EPAPER

Leo Collection : కొత్త రికార్డులు సెట్ చేస్తున్న లియో.. నాలుగు రోజుల్లో..?

Leo Collection : కొత్త రికార్డులు సెట్ చేస్తున్న లియో.. నాలుగు రోజుల్లో..?
leo movie collection

Leo Collection : తమిళ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్.. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లియో. కొంతకాలంగా విజయ్ నటిస్తున్న తమిళ్ చిత్రాలు వరుసగా తెలుగులో డబ్ అవుతూ వస్తున్నాయి. కలెక్షన్స్ పరంగా చూస్తే.. విజయ్ డబ్బింగ్ సినిమాలకు తెలుగులో మంచి కలెక్షన్స్ వచ్చాయి. దాంతో లియోకి కూడా మంచి వసూళ్లే వస్తాయన్న అంచనాలున్నాయి. సినిమాపై హైప్ పెంచేందుకు ప్రమోషన్స్ భారీగా చేశారు. దసరాకి లియో, బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు తో పోటీ పడుతూ బరిలోకి దిగింది.


గట్టి పోటీ మధ్య కూడా మంచి వసువులను రాబడుతూ దూసుకు వెళ్తోంది లియో చిత్రం. మాంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా.. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొత్తం బడ్జెట్ రూ.300 కోట్లు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇరు తెలుగు రాష్ట్రాలలో రికార్డ్ స్థాయి వసూళ్లను రాబట్టింది

ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ చిత్రం రూ.146.15 కోట్ల వసూళ్లతో, ఈ సంవత్సరంలో విడుదలైన సినిమాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లను సాధించిన మూవీగా లియో.. సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.


అలాగే తమిళ ఇండస్ట్రీలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ గా లియో నిలిచింది. సినిమా రిలీజై నాలుగు రోజులు అవుతున్నా.. వసూళ్లలో జోరు ఏమాత్రం తగ్గలేదు. నాలుగు రోజుల్లో సుమారు 405.5 కోట్ల రూపాయల వసూళ్లను సొంతం చేసుకుంది లియో. లాంగ్ లెన్త్ లో వసూళ్లు మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. మంచి పండుగ సీజన్ లో సినిమా విడుదల చేయడం చిత్రబృందానికి కలిసొచ్చింది.

ఇక ఈ మూవీలో విజయ్ సరసన త్రిష నటించగా.. సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు.

లోకేష్ మల్టివర్స్ లో భాగమైన ఈ మూవీలో సూపర్ హిట్ గా నిలిచిన కార్తీ ఖైదీ, కమల్ విక్రమ్ చిత్రాల ఝలక్ ను కూడా మిక్స్ చేయడం మరొక హైలెట్. సామాన్యంగా బ్రతికే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం తిరిగి తన గతంలోకి ఎలా వెళ్తాడు అనే కామన్ కాన్సెప్ట్ ని అద్భుతంగా తెరకెక్కించాడు లోకేష్. అక్టోబర్ 19వ తారీఖున విడుదలైన ఈ చిత్రం.. ఒక్క తమిళనాడులోని విడుదలైన నాలుగు రోజులలోపు రూ.100 కోట్లకు పైగా ఈ మూవీ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మూవీ కోసం విజయ్ అందుకున్న రెమ్యునరేషన్ అచ్చంగా రూ.120 కోట్లు కాగా డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ రూ.10 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రూ.10 కోట్లు పారితోషికం పుచ్చుకున్నారు.

పండగ సెలవులు పూర్తయినా.. ఈ మూవీ కలెక్షన్స్ కు మాత్రం బ్రేక్ పడదనే అంటున్న విజయ్ అభిమానులు. పైగా ఈ మూవీకి అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ లెవెల్ లో ఉంది. దసరా కు మూడు చిత్రాలు బరిలోకి దిగినా రవితేజ టైగర్ నాగేశ్వరరావు పోటీలో బాగా వెనకబడిపోయింది. లియో, భగవంత్ కేసరి మాత్రం నువ్వా-నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఈ రెండింటిలో.. దసరా బ్లాక్ బస్టర్ గా ఏది నిలుస్తుందో త్వరలోనే తెలుస్తుంది.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×