EPAPER

Prabhas: ఆ హీరోయిన్స్ తో ప్రభాస్ ఎఫైర్స్.. తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

Prabhas: ఆ హీరోయిన్స్ తో ప్రభాస్ ఎఫైర్స్.. తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

Prabhas: ఆరడుగులు ఉంటాడా.. ఏడడుగులేస్తాడా.. అని ప్రతి అమ్మాయి పాడుకొనే కటౌట్ అతని సొంతం. ఇండస్ట్రీ అంటే వివాదాలు ఉండాలి..  అసలు వివాదాలు లేకుండా ఏ హీరో అయినా ఉంటాడా.. ? అన్న ప్రశ్నకు సమాధానం అతను.  ఒక్క సినిమా కోసం  ఐదేళ్ల టైమ్ ఇచ్చాడా.. ? ఎవరు ఆ హీరో అన్న ప్రశ్నకు.. జవాబు అతనే. మంచితనానికి నిలువెత్తు నిదర్శనం.. గుణంలో రాముడు.. సహాయం చేయడంలో కర్ణుడు.. తెలుగు ఇండస్ట్రీకే రాజు.. రారాజు .. ఉప్పలపాటి సూర్యనారాయణ ప్రభాస్  రాజు.


సీనియర్ హీరో కృష్ణంరాజు తమ్ముడు కొడుకుగా ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటిసారి ప్రభాస్ లుక్ ను చూసి.. వీడేంటి .. హీరో ఏంటి.. ? అన్ని నవ్వినవారు ఉన్నారు. అదే ప్రభాస్ ను బాహుబలిలో చూసి వీడేరా హీరో అని అన్నవారు  ఉన్నారు. హిట్ పడితే పొంగిపోవడం.. ప్లాప్ పడితే కుంగిపోవడం అలవాటు లేని  ఏకైక హీరో ప్రభాస్. సాధారణంగా ఏ హీరో అయినా.. కథ నచ్చితే ఓకే చేస్తారు. కానీ, ప్రభాస్.. తనవద్దకు వచ్చిన డైరెక్టర్స్ తనను నమ్మి సినిమా తీయాలనుకుంటున్నారు. అలాంటివారిని తిరిగి ఎలా పంపిస్తాం అని మొహమాటంతో కథలను ఓకే చేసిన రోజులు ఉన్నాయట.

ఇండస్ట్రీ ..  రూమర్స్ కు పెట్టింది పేరు. ఒక హీరో, హీరోయిన్ కలిసి కనిపిస్తే.. వారిద్దరికీ పెళ్లి చేసి పిల్లలను కూడా పుట్టించేస్తారు. అలాంటి ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎలాంటి వివాదం లేని హీరో ఎవరైనా ఉన్నారంటే.. అది ప్రభాస్ రాజు మాత్రమే. ఇండస్ట్రీలో ఒకరితో గొడవపడినట్లు కానీ, మరొకరి విషయంలో తల దూర్చిన్నట్లు కానీ, దాఖలాలు లేవు. చిన్నతనం నుంచి ప్రభాస్ చాలా ఇంట్రోవర్ట్. ఎవరితోనూ ఎక్కువ కలవడు. అతనికి ఉన్న ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది. కానీ, ఆ తక్కువమందితో ప్రభాస్ ఉండే తీరు నెక్ట్స్ లెవెల్.


ఇక ఈ గ్లామర్ ప్రపంచంలో  ప్రభాస్  చాలామంది హీరోయిన్స్  కు ఎఫైర్స్ నడిపినట్లు వార్తలు వచ్చాయి.  ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఆయన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో ప్రభాస్ పెళ్లి జరిగింది. అయితే అవేమి నిజం కాకపోయినా.. ఇప్పటివరకు ప్రభాస్ పై వచ్చిన రూమర్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం.

మొట్టమొదటి సారి ప్రభాస్.. త్రిష ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.   వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు.  త్రిష హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం వర్షం. ఆ సమయంలోనే ఆమె డార్లింగ్ తో ప్రేమాయణం నడిపిందని టాక్ నడిచింది.  కానీ, అందులో నిజమే లేదని క్లారిటీ వచ్చింది. ఇక త్రిష కాకుండా చాలా మంది హీరోయిన్స్ నేమ్స్ యాడ్ అయ్యాయి కానీ, అందులో కూడా ఏవి నిజాలు కాదని అప్పట్లో ప్రభాస్ నే స్వయంగా చెప్పుకొచ్చాడు.

ఇక ఇండస్ట్రీ మొత్తం ఒక ఊపు ఊపిన  రూమర్.. ఒక రాజకీయ నేత కుమార్తెతో ప్రభాస్ ప్రేమాయణం నడిపాడని..  ఆమెకు ప్రభాస్ అంటే ప్రాణమని, ఎలాగైనా డార్లింగ్ ను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేసిందని చెప్పుకొచ్చారు.  ఆ తరువాత కృష్ణంరాజు కలుగజేసుకొని ఆ పెళ్లి  తమకు ఇష్టం లేదని చెప్పడంతో.. సదురు పొలిటిషయన్.. తన కుమార్తెకు వేరే పెళ్లి చేసినట్లు సమాచారం.  మరి ఇందులో ఎంతవరకు నిజమున్నది అనేది ఇప్పటివరకు ఎవరికి  తెలియదు.

ఇండస్ట్రీలో ఒక హీరోహీరోయిన్ ను చూస్తే.. బయట కూడా వారు జంటగా ఉంటే బావుంటుంది అనుకుంటాం. అలాంటి పెయిర్స్ లో మొదట ఉండే జంట ప్రభాస్ – అనుష్క.  బిల్లా సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తరువాత మిర్చి, బాహుబలి, బాహుబలి 2 సినిమాల్లో కలిసి నటించారు. ప్రభాస్ పక్కన వేరే ఏ హీరోయిన్ వచ్చినా.. అనుష్క ఉంటేనే కళ. వారిద్దరి మధ్య బాండింగ్ అలా ఉండేది. వారిద్దరి జంటను చూసి ముచ్చటపడని అభిమాని లేడు అంటే అతిశయోక్తి కాదు. వీరు పెళ్లి చేసుకుంటే ఇప్పటికీ చూడాలనుకున్నవారు చాలామందే ఉన్నారు. అయితే తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని వారు క్లారిటీ ఇచ్చేశారు.

ఇక అనుష్క తరువాత ప్రభాస్ తో పెళ్లి వార్తల్లో నిలిచిన బ్యూటీ అంటే బాలీవుడ్ అందగత్తె కృతి సనన్. ఆదిపురుష్  సినిమాలో వీరిద్దరూ సీతారాములుగా కనిపించారు. ఇక ఈ సెట్ లో ప్రభాస్- కృతి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలకు హీరో వరుణ్ ధావన్ ఆజ్యం పోసాడు. ఒక షోలో కృతి టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉందని సరదాగా చెప్పాడు. దాన్ని సీరియస్ గా తీసుకున్న ఫ్యాన్స్.. డార్లింగ్ కు కాబోయే భార్య అని ఫిక్స్ చేశారు. ఇక ఈ వార్తలకు డార్లింగ్ ఫుల్ స్టాప్ పెట్టాడు. దీంతో ఇది కూడా రూమర్ అని తేలిపోయింది.

ప్రభాస్ ఈరోజుతో 45 వ పడిలోకి అడుగుపెట్టాడు. ఎప్పుడెప్పుడు డార్లింగ్ ఒక ఇంటివాడు అవుతాడా.. ? అని  ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి.. ప్రస్తుతం ప్రభాస్ కోసం మంచి అమ్మాయిని వెతుకుతున్నామని, త్వరలోనే తీపి కబురు చెప్తామని చెప్పుకొచ్చారు. కనీసం ఈ 45 లోనైనా  డార్లింగ్ ఒక ఇంటివాడు అవుతాడేమో అన్న ఆశతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరికను డార్లింగ్ నెరవేరుస్తాడా.. ? అనేది  కాలమే నిర్ణయించాలి.

Related News

War 2: వార్ 2 సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫొటోస్ లీక్.. ఏమున్నాడ్రా బాబు

Unstoppable 4 : బాలయ్య టాక్ షోకి ‘గేమ్ ఛేంజర్’… ఇది మామూలు ప్లాన్ కాదు భయ్యో

Laggam Movie Review : ‘లగ్గం’ మూవీ రివ్యూ

Chiranjeevi : 28న చిరుకు అక్కినేని పురస్కారం… ఎవరి చేతుల మీదు గానో తెలుసా..?

RajaSaab: ఇద్దరు కాదు.. ముగ్గురు అంట.. తాతమనవడు.. ఇంకా.. ?

Kannappa : శివయ్యా… నీపైనే భారమంతా… కేదారనాథ్ యాత్రలో కన్నప్ప టీం..

Suriya: టాలీవుడ్ సీనియర్ హీరోల చుట్టూ తిరుగుతున్న తమిళ్ హీరో.. బాగానే ప్లాన్ చేశాడుగా..?

Big Stories

×