Lucky Bhaskar : ఈ ఏడాది దీపావళికి సినిమాల సందడి కాస్త ఎక్కువనే ఉంది. ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వడంతో పాటుగా అందులోనూ అన్ని సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి.. నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. దీపావళి విన్నర్ సినిమాల లిస్ట్ లో రెండో స్థానంలో ‘లక్కీ భాస్కర్ ‘ మూవీ ఉంది. ఈ మూవీ 40 కోట్ల వరకు మూడు రోజులకు రాబట్టింది.. ఈ ఆదివారం కలెక్షన్స్ రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. కూల్ గా, బ్యూటీ ఫుల్ గా సాగిన ఈ మూవీ స్టోరీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..
రీసెంట్ బ్లాక్ బాస్టర్ మూవీ ‘లక్కీ భాస్కర్ ‘ లో హీరోగా దుల్కర్ సల్మాన్ నటించగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. వెంకీ అట్లూరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను డైరెక్టర్ రివిల్ చేశారు. ఆయన మూవీ సక్సెస్ అయిన సందర్బంగా డైరెక్టర్ పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈయన ఓ ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక సంచలన నిజాన్ని బయటపెట్టాడు.. ఈ సినిమా స్టోరీని డైరెక్ట్ గా దుల్కర్ కోసం రాసుకోలేదట.. ఈ మూవీని నాని, లేదా నాగ చైతన్యతో చేద్దామని అనుకున్నాడట.. అయితే ఆ ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో దీనికి నో చెప్పారట..
అయితే ఈ స్టోరికి ధనుష్, దుల్కర్ అనుకున్నాడట.. ఇప్పటికే ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ మూవీకి నో చెప్పాడట దాంతో ఈ మూవీ దుల్కర్ సల్మాన్ దగ్గరకు వెళ్లిందట.. అలా ఆ హీరో ఒప్పుకోవడంతో సినిమాను ఆయన చేశారు. దీపావళి కానుకగా రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మూడు రోజులకు గాను 40 కోట్లకు పైగా రాబట్టింది. ఈ వీకెండ్ ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.. ఇక ఇదే జోష్ తో లాంగ్ రన్ కొనసాగితే సినిమా 500 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘లక్కీ భాస్కర్’ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయకగా నటించింది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా… శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వైఫ్ సాయి సౌమ్య సంయుక్తంగా లక్కీ భాస్కర్ ను నిర్మించారు.