EPAPER

Naga Chaitanya : నాగార్జున కొడుకు నాగచైతన్య ఆస్తుల విలువ ఎంతో తెలుసా? శోభితా వల్ల కలిసొచ్చేది అంతంత మాత్రమేనా?

Naga Chaitanya : నాగార్జున కొడుకు నాగచైతన్య ఆస్తుల విలువ ఎంతో తెలుసా? శోభితా వల్ల కలిసొచ్చేది అంతంత మాత్రమేనా?

The property value of Naga chaitanya.. Samantha..Sobhita and their Income sources: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ట్రెండింగ్ గా నిలిచిన వార్త ఎదైనా ఉందా అంటే అది నాగచైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్. సమంత, నాగచైతన్య త్వరలోనే కలవబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్న వేళ నాగచైతన్య, శోభితలు ఒక్కటయ్యారనే వార్త సినీ వర్గాలతో సహా సామాన్య ప్రేక్షకులకు సైతం షాక్ ఇచ్చినట్లయింది. ఏది ఏమైనా ఇద్దరూ ఇష్టపడ్డారు. ఇక వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగాలని చైతూ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే నాగచైతన్య నటుడికి, అక్కినేని వారసుడిగా అతని ఆస్తులు ఎక్కువా లేక మోడలింగ్, వెబ్ సిరీస్, సినిమాల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్న శోభిత బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆమె ఆస్తులు ఎక్కువా లేక చైతూ ఆస్తులు ఎక్కువా అని వాటి వివరాలు తెలుసుకోవాలని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు చైతూ పేరిట ఉన్న స్థిరాస్తులు, చరాస్తులు వాటి వివరాలు తెలుసుకుందాం..


చైతూ నికర ఆస్తులు ..

నాగచైతన్య నికర ఆస్తులు రూ.154 కోట్లు. నాలుగు దశాబ్దాలుగా నాగార్జున నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అంతకు ముందు అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని తాను కొనసాగిస్తూ వస్తున్నారు. శోభిత దూళిపాళ నికర ఆదాయం ఏడు నుంచి పది కోట్లు మాత్రమే. నాగచైతన్య ఒక్కో సినిమాకు ఎనిమిది కోట్లు తీసుకుంటారని సమాచారం. అయితే చైతూకు వరుస హిట్లు పడితే ఈ ఫిగర్స్ మారతాయి. హిట్స్ అండ్ ఫ్లాప్స్ ను బట్టి ఈ ఫిగర్లు ఒక్కోసారి తగ్గవచ్చు..పెరగవచ్చు.. అంటే ఓవరాల్ గా రూ.5 నుంచి రూ.10 కోట్ల మధ్య పారితోషికం తీసుకుంటారు నాగచైతన్య. 2022లో నాగచైతన్య క్లౌడ్ కిచెన్ షోయు ఫ్రాంచెయిస్ ప్రారంభించారు. ఉత్తరాది, దక్షిణాది వంటకాలను తయారు చేయించి వివిధ స్టార్ హోటళ్లకు సప్లై చేస్తారు. 2024లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోనూ ప్రారంభించారు. సోషల్ మీడియా ఇన్ స్టాలో 7.4 మిలియన్ ఫాలోవర్స్ కలిగివున్న నాగచైతన్య సోషల్ మీడియాలో లో ప్రొఫైల్ పాటిస్తుంటారు. మైంత్ర,ఎయిర్ టెల్, క్లోజప్ పేస్ట్ వంటి కమర్షియల్ యాడ్స్ లో నటించారు.


రూ.15 కోట్లతో ఇల్లు కొనుగోలు

వీటితోపాటు ఆదిత్య బిర్లా గ్రూప్ నకు సంబంధించిన తాస్య,తరుణ్ తహిలానీ, ఐస్ క్రీమ్ బ్రాండ్ మాగ్నమ్ ఇండియా, ఫర్నిచర్ బ్రాండ్ దాసోస్ కేబినెట్స్ తదితర సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేశాడు. నాగచైతన్య 2023తో జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో రూ.15 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. సమంత, చైతూ ఇద్దరూ ఆ ఇంట్లో కొంతకాలం ఉన్నారు. నాగార్జున కూడా రూ.45 కోట్లు ఖరీదు చేసే ఇంటిలో నివాసం ఉంటున్నారు.
కోట్ల విలువ చేసే కార్లు, టూ వీలర్స్ ఉన్నాయి. రీసెంట్ గా రూ.2.12 కోట్ల విలువైన నిస్సాన్ జీటి ఆర్ మోడల్ కారును కొనుగోలు చేశారు.

సమంత ఆస్తులు

ఇక సమంత నికర ఆస్తుల విలువ రూ.115 కోట్లు. సినిమాలు, కమర్షియల్ యాడ్స్ ద్వారా ఆమె సొంతంగా సమకూర్చుకున్న ఆస్తి. ఒక్కో సినిమాకు రూ.3 నుంచి నాలుగు కోట్లు వసూలు చేస్తారు సమంత. ఇక సమంత కొన్ని ఫ్రాంచైజీలను నిర్వహిస్తున్నారు. అలాగే కమర్షియల్ యాడ్స్ లోనూ నటిస్తున్నారు. సమంతకు ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం అంటే బాగా ఇష్టం. ఆమె వద్ద లాండ్ రోవర్ రేంజ్ వోగ్ కారు ఉంది. దాని విలువ రూ.2.26 కోట్లు. పోర్స్చే కేమాన్ జీటీఎస్ కారు కూడా ఉంది. దాని ఖరీదు రూ.146 కోట్లు. ఇక 72 లక్షల ఖరీదు చేసే జాగ్వర్ ఎక్స్ ఎఫ్, రూ.3.30 కోట్లు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్, రూ.97 లక్షల ఖరీదు చేసే ఆడి కారు, రూ.1.70 కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ కారు ఉంది.

 

 

Related News

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Big Stories

×