EPAPER
Kirrak Couples Episode 1

Tollywood Movies : ఒక్క సీన్ తో కోట్లు సంపాదించిన టాలీవుడ్ సినిమాలు ఇవే?

Tollywood Movies : ఒక్క సీన్ తో కోట్లు సంపాదించిన టాలీవుడ్ సినిమాలు ఇవే?

Tollywood Movies : సినిమా తియ్యడం పెద్ద పని.. సినిమాలో నటించే హీరో, హీరోయిన్ల కన్నా సినిమాకు పనిచేసే టెక్నీషియన్లు ఎక్కువగా కష్టపడాలి. ఎంత కష్టపడి సినిమాను తీసినా కూడా కొన్నిసార్లు హిట్ టాక్ ను అందుకోలేవు. సినిమాలు హిట్ అయిన అవ్వకున్నా అందులోని పాటలు లేదా కొన్ని సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. కొన్ని సీన్లు సినిమాలకు హైలెట్ అవుతాయి.. నిజానికి ఆ సీన్ల వల్లే సినిమాలకు వస్తున్నాయి. అలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. ఒక్క సీన్ తో భారీ హిట్ కొట్టిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


కార్తికేయ 2..

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన కార్తికేయ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమా వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటుగా భారీ కలెక్షన్స్ కూడా అందుకుంది. ఇక పాన్ ఇండియా చిత్రం కార్తికేయ టు సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది అయితే ఈ సినిమాలో కృష్ణుడు గొప్పతనాన్ని చెబుతూ అనుపమ్ కేర్ చెప్పిన డైలాగ్ సీన్ సినిమాకు హైలెట్ అయ్యింది. ఈ సీన్ ఒక్కటే సినిమాకు బ్యాక్ బోన్ అయ్యింది.. ఇక సినిమా మొత్తం ఈ సీన్ చుట్టే తిరుగుతుంది. ఇక రెండో పార్ట్ కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో కార్తికేయ 3 కూడా రాబోతుందని సమాచారం..


అఖండ..

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ అఖండ.. ఈ మూవీలో బాలయ్య పెర్ఫార్మన్స్ అదిరిపోయిందనే చెప్పాలి. అందులో అఘోరా పాత్రలో బాలయ్య కనిపిస్తాడు ఆ సీన్ కు థియేటర్లు దద్దరీల్లాయి. సినిమా మొత్తం ఒక ఎత్తు ఆ సీన్ ఒక ఎత్తు అనే చెప్పాలి. అందుకే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఇప్పుడు అఖండ 2 సినిమా కూడా రాబోతుంది.

అంజి..

మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమా అంత మంచి టాక్ ను అయితే అందుకోలేదు. కానీ సినిమాలో ఒక్క సీన్ మాత్రం హైలెట్ అయ్యింది. అంజి సినిమా క్లైమాక్స్ కచ్చితంగా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో చాలా గ్రాఫిక్స్ వాడి సినిమాను చిత్రీకరించారు. కానీ సీన్ హిట్ అయినంతగా సినిమా హిట్ అవ్వలేదు. కానీ కలెక్షన్స్ మాత్రం బాగానే వసూల్ చేసింది.

కల్కి..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ కల్కి.. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో ప్రతి సీన్ అద్భుతం. సినిమా మొత్తానికి నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు ఇందులో నటించారు.. 8500లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు. దీంతో ఈ సినిమా హడావిడి భారీ స్థాయిలో కనిపిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్‌లో సైతం ప్రభాస్ సినిమా షేక్ చేసేసింది. ఇందులో కాంప్లెక్స్ సీన్ అదిరిపోయింది. సినిమాకు ఇదే హైలెట్ అని ఫ్యాన్స్ అంటున్నారు.

దేవర..

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ షార్క్ తో ఫైట్ సీన్ చాలా బాగుందని ఆయన ఫ్యాన్స్ అంటుంది.. ఇక రెండు రోజుల్లోనే 230 కోట్లు రాబట్టింది..

Related News

Vishwambhara Release Date : చికెన్ గున్యా ఎఫెక్ట్… రిలీజ్ డేట్ మార్చుకుంటున్న చిరు, చరణ్..!

Ntr : ఆ ఐదుగురు డైరెక్టర్స్ కు లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఇది నీకే సాధ్యం భయ్యా..

Devara 2Days Collections: సునామీ సృష్టించిన ఎన్టీఆర్.. వీకెండ్ కలిసొస్తోందా..?

YouTuber: లైంగిక వేధింపుల కేసులో మరో ఫేమస్ యూట్యూబర్.. అతడే ఆదర్శం..!

Samantha: స్టైలిష్ కాదు.. చాలా కాస్ట్లీ గురూ.. సమంత వాచ్ ఖరీదు తెలిస్తే షాక్..!

Akkineni Family: వారసుల కోసం అతడిని తొక్కేశారా.. ఆ కుట్ర వెనుక కారణం ..?

Big Stories

×