EPAPER

Real life Teachers: ఈ నటులు..రియల్ లైఫ్ లోనూ టీచర్లే… నేడు టీచర్స్ డే

Real life Teachers: ఈ నటులు..రియల్ లైఫ్ లోనూ టీచర్లే… నేడు టీచర్స్ డే

Thease actors real life teachers.. Teachers Day special story: గురు బ్రహ్మ..గురు విష్ణు..గురుదేవో మహేశ్వర అన్నారు పెద్దలు. గురువు అంటే ఓ వెలుగు, ఓ మార్గదర్శి..తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులదే. తల్లిదండ్రులు ఇంట్లో క్రమశిక్షణ నేర్పితే..గురువు సమాజంలో ఎలా మసలుకోవాలో..నడక, నడత అన్నీ నేర్పుతాడు. ఒక ఉత్తమ గురువు ఉత్తమ విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. మన సినిమాలలోనూ విద్యావ్యవస్థపై చాలా సినిమాలే వచ్చాయి. కొందరు టీచర్ పాత్రలు కూడా పోషించారు. మహానటుడు ఎన్టీఆర్ బడిపంతులు సినిమాలో ఉత్తమ గురువుగా నటించి మెప్పించారు. మెగా స్టార్ చిరంజీవి కూడా మాస్టర్ అనే మూవీలో నటించి మెప్పించారు. రీసెంట్ గా ధనుష్ సార్ అనే మూవీ చేసి మెప్పించారు. అయితే టీచర్లుగా చేసి సినిమా ఫీల్డ్ కి వచ్చిన కొందరు నటీనటుల గురించి నేటి గురుపూజోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..


విలక్షణ నటుడు మోహన్ బాబు

నటుడు మోహన్ బాబు 500 పైగా సినిమాలలో వైవిధ్యభరిత నటనతో..విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. మొదట్లో దర్శకత్వ విభాగంలో పనిచేసేవారు. దర్శకరత్న దాసరి వంటి అగ్ర దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ స్వర్గం నరకం మూవీతో హీరో స్టేటస్ అందుకున్నారు. అయితే ఆ మూవీలో హీరోనే అయినప్పటికీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో మొదట్లో అన్నీ విలన్ పాత్రలే వచ్చాయి. తర్వాత హీరోగా మారి కలెక్షన్ కింగ్ అనే బిరుదు కూడా సంపాదించుకున్నారు. నిర్మాతగా 50కి పైగా సినిమాలు అందించారు. తన ఇద్దరు కొడుకులు, కూతురు కూడా సినీ రంగంలోనే ఉన్నారు. అయితే సినిమాలకు రాక ముందు భక్తవత్సలం నాయుడు పేరు. తిరుపతిలో పుట్టి పెరిగిన మోహన్ బాబు కొంత కాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత సినిమా రంగంపై మమకారంతో సినీ ఫీల్డ్ కు వచ్చి అపూర్వ విజయాలు అందుకున్నారు.


యోగా టీచర్ అనుష్క

హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్న రాజబాబు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రాజబాబు సినీ రంగానికి రాకముందు ఆయన టీచర్ గా పనిచేశారు. ఒక పక్క టీచర్ గా పనిచేస్తూ స్టేజ్ నాటకాలు వేసేవారు. మద్రాసు చేరుకుని అక్కడ కూడా ఓ నిర్మాత పిల్లలకు ట్యూటర్ గా పనిచేస్తూ సమాజం అనే మూవీతో ఎంట్రీ ఇచ్చారు. హాస్య నటుడిగా తెలుగు సినిమాలలో చెరగని ముద్ర వేశారు. ఇక బాహుబలి మూవీలో దేవసేనగా అదరగొట్టిన అనుష్కశెట్టి సినిమాలకు రాకముందు యోగా టీచర్ గా చేసేవారు. సూపర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క భారీ బడ్జెట్ చిత్రాలలో ప్రధాన భూమిక పోషించారు. డైలాగ్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ కూడా సినిమాలకు రాకముందు లెక్చరర్ గా పనిచేశారు.

లెక్చరర్ గా బ్రహ్మానందం

బ్రహ్మానందం విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుని వెయ్యికి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ బుక్ రికార్డును క్రియేట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ బిరుదును కూడా ఇచ్చింది. అయితే బ్రహ్మానందం సినిమాలకు రాకముందు లెక్చరర్ గా తన సేవలను అందించారు. మొదట్లో దూరదర్శన్ ఆ తర్వాత జంధ్యాల సినిమా అహనా పెళ్లంట మూవీలో అరగుండు బ్రహ్మానందంగా కెరీర్ స్టార్ట్ చేశారు. తెలుగు సినీ రంగంపై తన నటనతో బలమైన ముద్రను వేశారు. ఇంకా ఎమ్మెస్ నారాయణ, గుండు సుదర్శన్, అనంద్ మోహన్ వంటి వాళ్లు అనేకమంది పాఠాలు చెప్పే స్థాయి నుంచి వచ్చి సినిమా రంగంలో అద్భుతాలు సృష్టించారు. మనం పుట్టినప్పటినుంచి మరణించేదాకా ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకోవడానికే ప్రయత్సిస్తుంటాం. ఆ ప్రయత్నానికి బాసటగా నిలిచి తన గతానుభవాన్ని వారధిగా మలచి మనలను ముందుకు నడిపించే వారే గురువు. అందుకే గురువును ఎల్లవేళలా గుర్తుంచుకోవడం మన కర్తవ్యం.

 

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×