EPAPER

KA Movie : ‘క’లలో కూడా అనుకోలేదేమో…. స్క్రిన్స్ పెంచాలని ఆడియన్స్ డిమాండ్..

KA Movie : ‘క’లలో కూడా అనుకోలేదేమో…. స్క్రిన్స్ పెంచాలని ఆడియన్స్ డిమాండ్..

Ka Movie Theaters : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘క’. దీపావళి కానుకగా అక్టోబర్ 31 న భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ వసూల్లతో దూసుకుపోతుంది.. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. అంతేకాదు గతంలో ఏ సినిమాకు లేని విధంగా ఈ మూవీకి తెలుగు ప్రజలు ఆసక్తి చూపిస్తుండటం సినిమాకు ప్లస్ అయ్యింది. రోజు రోజుకు డిమాండ్ పెరగడంతో ప్రజల కోరిక మేరకు మూవీ స్క్రీన్స్ పెంచుతున్నట్లు ప్రకటించిన మేకర్స్, తాజాగా తెలుగు రాష్ట్రాల్లో 186 థియేటర్లను యాడ్ చేసినట్లు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.


తెలుగు ప్రేక్షకుల నుంచి ‘ క ‘ మూవీకి రెస్పాన్స్ పెరుగుతుంది. అంతేకాదు డే బై డే ఈ చిత్రానికి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ‘క’ సినిమా 2 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర రూ .13.11 కోట్ల రూపాయల గ్రాస్ ను అందుకుంది.. ఇంకా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ మూవీ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాదు విడుదలైన రెండు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఇక మూడోవ రోజు బాక్సాఫీస్ దగ్గర బుకింగ్స్ బాగున్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే ‘క’ ఫస్ట్ వీక్ భారీ వసూళ్లను సాధించిబోతున్నట్టు తెలుస్తుంది. క మూవీకి వస్తున్న రెస్పాన్స్ ను చూసి హీరో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అయ్యాడు.. నిన్న కిరణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

ఇప్పటివరకు తెలుగులో రానటువంటి థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉందనే ప్రేక్షకులు చెబుతున్నారు. కిరణ్ అబ్బవరం తన కెరీర్ లో మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా కు డిమాండ్ పెరగడంతో ప్రజల కోరిక మేరకే ఇంకా కొన్ని స్క్రీన్ లను పెంచుతున్నట్లు తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.. ఇక ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే, బలగం జయరాం తదితరులు నటించారు.. ఇక వంద కోట్ల క్లబ్ లోకి వస్తుందేమో చూడాలి..


Tags

Related News

Thandel: తండేల్.. ఫిబ్రవరి రిలీజ్ వెనుక ఇంత కథ ఉందా..?

Oscars 2025 : ఆస్కార్ రేసులో ఇండియన్ షార్ట్ ఫిల్మ్… కేన్స్ లోనూ బెస్ట్ మూవీగా అవార్డు

Rahasyam Idam Jagath: ఇప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని కథ ‘రహస్యం ఇదం జగత్‌’: దర్శకుడు కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌

Dulquer Salmaan Remuneration : కోట్లు కొల్లగొట్టిన ఈ లక్కీ భాస్కర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Lokesh Kanagaraj: ‘కూలీ’లో నాగార్జున క్యారెక్టర్ రివీల్ చేసిన లోకేష్.. పూనకాలే

Allu Arjun’s Pushpa 2 : నిర్మాతలు మాట తప్పుతున్నారా..? ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితేంటి..?

Manchu Manoj : కెరీర్ ను నిలబెట్టుకోవడానికి తండ్రి బాటలో… మంచు మనోజ్ విలన్ వేషాలు వర్కవుట్ అయ్యేనా?

Big Stories

×