై హనుమాన్’లో సన్నీ డియోల్ హనుమంతుడిగా చేస్తే బాగుంటుందని ఆయనకు కథ వినిపించాడు. కథ, పాత్ర.. అన్నీ ఆయనకు చాలా నచ్చినా కూడా దానిని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది.
మళ్లీ ఆ పాత్ర వద్దు
నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ్’లో ఇప్పటికే హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు సన్నీ డియోల్ (Sunny Deol). మళ్లీ అదే పాత్రను మరో సినిమాలో చేయడం కరెక్ట్ అని ఆయనకు అనిపించలేదట. అందుకే ‘జై హనుమాన్’ (Jai Hanuman)ను రిజెక్ట్ చేశారని సమాచారం. అలా ఈ ఆఫర్ పలు హీరోల చేయి దాటి రిషబ్ శెట్టి (Rishab Shetty) చేతికి వచ్చి చేరింది. ‘కాంతార’ సినిమా తర్వాత కన్నడ మాత్రమే కాకుండా మొత్తం సౌత్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు రిషబ్ శెట్టి. తను హీరోగా నటించడం వల్ల ‘జై హనుమాన్’కు సౌత్ ఇండియాలో మంచి హైప్ లభించే అవకాశం ఉంది.