EPAPER

Bandla Ganesh Vs Nowhera Shaik: ముదురుతున్న బండ్లగణేష్-నౌహీరా షేక్ వివాదం.. సీన్ లోకి ED

Bandla Ganesh Vs Nowhera Shaik: ముదురుతున్న బండ్లగణేష్-నౌహీరా షేక్ వివాదం.. సీన్ లోకి ED
telangana news today,

Bandla Ganesh Vs Nowhera Shaik Issue: బండ్ల గణేష్‌, నౌహీరా షేక్‌ మధ్య కొనసాగుతున్న ఇంటి వివాదం తీవ్రమవుతోంది. తాజాగా ఈ వివాదంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఏ ఇంటి గురించి అయితే వివాదం మొదలైందో.. ఆ ఇళ్లు ఈడీ అటాచ్‌లో ఉందని.. దానిని నౌహీరా అమ్మాలని చూస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


మరోవైపు నౌహీరా షేక్‌తో వివాదంపై పోలీసులను ఆశ్రయించారు సినీ నిర్మాత బండ్ల గణేష్‌ కుమారుడు హీరేష్‌. ఫిలింనగర్‌లోని నౌహీరా షేక్‌కు చెందిన ఇంట్లో 2023 నుంచి హీరేష్‌ అద్దెకు ఉంటున్నారు. అయితే.. ఆ ఇంటిని అమ్ముతున్నట్టు తెలియడంతో.. ఆ ఇల్లును కొనుగోలు చేసేందుకు 3 కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు హీరేష్‌. ఇంతలోనే ఆ ఇల్లు ఈడీ కేసులో ఉన్నట్టు తెలియడంతో పూర్తిగా నగదును చెల్లించలేదు. దీంతో మిగిలిన డబ్బును చెల్లించాలని తనపై ఒత్తిడి చేయడమే కాకుండా.. ఇల్లును ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తోందని.. అంతేకాకుండా 10 మంది రౌడీలతో ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ హీరేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఓ వైపు పరస్పర ఆరోపణలు, డైలాగ్ వార్ కొనసాగుతుండగానే బండ్ల గణేష్‌, నౌహీరా షేక్‌ అనుచరుల మధ్య ఘర్షణ విజువల్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బండ్ల గణేష్‌ తమ ఇంటిని ఖాళీ చేయడం లేదని.. అడిగితే బెదిరిస్తున్నాడంటూ ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహానీ ఉందంటూ ఆమె ఓ వీడియోను రిలీజ్‌ చేశారు.


Read More:  మీ ఫోన్లలోకి ‘హనుమాన్’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

మరోవైపు నౌహీరాను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ ఓ ఆడియో టేపు విడుదల చేశారు. ఆమెను తన చెల్లెమ్మగా పేర్కొంటూ .. ఇల్లు ఆమెదేనని .. తాను ప్రతి నెలా రెంట్ పే చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు.

హీరా గ్రూప్ చైర్‌పర్సన్ నౌహీరా షేక్. అంతేకాదు హీరా గోల్డ్‌ స్కామ్‌లో ప్రధాన నిందితురాలు. ఇప్పటికే ఈమెపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. అంతేకాదు హీరాగ్రూప్‌కు చెందిన దాదాపు రూ. 400 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ కూడా చేసింది.

Read More: ఊరుపేరు భైరవకోన ఫస్ట్ డే కలెక్షన్స్.. ఓటీటీలోకి ఎప్పుడంటే..?

స్కీమ్ పేరుతో హీరా గోల్డ్ సంస్థ 5 వేల కోట్ల స్కామ్ చేసినట్లు గతంలో ఈడీ గుర్తించింది. కంపెనీ రూల్స్ ఉల్లంఘించి మోసాలకు పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే ఏడాదికి 36 శాతం అధికంగా చెల్లిస్తామని చెప్పి దేశవ్యాప్తంగా లక్షల మంది వద్ద 5 వేల కోట్ల మేర వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టారు. ఈ నిధులను షెల్‌ కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. 2018లో మనీలాండరింగ్‌ చట్టం కింద హీరా గోల్డ్ సంస్థపై కేసు నమోదు చేసింది.

అంతేకాదు పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు నౌహీరా షేక్ స్థలాలు అమ్మినట్లు గతంలోనే గుర్తించింది ఈడీ. షోలాపూర్ సత్వా సంస్థకు స్థలాలు అమ్మారు నౌహీరా. ఆ సంస్థ కార్యాలయాల్లో కూడా ఈడీ సోదాలు చేసింది. షోలాపూర్ సత్వా, SA బిల్డర్స్, నీలాంచల్ టెక్నో క్యాట్స్‌లో ఈడీ అక్రమాలు గుర్తించింది. పలు షెల్ కంపెనీలకు హీరా గోల్డ్‌ సంస్థ నుంచి నిధులు బదిలీ అయినట్టు గుర్తించారు. ప్రస్తుతం బండ్ల గణేష్‌తో వివాదానికి కారణమైన ఇంటిని కూడా ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్నదే.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×