They Call Him OG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక రాజకీయాల్లోకి వచ్చేముందే పవన్ కళ్యాణ్.. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తరువాత మూడేళ్లకు.. పార్టీ ఫండ్ కోసం సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. అలా పార్టీని నడిపించడానికి పవన్ .. ఒకపక్క రాజకీయాలు.. ఇంకోపక్క సినిమాలు అంటూ రెండు పడవల మీద కాళ్లు వేసి నడుస్తూ వచ్చారు.
అలా పదేళ్లు కష్టానికి ఫలితంగా ఎట్టకేలకు ఈ ఏడాది అయన ఎన్నికల్లో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా మారారు. అయితే అప్పటికే పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ముందే రెమ్యునరేషన్స్ తీసేసుకోవడంతో.. నిర్మాతలు నష్టపోకూడదని.. తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే హరిహర వీరమల్లు క్లైమాక్స్ కు చేరుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా సగం కూడా ఫినిష్ చేసుకోలేదు. ఈ రెండు కాకుండా పవన్ నటిస్తున్న చిత్రం OG.
Shraddha Kapoor: మామూలుగా లేదు శ్రద్ధా కపూర్
కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ DVV దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ఎలాంటి రికార్డులు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు పవన్ ఎన్నికలతో బ్రేక్ పడింది. ఇప్పటివరకు పవన్ లేని సీన్స్ ను సుజీత్ తెరకెక్కించే పనిలో పడ్డాడు.
ఇక ఎట్టకేలకు ఈ మధ్యనే పవన్ OG సెట్ లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. నేడు డైరెక్టర్ సుజీత్ పుట్టినరోజు కావడంతో.. మేకర్స్ ఒక స్పెషల్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి.. తమ డైరెక్టర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేకింగ్ వీడియోలో సుజీత్.. OG కోసం ఎంత కష్టపడుతున్నాడో చూపించారు. ఇక చివర్లో పవన్ కళ్యాణ్.. సుజీత్ భుజం పై చేయి వేసిన షాట్ దగ్గర ఆపేసి హ్యాపీ బర్త్ డే సుజీత్ అని రాసుకొచ్చారు.
Shobhitha dulipala: హల్దీ వేడుకల్లో శోభిత.. చైతూ కనబడడం లేదేంటి..?
మేకింగ్ వీడియోలో పవన్ ఎక్కడైనా కనిపిస్తాడేమో అని ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. చివర్లో ఆయన కనిపించినా.. కేవలం బ్యాక్ మాత్రమే చూపించడంతో.. కొద్దిమేర ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేసినా.. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అన్న డైలాగును గుర్తుచేస్తూ.. పవర్ స్టార్ నీడ కనిపించినా పూనకాలే అని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
It all begins with one word – ACTION 🔥
And what’s left?⁰Just ashes in the FIRESTORM 😉⚰️#HappyBirthdaySujeeth ❤️ #TheyCallHimOG #OG #FireStormIsComing pic.twitter.com/6Elt8x9xuz
— DVV Entertainment (@DVVMovies) October 26, 2024